నిజామాబాద్

మున్సిపాలిటీలో అజెండా పత్రాల చించివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, మే 16: ఆర్మూర్ మున్సిపాలిటీ సాదారణ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిసింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రతిపక్ష వార్డు కౌన్సిలర్లతో పాటు అధికార టిఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు హాజరయ్యారు. సరిగ్గా 11 గంటల ప్రాంతంలో మున్సిపల్ సమావేశం ప్రారంభమైంది. సీనియర్ అసిస్టెంట్ ప్రకాష్ ఏజెండా అంశాలను చదువుతుండగా ఒక్కసారిగా బిజెపి ఫ్లోర్ లీడర్ ద్యాగ ఉదయ్ తన సీటులో నుంచి లేచి పోడియం వద్దకు దూసుకువచ్చారు. అంతేకాకుండా సీనియర్ అసిస్టెంట్ ప్రకాష్ చేతిలో నుంచి ఏజెండా కాపీని లాక్కొని చించివేసి నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీస సమాచారం లేకుండా, కౌన్సిలర్లమన్న గుర్తింపు ఇవ్వకుండా తమ వార్డులకు నిధులు కేటాయించకపోవడం ఏమిటంటూ నిలదీశారు. ఏజెండా అంశాలను చించివేయడం సరికాదని పేర్కొంటూ బిజెపి ఫ్లోర్ లీడర్ ద్యాగ ఉదయ్‌ను సమావేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు అందరి సభ్యుల అభిప్రాయం మేరకు తీర్మానించారు. ఇదే సమయంలో టిడిపి, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్లు జివి నర్సింహారెడ్డి, మహమూద్‌అలీలు మాట్లాడడానికి ప్రయత్నించారు. అంతలోనే ఏజెండాలోని అంశాలన్నీ ఆమోదిస్తున్నామని, సమావేశం ముగిస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిసింగ్ ప్రకటించి సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఇదంతా కేవలం పది నిముషాల వ్యవధిలో జరిగిపోయింది. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిసింగ్ విలేఖరులతో మాట్లాడారు. అన్ని వార్డులకు ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించినప్పటికి ప్రతిపక్ష పార్టీల నాయకులు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.