నిజామాబాద్

కదంతొక్కిన బీడీ కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, మార్చి 28: ప్రతి బీడీ కార్మికురాలికి వెయ్యి రూపాయల జీవన భృతిని ఇవ్వాలని డిమాండ్ చేస్తు ప్రగతిశీల బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికలోకం కదం తొక్కింది. మోర్తాడ్ కేంద్రంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికార పార్టీ అమలు చేయలేకపోవడంతో కార్మికులు ఇబ్బందలు ఎదుర్కొంటున్నారని సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాల కార్మికులు మంగళవారం పాలెం రోడ్ నుండి తహశీల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు ర్యాలీగా తరలివచ్చిన కార్మికులు మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐకెఎంఎస్ రాష్ట్ర కమిటీ నాయకులు దేవరాం, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సత్తెక్కలు మాట్లాడుతూ, ప్రస్తుతం చేతినిండ పనిలేక బీడీ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతి కార్మికురాలికి జీవనభృతి కల్పిస్తామని ప్రకటించిన కెసిఆర్ అధికారం చేపట్టాక ఆచరణలో నిబంధనలు అమలు చేయడంతో చాలామంది బీడీ కార్మికులకు భృతి అందకుండపోయిందని అన్నారు. రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే ప్రభుత్వ నిబంధనల వల్ల అర్హత ఉన్నప్పటికీ, చాలామంది కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తమ పోరాటాల ఫలితంగా ముఖ్యమంత్రి ఫిబ్రవరి రెండున నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఆసరా పెన్షన్ వస్తున్న ఇంటిలో ఉన్న బీడీ కార్మికురాలికి జీవనభృతి అందించేలా నిబంధనలు సడలిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, దానిని అమలు చేయడం లేదని ఆరోపించారు. వెంటనే రాష్ట్రంలో అర్హులైన ప్రతీ బీడీ కార్మికురాలికి వెయ్యి రూపాయల జీవనభృతిని వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీడీ కార్మికులను సమీకరించి పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు స్థానిక ఎంపిడిఒ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఐకెఎంఎస్ డివిజన్ అధ్యక్షుడు సారా సురేష్, నాయకులు కిషన్, అశోక్, బాలయ్య, భూమన్న, ముత్తెన్న శ్రీనివాస్‌తో పాటు బీడీ కార్మికులు, టేకేదార్లు పాల్గొన్నారు.

సకాలంలో రుణాలు చెల్లిస్తే ఆరు శాతం వడ్డీ రాయతీ
మోర్తాడ్, మార్చి 28: సహకార సంఘం నుండి వివిధ దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులు సకాలంలో చెల్లిస్తే 6 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చని ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ సొసైటీ చైర్మన్, డిసిసిబి డైరెక్టర్ సోమ చిన్న గంగారెడ్డి అన్నారు. మంగళవారం సొసైటీలో వివిధ గ్రామాల రైతులకు మంజూరైన దీర్ఘకాలిక రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. తాళ్లరాంపూర్‌కు చెందిన క్యాతం మధుసుదన్, తడ్‌పాకల్‌కు చెందిన జింక అనిల్‌కుమార్, దోంచందకు చెందిన ఆశిరెడ్డి చిన్నోల్ల చిన్న గంగయ్యలకు ఆరు లక్షల వంతున మంజూరైన ఎల్‌టి రుణాల కింద ట్రాక్టర్‌లను అందజేశారు. తాళ్లరాంపూర్‌కు చెందిన దిబ్బ సరస్వతికి పది లక్షల విలువగల వరికోత యంత్రాన్ని మంజూరీ చేశారు. ఈ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం గంగారెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతీ సీజన్‌లో సకాలంలో రైతులకు వివిధ రకాల రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. మార్చి 31లోగా దీర్ఘకాలిక రుణాల బకాయిలను చెల్లించిన వారికి ప్రభుత్వం ఆరుశాతం రిబేట్ అందిస్తోందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలను ఆయన కోరారు. రైతులు రుణాలను సకాలంలో చెల్లించినప్పుడే సంఘం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. త్వరలోనే సంఘం పరిధిలో పాలశీతలీకరణ కేంద్రాన్ని, దానికి అనుగుణంగా గ్రామాలలో పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, రైతులు పాడిపరిశ్రమ వైపు దృష్టిసారించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్‌లు, లబ్ధిదారులతో పాటు సిఇఒ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.