నిజామాబాద్

నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాక్లూర్, మార్చి 28: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రాధేయపడి, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయిస్తున్నానని, అభివృద్ధి విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్ముర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మాక్లూర్ మండలంలోని కల్లెడి గ్రామంలో 25లక్షల ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులతో చేపట్టిన అంతర్గత సిసిరోడ్లు నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్, టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు తన శక్తిమేరకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సిసిరోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, బిటిరోడ్లు వంటి సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఫుడ్‌ఫార్క్, పసుపు శుద్ధి కర్మాగారం, నిరుద్యోగులకు తన సొంత ఖర్చులతో జాబ్‌మేళా నిర్వహించి ఉపాధి అవకాశాలను కల్పించడం జరిగిందన్నారు. వచ్చే రెండేళ్ల కాలంలోనూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు తీసుకవస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మత్స ప్రభాకర్, ఆకుల రజినీష్, విఠల్‌రావు, జడ్పీటిసి లతపీర్‌సింగ్, శ్రీనివాస్‌గౌడ్, పురుషోత్తం, సుబ్బారావు, మహిబూబ్, స్థానిక సర్పంచ్ ముత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు.
పల్లెనిద్ర హామీలపై ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్థులు
ఇదిలాఉండగా, గ్రామంలో ఎక్కడి రోడ్లు అక్కడే ఉన్నాయని, తాగునీటి పైప్‌లైన్ అస్తవ్యస్థంగా ఉందని, డ్రైనేజీ వ్యవస్థ మరీ దారుణంగా ఉందని, తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిని అయినందునే స్థానిక అధికార పార్టీ నాయకులు నిధులు ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా కల్లెడి గ్రామస్థులు మా గ్రామం అభివృద్ధి పరిస్థితి ఏమిటంటూ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. గత సంవత్సరం పల్లెనిద్రకు వచ్చిన సందర్భంగా గ్రామాన్ని సుందరంగా తీర్చి దిద్దుతానని ఇచ్చిన హామీ ఏమైందని వారు నిలదీశారు. ఒకానోక సందర్భంగా మహిళలంతా ఎమ్మెల్యేను చుట్టుముట్టేందుకు యత్నించగా, తెరాస నాయకులు జీవన్‌రెడ్డిని బలవంతంగా కారులో ఎక్కించి పంపించారు.

పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ
ఉప సర్పంచ్‌పై దాడి కేసుపై ఆరా
గాంధారి, మార్చి 28: గాంధారి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ శే్వతారెడ్డి సందర్శించారు. వివిధ రకాల కేసులకు సంబంధించిన వివరాలను స్థానిక ఎస్‌ఐ రాజేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం మండలంలోని గండీవేట్ గ్రామ ఉప సర్పంచ్‌పై దాడికి యత్నించిన విషయమై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఎస్‌ఐని ఎస్పీ ఆదేశించినట్లు తెలిసింది. అప్పటికే పోలీస్ స్టేషన్‌లో ఉన్న గండీవేట్ గ్రామానికి చెందిన ఇరు వర్గాల వారితో ఎస్పీ మాట్లాడారు. దాడులు చేసుకునే విషయమై వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు తెలిసింది. అంతకు ముందు గండీవేట్ గ్రామాన్ని ఎల్లారెడ్డి డిఎస్పీ నర్సింహ, సదాశివనగర్ సిఐ శ్రీశైలంలు సందర్శించారు. గ్రామంలో జరిగిన సంఘటనపై వివరాలు సేకరించినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో జరిగిన సంఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు వివరించారు. ఇరు వర్గాలకు చెందిన మొత్తం 25 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇందులో ఏడుగురిపై సాధారణ కేసులు నమోదు చేయగా, మిగితా 18 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయడం జరిగిందని డిఎస్పీ వివరించారు. గ్రామంలో జరిగిన సంఘటన విషయమై ఆయన మాట్లాడుతూ ఉప సర్పంచ్‌పై దాడి చేయడానికి గల కారణాలు తెలుసుకునే పనిలో తాము ఉన్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎస్‌ఐ రాజేష్, ఎఎస్‌ఐ షేక్‌చాంద్ తదితరులున్నారు.