నిజామాబాద్

పెన్షన్‌దారుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఏప్రిల్ 5: పోస్ట్ఫాస్‌లో పెన్షన్ చెల్లింపులో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం మోర్తాడ్‌లో పెన్షనర్లు ధర్నాకు దిగారు. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో గంటల తరబడి వేచిఉన్నా అధికారులు కొంతమందికి మాత్రమే పెన్షన్ డబ్బులు ఇచ్చి కావాలనే జాప్యం చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కూడా 100కు పైగా మహిళలు పెన్షన్ల కోసం పోస్ట్ఫాస్‌కు వచ్చారు. మధ్యాహ్నం వరకు కూడా అధికారులు డబ్బుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చాటారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలను సముదాయించారు. ఒకవైపు ఎండలు మండిపోతున్నా తమను పట్టించుకోవడం లేదని మహిళలు పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోస్టల్ అధికారులతో మాట్లాడిన పోలీసులు, పెన్షన్ డబ్బుల పంపిణీ వేగవంతం చేయాలని, కాలయాపన చేయవద్దంటూ అధికారులకు సూచించారు. దాంతో శాంతించిన మహిళలు క్యూలో నిలబడటంతో పోస్టల్ అధికారులు పనులను ప్రారంభించారు.