నిజామాబాద్

భూ సంజీవని పథకంతో భూముల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమ్‌గల్, మార్చి 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ సంజీవని పథకం కింద భూములను అభివృద్ధి చేయడం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా పేర్కొన్నారు. మంగళవారం భీమ్‌గల్ మండలంలోని బడాభీమ్‌గల్ గ్రామంలో గల సర్వే నెంబర్ 600, 601లో గల 50ఎకరాల భూమిని, భీమ్‌గల్ గ్రామంలోని సర్వే నెంబర్ 502లోని 50ఎకరాల భూమిని కలెక్టర్ పరిశీలించారు. హరితహారం పథకం కింద చెట్లు పెంచేందుకు గాను స్థానిక అధికారులు ఎంపిక చేసిన ఈ భూములు మొక్కల పెంపకానికి సరైనా కావా అని పరిశీలించేందుకు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యవసాయానికి పనికి రాని భూములను గుర్తించి భూ సంజీవని పథకం కింద వాటి అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ఆ భూములను సాగులోకి తీసుకవచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించడం, విద్యుత్ సరఫరా, డ్రిఫ్ ఇరిగేషన్ వంటి సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పండ్ల తోటలను పెంచేందుకు ముందుకు రావాలన్నారు. గ్రామాల్లో భూమిలేని నిరుపేదలను, దళితులను గుర్తించి, వారికి ప్రభుత్వం తరఫున భూ పంపిణీ చేసి పంట సాగుకు అయ్యే ఖర్చులను సైతం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 9000 ఎకరాల భూమిని గుర్తించడం జరిగిందన్నారు. త్వరలో ఆ భూములను అర్హులైన పేదలకు పంపిణీ చేసి పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఫాంపాండ్స్, పర్క్యులేషన్ ట్యాంకులను తవ్వించడం జరుగుతుందన్నారు. బడాభీమ్‌గల్ గ్రామంలో గల సర్వే నెంబర్ 600, 601లో 50ఎకరాల్లో చెట్లు పెంచేందుకు రైతులు ముందుకు రావడం జరిగిందని, వాటిలో ఫాంపాండ్స్‌తో పాటు ట్యాంకుల నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు స్థానిక అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు వెంటది వెంట కూలీ డబ్బులు చెల్లించాలని, డబ్బుల చెల్లింపులో ఎలాంటి జాప్యం చేయరాదని ఆమె పేర్కొన్నారు. ఎవరైనా రైతులు పండ్ల తోటలను పెంచేందుకు ముందుకు వస్తే, అలాంటి వారిని గుర్తించి వివరాలు అందించాలని హార్టికల్చర్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భీమ్‌గల్‌లోని సర్వే నెంబర్ 502లో గల 106ఎకరాల్లో దళితులు మామిడి తోటలు పెంచడం అభినందనీయమని, అందులో మరో 50ఎకరాల్లో మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. స్థానిక దళితులు ఈ 50ఎకరాల్లో కూడా ఫాంపాండ్స్, పర్క్యులేషన్ ట్యాంకులు నిర్మించేందుకు ముందుకు రావాలని సూచించారు. ప్రతిరోజు వెయ్యి మంది ఉపాధి హామీ కూలీలతో ఈ పనులను చేయించి, వేసవిలోగా పూర్తి చేయాలన్నారు. ఇందులో 3పర్క్యులేషన్ ట్యాంకులు, 5 ఫాంపాండ్స్‌ను నిర్మించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు తమకు కూలీ డబ్బులు సక్రమంగా రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. కూలీ డబ్బులు సక్రమంగా ఎందుకు అందించడం లేదని అధికారులను ప్రశ్నించారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాస్, ఉపాధి హామీ పిడి వెంకటేశ్వర్లు, భీమ్‌గల్ తహశీల్దార్ బావయ్య, ఎంపిడిఓ లింగయ్య, ఎపిఓ శకుంతలతో పాటు హార్టికల్చర్, వ్యవసాయ శాఖల అధికారులు ఉన్నారు.