నిజామాబాద్

చట్టాల్లో మార్పులపై అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, మార్చి 25: న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించేందుకు గాను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ కార్తికేయ మాట్లాడుతూ, చట్టాలలో మార్పులు, చేర్పుల గురించి ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ యాక్టు, ఇతర నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు సమయంలో సేకరించాల్సిన సాక్ష్యాలు, కొత్త చట్టాలు, వాటి సవరణల గురించి అవగాసన కల్పించేందుకు ప్రతీ నెల నాల్గవ శనివారం సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ తరగతులు డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతాయని అన్నారు. వీటిని పోలీస్ అధికారులు, పి.పిలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.రవీందర్ ప్రధాన వక్తగా హాజరై, కుట్రపూరితమైన అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర న్యాయపరమైన అంశాలపై సదస్సులో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లకు చెందిన ఎసిపిలు డి.ఆనంద్‌కుమార్, శివకుమార్ పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదంలో 30 మేకలు మృతి
డిచ్‌పల్లి రూరల్, మార్చి 25: డిచ్‌పల్లి మండలం సాంపల్లితండా శివారులో శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో 30 మేకలు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితుడు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. డిచ్‌పల్లి మండలం సాంపల్లితండాకు చెందిన మంగళి లంబాలి చందర్ అనే వ్యక్తి మేకలు కాసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నాడు. ఎండలు పెరిగిపోవడంతో బాధితుడు చందర్ ప్రతిరోజు ఉదయం 6గంటలకే మేకలను అడవికి మేతకు తీసుకెళ్లి, మధ్యాహ్నం 1గంట వరకు ఇంటికి చేరుకుంటున్నాడు. ఇదే క్రమంలో శనివారం ఉదయం తన మేకలను మేతకు తీసుకెళ్లిన చందర్, మధ్యాహ్నం సమయంలో ఇంటికి తీసుకువచ్చి మేకల కొట్టంలో ఉంచాడు. ఇంట్లోకి వెళ్లి భోజనం చేస్తున్న సమయంలో కొట్టంలో ఒక్కసారి మంటలు చెలరేగడంతో మేకల అరుపులు విని బయటకు వచ్చే సరికే మేకలు అగ్నికి ఆహుతయ్యాయని బాధితుడు వాపోయాడు. షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బాధితుడు, గ్రామస్థులు తెలిపారు. మేకలను మేపుకుంటూ జీవనం వెళ్లదీస్తున్న చందర్‌కు మరే ఇతర ఆధారం లేదని, బాధితున్ని ప్రభుత్వం ఆదుకోవాలని తండావాసులు, గ్రామస్థులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ మోహన్‌రెడ్డి, అధికారులు సందర్శించి పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని అందుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సిఎం దిష్టిబొమ్మ దగ్ధం
మాచారెడ్డి, మార్చి 25: మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తు ఆందోళన చేపట్టిన బిజెపి, అనుబంధ సంస్థల నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తు శనివారం మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, వాటిని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లౌకిక రాజ్యాంగంలో మతాలకు రిజర్వేషన్లు కల్పించడం ఎన్నికల రాజకీయమనేనని, అధికారం ఉందని ఇష్టం వచ్చిన వాగ్ధానాలను రాజ్యాంగ విరుద్దంగా అమలు చేస్తున్న ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఇప్పటికైన మతపరమైన రిజర్వేషన్లపై బిల్లును ప్రవేశపెట్టడం ఉపసంవరించుకోవాలన్నారు. లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు నర్సింలు, మధు, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.