నిజామాబాద్

ఎంపి కవిత వ్యూహం ఫలిస్తే పసుపు రైతులకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, మార్చి 24: దశాబ్దాల తరబడి పసుపు రైతులు కలలు కంటున్న పసుపు బోర్డు ఏర్పాటుపై నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టడంతో రైతులు ఆసక్తిగా గమనిస్తున్నారు. దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాల్లోనే పసుపు పంట సాగవుతున్న నేపథ్యంలో పసుపు బోర్డు ఏర్పాటుతోనే రైతాంగానికి న్యాయం జరుగుతుందన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా స్పష్టమవుతోంది. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలంటూ చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు అలుపెరుగని పోరాటం చేశారు. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనకు ఎంపి కవిత సంఘీభావం ప్రకటించి, పసుపు బోర్డు ఏర్పాటయ్యేంత వరకు రైతుల వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఆనాటి నుండి పసుపు బోర్డు ఏర్పాటుపై అలుపెరుగని పోరాటం చేస్తున్న జిల్లా ఎంపి కవిత, దీనికోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. పసుపు ఆధారిత పరిశ్రమలను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు గాను పతాంజలి గ్రూప్ ట్రస్టి, ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ను కూడా కలిశారు. పసుపు ఆధారిత పరిశ్రమల గురించి వివరించేందుకు పతాంజలి ట్రస్ట్ సభ్యులను కూడా ఆర్మూర్ ప్రాంతానికి రప్పించి, రైతులు సాగు చేస్తున్న పసుపును చూయించారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్రానికి లేఖ రాయాలని రాందేవ్‌బాబాను కూడా కోరారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కలిసి పసుపు బోర్డు విషయమై మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తున్న ఎంపి కవిత, పార్లమెంట్‌లో శుక్రవారం ప్రైవేటు బిల్లును కూడా ప్రవేశపెట్టారు. దేశీయ పసుపు సాగు విస్తీర్ణంలో తెలంగాణ వాటా 40శాతంగా ఉందని, దేశంలోని మొత్తం పసుపు ఉత్పత్తిలో 63శాతం తెలంగాణ రైతులదేనని స్పష్టం చేశారు. పసుపు వాణిజ్య కేంద్రాల్లో నిజామాబాద్ క్రియాశీలకంగా ఉందని ఎంపి కవిత పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పసుపు రైతులను ఆదుకునేందుకు నీటి సౌకర్యం కల్పించడంతో పాటు సకాలంలో విత్తనాలు, ఎరువులను కూడా అందజేస్తుందని అన్నారు. అత్యధిక పసుపు సాగు విస్తీర్ణం కలిగిన నిజామాబాద్ జిల్లాలోనే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తే రైతులకు అనేక ప్రయోజనాలు సమకూరుతాయని ఆమె వివరించారు. పసుపు బోర్డు ఏర్పాటు వల్ల రైతులు పండించిన పసుపును ఎగుమతి చేసుకునే అవకాశం ఏర్పడుతుందని, కనీస మద్దతు ధర లభిస్తుందని రైతులు అంటున్నారు. అధిక దిగుబడులను ఇచ్చే నూతన పసుపు రకాలపై పరిశోధనలు జరుగుతాయని, ఆధునీక సాగు విధానాలు, సస్యరక్షణ, మార్కెటింగ్ నైపుణ్యం, నిల్వ చేసుకునే పద్ధతులతో పాటు నిఫుణులైన శాస్తవ్రేత్తల ద్వారా సాంకేతిక సలహాలు, సూచనలు అందుతాయని రైతులు అంటున్నారు. అంతేకాకుండా పసుపు బోర్డు ఏర్పాటు వల్ల స్టోరేజీ సౌకర్యం లభిస్తుందని, అనుకూలమైన పసుపు అమ్ముకునే అవకాశం కూడా ఏర్పడుతుందని రైతులు చెబుతున్నారు. బీమా సౌకర్యంతో పాటు అనేక వసతులు పసుపు బోర్డు ఏర్పాటుతో ముడిపడి ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఎంపి కవిత ప్రైవేటు బిల్లు ప్రవేశపెడుతున్నట్లు స్థానిక రైతాంగానికి సమాచారం అందడంతో పార్లమెంట్‌లో ఎంపి చేసిన ప్రసంగాన్ని రైతులు చాలాచోట్ల ఆసక్తిగా తిలకించారు. ఎంపి కవిత చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే తమ శ్రమకు పూర్తిస్థాయిలో ఫలితం దక్కుతుందని, కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలమైన నిర్ణయం తీసుకుని, బిల్లును పాస్ చేసి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

టోల్‌ప్లాజా వద్ద బిజెపి నాయకుల అరెస్ట్
డిచ్‌పల్లి రూరల్, మార్చి 24: ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ల అమలుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం అసెంబ్లీ ముట్టడి చేపట్టగా, జిల్లా నుండి ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లిన బిజెపి నాయకులను ఇందల్‌వాయి మండల కేంద్రంలోని టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. బిజెవైఎం ఇచ్చిన పిలుపులో భాగంగా డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, దర్పల్లి, ఇందల్‌వాయి మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డితో పాటు నాయకులు ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్తుండగా, ఇందల్‌వాయి పోలీసులు టోల్‌ప్లాజా వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి, బిజెవైఎం నాయకులు మాట్లాడుతూ, స్వార్థ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ముస్లిం మైనార్టీలకు 12శాతం కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో 52శాతానికి పైగా ఉన్న బిసిల అభ్యున్నతిని విస్మరించిన సిఎం కెసిఆర్, కనీసం 11శాతం లేని ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపట్టడం సిగ్గుచేటని విమర్శించారు. లేదంటే బిజెవైఎం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడ్తామని వారు హెచ్చరించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, మండల అధ్యక్షుడు కెపి.రెడ్డి, దర్పల్లి అధ్యక్షుడు రాజన్న, మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.