నిజామాబాద్

ముగిసిన రైతు అవగాహన సదస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 16: ఖరీఫ్ సాగుకు అన్నదాతను అన్ని విధాలా సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో గడిచిన పనె్నండు రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మన తెలంగాణ - మన వ్యవసాయం పేరుతో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులు మంగళవారం నాటితో ముగిశాయి. తీవ్ర ప్రతిబంధకంగా నిలిచిన మండుటెండల్లో సదస్సులు నిర్వహించేందుకు అపసోపాలు పడిన అధికారులు, ఎట్టకేలకు ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు. సేద్యపు రంగంతో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు సంబంధించి అన్ని అంశాలపై రైతులకు అవగాహన కల్పించామని అధికారులు పేర్కొంటున్నప్పటికీ, ఈ సదస్సుల వల్ల ఒనగూరిన ప్రయోజనమేమీ లేదని మెజార్టీ రైతులు, ప్రతిపక్ష పార్టీలు పెదవి విరుస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సులకు ఏర్పాట్లు చేసినప్పటికీ, రైతుల నుండి ఆశించిన స్పందన లభించలేదనే చెప్పాలి. ఇందుకు మండుటెండలు ఒక కారణమైతే, రైతులు రబీ చివరి దశ పనుల్లో నిమగ్నం కావడంతో అనేక చోట్ల అవగాహన సదస్సులు వెలవెలబోయాయి. రైతులను సమీకరించే బాధ్యతను వ్యవసాయ విస్తీర్ణ్ధాకారుల భుజస్కంధాలపై మోపినప్పటికీ, రైతులు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పాల్గొన్న దాఖలాలు కనిపించలేదు. దీంతో చేసేదేమీ లేక అధికారులు అందుబాటులో ఉన్న రైతులతోనే ఈ కార్యక్రమాన్ని కానిచ్చేసి చేతులు దులుపుకున్నారు. వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలైన పశుసంవర్ధక, ఉద్యానవ, మార్కెటింగ్, మత్స్యశాఖ, సెరికల్చర్, వన సంరక్షణ, చక్కెర, విద్యుత్, ఇరిగేషన్, బ్యాంకులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్తవ్రేత్తలు పాల్గొనాలని నిర్దేశించినప్పటికీ, ఆయా శాఖల అధికారుల గైర్హాజరీ కొట్టొచ్చినట్టు కనిపించింది. వ్యవసాయ రంగంలో ప్రత్యేకించి వరి పంట సాగులో ముందంజలో నిలిచే ప్రాంతాల్లోనూ వ్యవసాయ అధికారుల గైర్హాజరీ కారణంగా అవగాహన సదస్సులు మొక్కుబడి తంతుగానే మారాయంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే గొర్రెల పెంపకం పథకం కోసం నిర్వహించే సదస్సులతో పోలిస్తే, రైతు అవగాహన సదస్సులకు కనీసం యాభై శాతం మంది కూడా కనబడలేదు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఇతర సభలు, సమావేశాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనే మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా రైతు అవగాహన సదస్సులకు మాత్రం ముఖం చాటేశారు. రైతుల ప్రయోజనార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అధికారులు పదేపదే వల్లె వేసినప్పటికీ, స్పందన నామమాత్రంగానే ఉండింది. దీంతో అధికారులు కూడా నామ్‌కేవాస్తేగా సదస్సులు నిర్వహించి మమా అనిపించుకున్నారు. వాస్తవానికి రైతులకు పంటల సాగులో పాటించాల్సిన మెళుకువలు, ఆధునిక పద్ధతుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు, వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అయినప్పటికీ, ఆ దిశగా ఆశించిన స్థాయిలో కృషి జరగలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సదస్సుల్లో పాల్గొన్న అరకొర మంది రైతులూ సవాలక్ష సమస్యలను ఏకరువు పెడుతూ అడుగడుగునా అధికారులను నిలదీశారు. ప్రధానంగా ప్రకృతి వైపరీత్యంతో పంటలు కోల్పోయినప్పటికీ, తమకు ప్రభుత్వపరంగా ఇంకనూ నష్టపరిహారం అందలేదంటూ ఆయా మండలాల్లో రైతులు ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
యంత్రలక్ష్మి పథకం కింద తాము ట్రాక్టర్లు, ఇతర ఆధునిక సేద్యపు పరికరాలను కోరుతూ దరఖాస్తులు చేసుకున్నప్పటికీ, తమ అర్జీలను బుట్టదాఖలు చేశారని, నేతల కనుసన్నల్లో మెదులుతూ వారి అనుచరులుగా చెలామణి అవుతున్న వారికే మంజూరీలు ఇచ్చారని అసంతృప్తి వెళ్లగక్కారు. పంటలకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వసతుల కల్పన విషయంలోనూ రైతుల నుండి పెద్దఎత్తునే నిరసనలు వ్యక్తమయ్యాయి. రైతుల సమస్యలను సావధానంగా ఆలకించిన అధికారులు, వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాల వివరాలను ఏకరువుపెట్టి అవగాహన సదస్సులను ముగించారు.