నిజామాబాద్

కామన్ సర్వీస్ రూల్స్ విషయంలో ప్రభుత్వం స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఏప్రిల్ 20: రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలులో జాప్యాన్ని విడనాడి, రాష్టప్రతి ద్వారా సర్వీస్ రూల్స్ ఉత్తర్వులను వెంటనే తెప్పించి బదిలీలు, పదోన్నతులు కల్పించే విషయంలో స్పందించాలని యుఎస్‌పిసి రాష్ట్ర ప్రతినిధి శంతన్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శంతన్ మాట్లాడుతూ, ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను కామన్ సర్వీస్ రూల్స్ పరిధిలోకి వెంటనే తేవాలని, జీవో 223ను రద్దు చేసి స్కూల్ అసిస్టెంట్లకు, జూనియర్ కళాశాల లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలన్నారు. అదేవిధంగా ఎంఇఓ, డిప్యూటీ ఇఓ, హెచ్‌ఎంలకు పదోన్నతులు కల్పించాలని, బదిలీలను వెంటనే చేపట్టాలన్నారు. తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ, గత యాభై సంవత్సరాలుగా ఉపాధ్యాయులు పోరాటం కొనసాగిస్తున్న దరిమిలా కొన్ని అంశాల్లో ఉత్తర్వులు తెప్పించుకున్నామని, ఇందుకు ఐక్య ఉద్యమాలు వేదిక అయ్యాయన్నారు. గతంలో జీవో 370ను రద్దు చేసుకున్నట్టు, ఈసారి ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధిస్తామన్నారు. సిఐటియు నాయకుడు రమేష్‌బాబు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మారుస్తామంటూ ప్రభుత్వం దళితులను, పేదలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ప్రస్తుతం సిఎం కెసిఆర్ సమస్యలను గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు. ఎంబిసి రాష్ట్ర నాయకుడు దండి వెంకట్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులను పోరాట దిశగా నడిపిస్తూ తెలంగాణలో ఐక్య ఉద్యమాన్ని బలంగా నిర్మించాలన్నారు. అనంతరం డిఆర్‌ఓ కార్యాలయ అధికారులకు మెమోరాండం అందజేశారు. ఈ ధర్నాలో యుటిఎఫ్ నాయకులు సోమేశ్వర్, జిల్లా అధ్యక్షుడు రమేష్, సత్యానంద్, కార్యదర్శులు రాజన్న, విజయరామరాజు, సిపిఎస్ ప్రతినిధి మైఖెల్ తదితరులు పాల్గొన్నారు.

రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది
కూలి పనిలో ఎమ్మెల్యే షిండే

పిట్లం, ఏప్రిల్ 20: సమాజంలో రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. ఆయన గురువారం మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో హమాలీ పని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులను ఆదుకునేలా ఎకరానికి ఎరువులు, విత్తనాల ఖర్చులకు 4వేల రూపాయలను ప్రకటించడం హర్షనీయమన్నారు. రాష్ట్రానికి రైతులు వెన్నుముఖ లాంటి వారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెరాసా ప్రభుత్వం నిర్వహించనున్న ఫ్లీనరీ చార్జీలకు ఇబ్బంది కలుగకుండా ప్రతి టిఆర్‌ఎస్ కార్యకర్త కూలి పని నిర్వహించాలని పిట్లంలో సంచులు మోసి వ్యాపారస్తులు, ట్రాక్టర్ల వద్ద నుండి 2లక్షలు రూపాయల హమాలీ చెక్కును తీసుకున్నారు. సిఎం కెసిఆర్ 70సంవత్సరాల పాలనలో కోల్పొయినని అధికారంలోకి రాగానే ప్రజలకు కల్పించి బంగారు తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారని, మహిళలకు ఇబ్బంది కల్గకుండా ప్రతి ఒక్క కుటుంబానికి మిషన్ భగరీథ కింద తాగునీరు, మిషన్ కాకతీయ కింద చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చారన్నారు. వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుడ్ సబ్సిడి కింద 400 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. వెనుకబడిన ప్రాంతానికి జుక్కల్ నియోజక వర్గానికి ఆర్‌అండ్‌బి రహదారుల ఏర్పాటుకు 200 కోట్లు, పంచాయతీరాజ్ రహదారులకు 60 కోట్లు, పిట్లం మండలంలో 25వేల ఎకరాల భూమిని సాగులోకి తేవడానికి నాగమడుగు వద్ద లిప్ట్ ఏర్పాటు చేసి చెరువు నింపేలా 300కోట్లతో పనులు పూర్తి అయ్యేలా డిపిఆర్ పూర్తి చేసి పనులు కొనసాగేలా చర్యలు చేపట్టనున్నారని పేర్కొన్నారు. మండల రైతులు పిట్లం సరిహద్దు నుండి బైక్ ర్యాలీగా ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి వైస్ చైర్మన్ వెంకట్‌రాంరెడ్డి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు వాసరి రమేశ్, ఎంపిపి రజినికాంత్‌రెడ్డి, జడ్పిటిసి ప్రతాప్‌రెడ్డి, వైస్ ఎంపిపి నర్సాగౌడ్, ఎంపిటిసిలు జగదీశ్, మెగులాగౌడ్, శోభలక్ష్మణ్, కో-ఆప్షన్ సభ్యులు కరీం, నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘం అధ్యక్షులు అంబారెడ్డి, పాల్గొన్నారు.