నిజామాబాద్

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి టౌన్, ఏప్రిల్ 15: అంతర్‌రాష్ట్ర దొంగలను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు జిల్లా ఎస్పీ శే్వతరెడ్డి తెలిపారు. స్థానిక డిపిఓ కార్యాలయంలో ఎస్పీ విలేఖరులతో మాట్లాడారు. గత కొద్దినెలల క్రితం జాతీయ రహదారి వెంట కేబుల్ వైర్లు దొంగలిస్తున్న అంతర్‌రాష్ట్ర లారీ డ్రైవర్ల ముఠాను గుర్తించడం జరిగిందన్నారు. దీంట్లో హర్యాన రాష్ట్రంలోని గునివార్ గ్రామానికి చెందిన జాన్ మహ్మాద్, మహ్మాద్ సలీంలను భిక్కనూరు ప్రాంతంలో శనివారం అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 25లక్షల సొత్తు రివకరీ చేయడం జరిగిందన్నారు. కాగా అబ్దుల్ రహీం, జావెద్, ఇమానియాల్, హరీఫ్‌తో పాటు మరొకరు పరారీలో ఉన్నారన్నారు. కేబుల్‌తో పాటు ప్రధాన కంపెనీలకు సంబంధించిన వైర్లను వీరు గుర్తించి లారీల్లో దొంగలించి ఢిల్లీలోని హరీశ్, రాజువీర్‌లకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడించారన్నారు. వీరిపై గతంలో నాలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదు అయి ఉన్నాయన్నారు. భిక్కనూరు, సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లలో వీరిపై కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.

బంగారు తెలంగాణ దిశగా ముందుకు
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

కామారెడ్డి, ఏప్రిల్ 15: తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తు బంగారు తెలంగాణ దిశగా ముందుకెళ్తున్నామని ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ అన్నారు. శనివారం పట్టణంలోని రేణుకా ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన టిఆర్‌ఎస్ నియోజక వర్గ నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం 4రోజుల క్రితం సిఎం కెసిఆర్ ఎకరానికి 4వేల రూపాయలు అందిస్తామని చెప్పడం గొప్ప విషయమన్నారు. మనసున్న మహారాజు సిఎంను కొనియాడారు. పార్టీ సంస్థగత నిర్మాణం మేరకు రెండు సంవత్సరాలకొకసారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. 38వేల సభ్యత్వ నమోదుతో పాటు సిడిల రూపంలో పూర్తి వివరాలను రాష్ట్ర కమిటీకి అందించి కామారెడ్డి అసెంబ్లీ స్థానం ముందంజలో ఉందని పేర్కొన్నారు. గ్రామ కమిటీలు, మండల, పట్టణ కమిటీలు పూర్తి చేసుకోని సమన్వయంతో పార్టీ అభివృద్ధి కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. మెనిఫెస్టొలో కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నాడని, కొన్ని ప్రతిపక్ష పార్టీలు అసత్య ఆరోపణాలు మానుకోవాలన్నారు. మిషన్ కాకతీయలో 258చెరువుల పనులు జరుగుతున్నాయన్నారు. దీంట్లో కొన్ని పూర్తికాగా మరికొన్ని పనులు జరుగుతున్నాయని, ప్రభుత్వం 73కోట్ల 53లక్షల రూపాయల నిధులు వేచ్చించిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా పైప్‌లైన్, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా డబ్బుల పంపిణీ, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల అభివృద్ధి, ఒంటరి మహిళలకు జీవనభృతి, ఆసరా పెన్షన్లు, బీడి కార్మికులకు జీవనభృతి అందిస్తు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో డెలవరిలు జరగాలని, మహిళలకు అండగా 12వేల రూపాయలు అందిస్తుందన్నారు. గురుకుల పాఠశాలలు ప్రారంభం, విద్యార్థులకు హాస్టళ్లల్లో సన్న బియ్యం అందిస్తుందన్నారు. ఎస్సారెస్సీ ద్వారా త్వరలోనే కామారెడ్డి నియోజక వర్గంలో లక్ష ఎకరాల సాగునీరు అందుతుందన్నారు. మరో 15రోజుల్లో డబుల్‌బెడ్ రూం స్కీంకు సంబంధించి 700ఇండ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు. ఇకపై జిల్లా కమిటీలు ఉండవని, నియోజక వర్గ కమిటీలే ఉంటాయని పేర్కొన్నారు. ఒక్కొక్క కమిటీలో 22మంది సభ్యులతో పాటు 9మంది అనుబంధ సంస్థల సభ్యులు ఉంటారన్నారు. ఈ సమావేశంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ ముజీబోద్దీన్, మున్సిపల్ చైర్మన్ పిప్పిరి సుష్మ, జడ్పిటిసి సభ్యులు నంద రమేశ్, మదుసుధన్‌రావు, లక్ష్మీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజమణిగోపిగౌడ్, అమృత్‌రెడ్డి, వైస్ చైర్మన్ గౌరి శంకర్, ఎంపిపి మంగమ్మ, నాయకులు తిర్మల్‌రెడ్డి, నిట్టు వేణుగోపాల్‌రావు, పున్న రాజేశ్వర్, చంద్రశేఖర్‌రెడ్డి, పిప్పిరి ఆంజనేయులు, బల్వంత్‌రావు, మోహన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.