నిజామాబాద్

డిజిటల్ బోధనా తరగతులు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, ఏప్రిల్ 13: ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్భా, మోడల్ స్కూల్‌లో డిజిటల్ బోధన తరగతులు నిర్వహించాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో విద్యాశాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు అన్ని తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో డిజిటల్ విధానంలో బోధన చేయాలన్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది నిర్లక్ష్యం చేసినట్లయితే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఇఓ మదన్‌మోహన్, తదితరులున్నారు.
ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ పొగ్రాంపై అవగాహన
ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ప్రొగ్రాం సెక్స్ వెల్ ఆఫెన్స్ యాక్టుపై కలెక్టర్ గురువారం అవగాహన కల్పించారు. చట్టపరిధిలో 18సంవత్సరాల పిల్లలపై లైంగిక వేధింపులు, దాడులు జరిగినప్పుడు కేసు నమోదుతో పాటు రక్షణ వివరాలను వివరించారు. ఈ టీం సభ్యులు లైంగిక దాడులు జరగకుండా చూడాలన్నారు. లైంగిక వేధింపులు జరిగినప్పుడు చట్టప్రకారం వారిపై చర్యలతో పాటు బాధితులను ఆదుకునే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు రాధమ్మ, తారాచంద్, ఇంద్రాణి, విజయలక్ష్మీ, సిఐ శ్రీధర్‌కుమార్, తదితరులున్నారు.
ప్రభుత్వ సబ్సిడిని పొందాలి
ప్రభుత్వం నుండి సబ్సిడిని అర్హులైన వారు పొందాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఎస్సీఎస్పీ కింద 18మంది లబ్దిదారులకు, టిఎస్‌పి కింద ఇద్దరు లబ్దిదారులకు, హరిజనులు, గిరిజనులకు ప్రభుత్వం తరపున 35శాతం సబ్సిడి అందిస్తుందన్నారు. బ్యాంకుల్లో మహిళలకు కొన్ని పథకాల్లో సబ్సిడీ ఉంటుందన్నారు. సబ్సిడి పథకాలు పొంది కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు గంగాధర్, దేవిదాసు, శ్రీను, తదితరులున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

బోధన్ రూరల్, ఏప్రిల్ 13: బోధన్ మండలం అమ్దాపూర్, సాలూరా గ్రామాలలో గురువారం సహకార సంఘాల ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వీటిని సహకార సంఘాల చైర్మన్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించకూడదని, దళారులకు విక్రయిస్తే మోసాలు జరుగుతాయని వివరించారు. సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయిస్తే సకాలంలో డబ్బులు వారి చేతికందుతాయన్నారు. అలాగే గిట్టుబాటు ధర కూడా వస్తుందని వారు పేర్కొన్నారు. ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అమ్దాపూర్ గ్రామ సహకార సంఘం చైర్మన్ క్రిష్ణ, సాలూరా సహకార సంఘం చైర్మన్ బుద్దె రాజేశ్వర్, సాలూరా సర్పంచ్ సున్నపుగంగామణి తదితరులు పాల్గొన్నారు.