నిజామాబాద్

దేశంలో ఉమ్మడి జనాభా విధానాన్ని అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 4: దేశంలో ఉమ్మడి జనాభా విధానాన్ని(కామన్ పాపులేషన్ పాలసీ)ని అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారానే ప్రస్తుతం అస్థిరంగా ఉన్న వివిధ మతాల జనాభా సంఖ్యలో అసమానతలు, అంతరాలు దూరమవుతాయని, వాటి నిష్పత్తి ప్రకారం పెరుగుదల ఉంటుందని ఆయన విశే్లషించారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతంలో బిజెపి నాయకుడు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్మింపజేసిన నూతన విహెచ్‌పి కార్యాలయ భవనాన్ని ప్రవీణ్ తొగాడియా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, విశ్వహిందూ పరిషత్ హిందువులలో చైతన్యం తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రాజకీయ అధికారం సాధించడం ద్వారానే హిందువుల హక్కులను పరిరక్షించుకోగల్గుతామని ఆయన పేర్కొన్నారు. రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే ప్రధానులు, ముఖ్యమంత్రులు హిందువుల హక్కులు కాపాడేందుకు కృషి చేస్తారని అన్నారు. ప్రభుత్వాలను విమర్శించడానికి ముందు హిందువుల శ్రేయస్సు కోసం తమవంతు ప్రయత్నాన్ని ముందుగా ప్రారంభించాలన్నదే విహెచ్‌పి అభిమతమని, అనంతరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. హిందువులపై ఇప్పటికీ అనేక చోట్ల దాడులు, అరాచకాలు కొనసాగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. గతంలో నిజాం పాలనలో హిందువులు ఊచకోతకు గురయ్యారని, ప్రస్తుతం అఫ్ఘానిస్తాన్, ఇరాన్, ఇరాక్‌లోనూ హిందువులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయన్నారు. మత మార్పిడుల కోసం అనేక రకాలుగా కుట్రలు కొనసాగిస్తున్నారని, హిందువులంతా ఏకతాటిపై ఉండి వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాగా, అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశం పట్ల హిందూ సమాజం యావత్తు ఐక్యంగా ఉండాలని కోరారు. ఈ సభలో విహెచ్‌పి నేత పిట్ల రామస్వామి, భజరంగ్‌దళ్ నాయకులు శివాగౌడ్, విఘ్నేష్, రాజేశ్వర్, బిజెపి నాయకులు యెండల లక్ష్మినారాయణ, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, పల్లె గంగారెడ్డి, రోషన్‌లాల్ బొహ్రా తదితరులు పాల్గొన్నారు.

నిజాంసాగర్ కాల్వలను పరిశీలించిన సిడబ్ల్యుసి డైరెక్టర్
నందిపేట, ఏప్రిల్ 4: నందిపేట మండలంలోని కంఠం శివారులో నిజాంసాగర్ చివరి ఆయకట్టు నీటి పారుదల కాల్వలను మంగళవారం కేంద్ర జల వనరుల సంఘం డైరెక్టర్ నిత్యానంద ముఖర్జీ సందర్శించి పరిశీలించారు. అయిలాపూర్, కంఠం గ్రామాల శివారులోని కాల్వలు, వాటి పరిస్థితి ఎలా ఉంది, నీరు సక్రమంగా సరఫరా అవుతోందా అని అక్కడి ఆయకట్టు రైతులను డైరెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అందుకు రైతులు స్పందిస్తూ, కాల్వల తూములు, షట్టర్లు సక్రమంగా లేవని, కాల్వలకు సి.సి లైన్లు లేకపోవడంతో గండ్లు పడుతున్నాయని డైరెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా నిత్యానంద ముఖర్జీ విలేఖరులతో మాట్లాడుతూ, నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు అభివృద్ధికి ఎఐబిపి కింద 920కోట్ల రూపాయలు మంజూరు కావడంతో అవి ఖర్చు పెడుతున్నామని, అందుకు తగ్గ ఆయకట్టు ప్రాంతంలో అభివృద్ధి ఎలా జరుగుతుందన్నది పరిశీలిస్తున్నామని అన్నారు. ప్రాజెక్టు కింద ఆయకట్టు పరిధిలో ప్రతి ఎకరానికి నీరందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన రైతులకు భరోసా కల్పించారు.