నిజామాబాద్

మొక్కలను పర్యవేక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివనగర్, ఏప్రిల్ 16: అధికారులు మొక్కల పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఆదివారం మండలంలోని పద్మాజివాడి గ్రామంతో పాటు, రామారెడ్డి మండలంలోని పోసానిపేట్ గ్రామంలో నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సరీలలో పిచ్చిమొక్కలను తొలగించాలని అన్నారు. మొక్కల పెంపకంపై అధికారులు పర్యవేక్షణ చేయటం లేదని, నర్సరీలలో పెరిగిన పిచ్చి మొక్కలను చూస్తేనే తెలుస్తుందన్నారు. ఎంపిడిఒ పని తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 120 నర్సరీలలోమొక్కలను పెంచటం జరుగుతుందన్నారు. జిల్లాలో 1కోటి 35లక్షల మొక్కల పెంపకం లక్ష్యం అని, 1కోటి 54 లక్షల మొక్కలను పెంచుతున్నామని అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని ప్రతి రోజు మూడు సార్లు మొక్కలకు నీరు పట్టాలన్నారు. అవసరమైన చోట గ్రీన్ నెట్‌లను ఏర్పాటు చేయాలన్నారు. 2018 సంవత్సరానికి గాను 5లక్షల ఈత మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రవటి లింగారెడ్డి, ఎంపిడిఒ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

అటవీ సిబ్బందిపై కలప స్మగ్లర్ల దాడి
మోర్తాడ్, ఏప్రిల్ 16: మోర్తాడ్ మండలం దొన్‌పాల్ అటవీ ప్రాంతంలో కలప స్మగ్లర్లు అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేసినట్లు ఎస్‌ఐ అశోక్‌రెడ్డి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్ట్ రేంజర్ సుధాకర్ నేతృత్వంలో సిబ్బంది దొన్‌పాల్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయానికి కలపను తీసుకుని వస్తున్న స్మగ్లర్లను అటవీ శాఖ సిబ్బంది నిలువరించడంతో రాళ్లతో దాడి చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనలో వాహనం ధ్వంసం కాగా, పలువురు సిబ్బందికి గాయాలైనట్లు కమ్మర్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారిణి అమృతమ్మ ఫిర్యాదు చేసిందని ఎస్‌ఐ అశోక్‌రెడ్డి వివరించారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈ మేరకు దొన్‌పాల్‌తో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని, దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు.