నిజామాబాద్

గల్ఫ్ బాధితులకు అండగా ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, ఏప్రిల్ 28: గల్ఫ్ బాధితులకు అండగా నిలుస్తూ వారిని ఆదుకోవడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడంలో ఆర్మూర్ కేంద్రంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి చెప్పారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో శుక్రవారం గల్ఫ్ సరిహద్దు దాటిన ప్రేమ కథ అనే సినిమా యూనిట్ ఆధ్వర్యంలో గల్ఫ్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. వలసదారుల హక్కుల కౌన్సిల్ ప్రతినిధి భీమ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో గల్ఫ్‌లో వివిధ కారణాలతో మరణించిన వారికి నివాళి అర్పిస్తూ రెండు నిముషాలు వౌనం పాటించారు. ఈ అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గల్ఫ్ బాధితుల బాధలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఉద్యమంలో భాగంగా వచ్చే నెల 9వ తేదిన హైదరాబాద్‌లో అన్ని రాజకీయ పక్షాలతో సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. కమర్షియల్, ఎంటర్‌టెయిన్‌మెంట్ ఆంగిల్‌లో రాకుండా సమాజంలో చైతన్యం తీసుకురావడం కోసం తీసిన గల్ఫ్ సినిమా దర్శక, నిర్మాతలను అభినందించారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచే అధిక సంఖ్యలో యువత ఉపాధి కోసంగల్ఫ బాట పట్టిందని అన్నారు. అందుకు త పాలకులు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే కారణమని అన్నారు. తాను స్పీకర్‌గా ఉన్న సమయంలో గల్ఫ్‌కి వెళ్లి అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు. రైతాంగాన్ని ఆదుకొని వలసలను నివారించడానికి జలయజ్ఞం చేపట్టి సాగునీటిని అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, నాయకులు పిసి బోజన్న, నర్లే నవీన్, సినిమాయ యూనిట్ తదితరులు పాల్గొన్నారు.

హత్య కేసులో ఒకరి అరెస్ట్
ఇందూర్, ఏప్రిల్ 28: తన కామవాంఛ తీర్చాలని అడిగిన మాటను కాదన్న యువతిని బండరాయితో మోది హతమార్చిన కామాంధుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించడం జరిగిందని ఎసిపి ఆనంద్‌కుమార్ తెలిపారు. శుక్రవారం నగరంలోని టూటౌన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎసిపి ఆనంద్‌కుమార్ హత్య కేసు వివరాలను వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన మంగిలాయ్ అనే యువకుడు నగరంలోని తానాగల్లీలో నివాసం ఉంటూ పానీపూరీ విక్రయించుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నాడని అన్నారు. ఇదే కాలనీలో రాజస్థాన్‌కు చెందిన ప్రకాష్‌సింగ్ కుటుంబం నివాసం ఉంటుందన్నారు. అయితే తానాగల్లీలో నివాసం ఉండే మంగిలాయ్ అనే యువకుడు ఈ నెల 27వ తేదీన అదే కాలనీలో నివాసం ఉంటున్న సౌసర్‌బాయి అనే వివాహిత మహిళను తన కామవాంఛ తీర్చాలని ఒత్తిడి చేయడంతో అందుకు ఆమె నిరాకరించడంతో ఆగ్రహించిన మంగిలాయ్ బండరాయితో మోది హతమార్చినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ మేరకు నిందితుడు మంగిలాయ్‌ను శుక్రవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించడం జరిగిందని ఎసిపి వెల్లడించారు. యువతి హత్య జరిగిన 2గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్న సిఐ సుభాష్‌చంద్రబోస్‌ను ఎసిపి ఆనంద్‌కుమార్ అభినందించారు. విలేఖరుల సమావేశంలో టూ టౌన్ ఇన్‌చార్జి ఎస్‌ఐ ఎండి.ఇక్బాల్, ఎస్‌ఐపి పి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.