నిజామాబాద్

అభివృద్ధి పనులకు 7.52 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మార్చి 26: పలు అభివృద్ధి పనులకు గాను 7కోట్ల 52లక్షల 28వేల రూపాయలు మంజూరైనట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ అన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 41 అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. దీంట్లో మిషన్ కాకతీయ 3వ ఫేస్ కింద 4కోట్ల 5లక్షల 28వేల రూపాయలు విడుదలైనట్లు తెలిపారు. దోమకొండ మంచినీళ్ల కుంటకు 24 లక్షల 40 వేలు, ఉప్పర్‌పల్లి 23.40 లక్షలు, యడారం అవుసుల కుంట 24లక్షలు, జనగామ 27.10లక్షలు, మల్కాపూర్ 26.90 లక్షలు, కామారెడ్డి మండలం రాఘవపూర్‌కు 43.60లక్షలు, పాతరాజంపేట్‌కు 47.13 లక్షలు, క్యాసంపల్లి 53.80 లక్షలు, భిక్కనూరు మండలం బస్వాపూర్‌కు 24.50 లక్షలు, మాచారెడ్డి మండలం పల్వంచకు 15.75 లక్షలు, చుక్కాపూర్ 24.25 లక్షలు, రెడ్డిపేట్ 43.94 లక్షలు, సింగారాయిపల్లి 28.84 లక్షలు విడుదలైనట్లు తెలిపారు. అలాగే కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 24 వార్డులలో సిసి రోడ్ల నిర్మాణం కోసం 3కోట్ల రూపాయలను పురపాలక శాఖ విడుదల చేసిందన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియం కంపౌండ్ వాల్ నిర్మాణానికి 32లక్షలు, బీబీపేట్ సిసి రోడ్డుకు 15లక్షలు మంజూరైనట్లు తెలిపారు. సెట్విన్ అభివృద్ధికి 32 లక్షలు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రులు కెటిఆర్, హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే పనులను ప్రారంభించి వర్షాకాలంలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్‌లను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, నంద రమేశ్, గోపిగౌడ్, పిప్పిరి ఆంజనేయులు, జుకంటి మోహన్‌రెడ్డి, బల్వంత్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, మల్లేశ్‌యాదవ్, మామిండ్ల రమేశ్, కౌన్సిలర్లు ముప్పారపు ఆనంద్, రవి, తదితరులున్నారు.

పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ఆర్మూర్, మార్చి 26: టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని, రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఆర్మూర్ మండలం వెంకటేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాలులో టిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అలాగే కవితాపురం గ్రామంలో టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని సంక్షేమ పథకాలను సిఎం కెసిఆర్ అమలు చేస్తున్నందున ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీ వైపే మొగ్గుచూపుతున్నారని అన్నారు. టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు చురుకుగా పాల్గొనాలని చెప్పారు. లక్ష్యానికి మించి సభ్యత్వం చేయాలని ఆయన సూచించారు. కవితాపురం గ్రామంలో ప్రజలందరూ టిఆర్‌ఎస్‌కు మద్దతు తెలపడం చాలా సంతోషకరమని అన్నారు. టిఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపిన గ్రామస్థులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామస్థులకు టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, టిఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు ఇట్టెడి లింగారెడ్డి, కలిగోట గంగాధర్, నాయకులు సంజయ్‌సింగ్ బబ్లూ, సుంకరి రంగన్న, యామాద్రి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.