నిజామాబాద్

కలెక్టర్ సుడిగాలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, ఏప్రిల్ 28: కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం బాన్సువాడ మండలం బొర్లాం గ్రామ పంచాయతీలోని జికె తండాలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ, అక్కడే క్యాంపులో ఉన్న నర్సరీలో పెరుగుతున్న మొక్కలను పరిశీలించారు. అలాగే క్యాంపులోనే ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కూడా తనిఖీ చేశారు. అనంతరం బుడ్మి గ్రామానికి వెళ్లి మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ, హరితహారం మొక్కలకు నీరు పోశారు. అనంతరం గ్రామస్థులతో సమావేశం అయ్యారు. మరుగుదొడ్లు వందశాతం నిర్మించేందుకు గ్రామస్థులతో పాటు అధికారులు అందరు కలిసి కృషి చేయాలని కలెక్టర్ సూచనలు ఇచ్చారు. అలాగే ఉపాధిహామీ పథకం కింద ప్రతి గ్రామంలో 60 శాతం కూలీలకు పని కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 92 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయని, ఈ సంవత్సరానికి 280కోట్ల రూపాయల ఉపాధిహామీ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. 3నెలల పాటు ఉపాధిహామీ కూలీలకు వందరోజులు పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామాల్లో నాటిన హరతహారం మొక్కలు ఎండిపోకుండా నీరు పోసి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు. చెట్లు పెరిగితే కాలుష్య నివారణతో పాటు వర్షాలు సంవృద్ధిగా కురిసే అవకాశం ఉందన్నారు. రబీ సీజన్‌లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలకు గూడు కల్పించాలనే ఉద్దేశ్యంతో సిఎం కెసిఆర్ 5లక్షల 4వేల రూపాయలు ఖర్చు పెట్టి డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని, వీటిని అర్హులకే కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రతి నియోజక వర్గానికి వెయ్యి డబుల్ బెడ్‌రూంలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. గతంలో మంజూరైన డబుల్ బెడ్‌రూంలే కాకుండా ప్రస్తుతం 2,675 డబుల్ బెడ్‌రూంలు మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు, రైతులకు కలెక్టర్ క్షుణంగా వివరించారు. కలెక్టర్ వెంట ఆర్‌డిఓ రాజేశ్వర్, తహశీల్దార్ గోపి, ఎంపిడిఓ నగేశ్, ఐకెపి అధికారిని పద్మ, ఎపిఓ గంగాధర్, సర్పంచ్ చిన్న గంగాధర్, బలరాంతో పాటు గ్రామస్తులున్నారు.

నాగాపూర్ పంటలకు నిజాంసాగర్ నీరు
బాల్కొండ, ఏప్రిల్ 28: బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామ ఎత్తిపోతల పథకం కింద సాగు చేసిన పంటలకు నిజాంసాగర్ నీటిని విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ ఆర్మూర్ డివిజన్ డిఇ కృష్ణమూర్తి తెలిపారు. శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో నిర్మించిన నాగాపూర్ ఎత్తిపోతల పథకానికి సాగర్ జలాలు ఎత్తిపోవడంతో లిఫ్ట్ కింద సాగు చేస్తున్న 500ఎకరాల వరిపంట చేతికి అందే దశలో నీరులేక ఎండిపోతోందన ఆయకట్టు రైతులు వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిజాంసాగర్ నుండి నాగాపూర్ లిఫ్ట్ ఆయకట్టుకు మూడు రోజుల పాటు నీటిని విడుదలను కొనసాగిస్తామని, రైతులు నీటిని పొదుపుగా వాడుకుని పంటలను కాపాడుకోవాలని డిఇ సూచించారు.