నిజామాబాద్

టియు అక్రమాలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, మే 10: తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నిజ నిర్ధారణ కమిటీ వేసి, అక్రమాలను బయటపెట్టాలని పిడిఎస్‌యు అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.సౌందర్య, మహేందర్‌లు ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. బుధవారం నగరంలోని ఎన్‌ఆర్.్భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ యూనివర్సిటీలో పిహెచ్‌డి అర్హత పరీక్ష కు సంబంధించి 100మంది విద్యార్థులు గైర్హాజర్ అయ్యారని, అలాగే 14ఓఎంఆర్ షీట్లు గల్లంతైనట్లు వారు ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు తమ అనుయాలను పరీక్షల్లో నెగ్గించడానికే ఓఎంఆర్ షీట్‌లను గల్లంతు చేశారని విమర్శించారు. దీనివల్ల కష్టపడి న్యాయ బద్ధంగా పిహెచ్‌డి సీట్లు పొందాల్సిన విద్యార్థుల అన్యాయానికి గురవుతారని వారన్నారు. విజ్ఞానాన్ని అందించాల్సిన యూనివర్సిటీలో అధికారుల నిర్లక్ష్యం వల్ల తప్పుడు సంకేతాలు వెలువడుతున్నాయని, ఇది వర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఔట్ సోర్సింగ్ నియామకాల కోసం విసి ద్వారా నోటిఫికేషన్ జా రీ చేయాల్సి ఉండగా, ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే నియామకాలు జరుపడం శోచనీయమన్నారు. ఉన్నతస్థాయి అధికారియే వేలాది రూపాయలు ముడుపులు తీసుకుంటూ, అక్రమ నియామకాలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించే విద్యా సింహాలపై వ్యితిరేక ప్రకటనలు చేసేవారు, అధికారులకు తొత్తులుగా మారాని వారు ఆరోపించారు. జరిగిన అభివృద్ధి ఏమిటో వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసేందుకు నిజ నిర్ధారణ కమిటీ వేసి, నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేసిన ఔట్ సోర్సింగ్ నియామకాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో పిడిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి పి.సరిత, జిల్లా నాయకులు ధరణి, మనూష, ఆమని, సాయి, ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.