నిజామాబాద్

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మార్చి 28: మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని జిల్లా ఎస్పీ శే్వత అన్నారు. మంగళవారం డిపిఓ కార్యాలయంలో మైనర్ పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కౌనె్సలింగ్ నిర్వహించారు. 18 సంవత్సరాలలోపు పిల్లలకు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం అయినప్పుడు రెండు కుటుంబాల్లో విషాదాలు నెలకొనే పరిస్థితి ఉంటుందన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. ఇకపై వాహనాలు నడిపితే కేసులతో పాటు భారీ జరిమానాలు విధిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తామన్నారు. ఎవరైన పిల్లలు బలవంతంగా వాహనాలు నడుపుతామని తెలిపితే సమాచారం అందించాలని సూచించారు. గత మూడు రోజుల క్రితం పట్టుకున్న 24 మంది వాహనదారులకు కౌనె్సలింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్పీ ప్రసన్నరాణి, ఎంవిఐ శ్రీనివాస్‌రావు, సిఐ శ్రీధర్‌కుమార్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కార్యకర్తల చేయూత
* మోర్తాడ్ ఆసుపత్రిలో మార్పు
మోర్తాడ్, మార్చి 28: ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరగాలని జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలకు మోర్తాడ్ అంగన్‌వాడీ కార్యకర్తలు చేయూతనందించారు. మంగళవారం ఆసుపత్రిలో 150 మంది గర్భిణులను తీసుకువచ్చి ప్రసూతి వైద్య నిఫుణురాలు లక్ష్మిచే వైద్య పరీక్షలు నిర్వహించారు. మోర్తాడ్‌లోని ముప్ఫై పడకలు ఆసుపత్రిలో వైద్య సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో సరైన వైద్య సదుపాయాలు అందడంలేదని స్థానికులు ఆరోపిస్తున్న నేపధ్యంలో మోర్తాడ్, గాండ్లపేట గ్రామాల అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రెండు రోజుల క్రితం సమావేశమైన రెండు గ్రామాలకు చెందిన పదకొండు మంది అంగన్‌వాడీ కార్యకర్తలు మోర్తాడ్ ఆసుపత్రిలోని గైనకాలజిస్ట్ లక్ష్మీతో సంప్రదింపులు జరిపారు. గ్రామాలలోని గర్భిణులకు స్థానికంగానే ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించి సుఖ ప్రసవాలు జరిగేలా చూడాలని కోరారు. ఆ మేరకు వైద్యురాలు లక్ష్మీ కూడా సుముఖత వ్యక్తం చేయడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు జ్యోతి శారద, యమున, జమున తదితరులు రెండు గ్రామాలలోను పర్యటించి గర్భిణులకు అవగాహన కల్పించారు. దాదాపు 150మంది గర్భిణులను గుర్తించి వారందరిని మంగళవారం మోర్తాడ్ ఆసుపత్రికి తీసుకవచ్చారు. వైద్యురాలు లక్ష్మీ గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రిలో సుఖ ప్రసవాలు జరిపేందుకు అనువైన సౌకర్యాలు అన్ని ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రసవాలు జరిపేందుకు వీలుగా ఆసుపత్రిలో ప్రత్యేక శిక్షణ పొందిని స్ట్ఫా నర్సులు కూడా ఉన్నారని డాక్టర్ తెలిపారు. తమ పర్యవేక్షణలో ప్రతీ నెల గర్భిణులందరికి మెరుగైన వైద్యం అందిస్తామని, ఈ విషయంలో ఏలాంటి ఆందోళన అక్కరలేదని భరోసా ఇచ్చారు. ప్రతి నెల రెండు గ్రామాల గర్భిణులందరిని మోర్తాడ్ ఆసుపత్రికి తీసుకవచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు, స్థానికంగానే సుఖ ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బందికి సహకరిస్తామని అంగన్‌వాడీ కార్యకర్తలు జ్యోతి, యమున, జమున తదితరులు తెలిపారు. ఇతర గ్రామాల్లోనూ ఎవరైన గర్భిణులు ఉంటే మోర్తాడ్ ఆసుపత్రిలో అందే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామాలలోని ఎఎన్‌ఎంలు కూడా ఇదే స్థాయిలో దృష్టిసారిస్తే మోర్తాడ్ ఆసుపత్రిలో మార్పు లక్ష్యం నెరవేరుతుందనడంలో ఏలాంటి సందేహం లేదు.