నిజామాబాద్

శంకుస్థాపనకే పరిమితం ‘టచ్ అండ్ స్మెల్ పార్క్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 15: అంధుల కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలోని తిలక్‌గార్డెన్‌లో ఏర్పాటు చేయదల్చిన టచ్ అండ్ స్మెల్ పార్క్ శంకుస్థాపనకే పరిమితమైంది. సరిగ్గా పది మాసాల క్రితం నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, మేయర్ ఆకుల సుజాతలను ఆహ్వానించి జిల్లా యంత్రాంగం ఎంతో అట్టహాసంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ యోగితారాణా ఈ పార్క్ నిర్మాణ పనుల గురించి ప్రత్యేక శ్రద్ధాసక్తులు కనబరుస్తూ, రూపొందించిన ప్రణాళిక గురించి ప్రకటించడం జరిగింది. కానీ ఏడాది పూర్తి కావస్తున్నప్పటికీ టచ్ అండ్ స్మెల్ పార్క్ పనులకు శ్రీకారం చుట్టిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఇప్పటివరకు కేవలం నార్వే దేశంలో మాత్రమే టచ్ అండ్ స్మెల్ పార్క్ ఉండగా, అదే తరహాలో ప్రపంచంలోనే రెండవ పార్కును నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామని శంకుస్థాపన సమయంలో ప్రకటించారు. కానీ కేవలం 58లక్షల రూపాయల వ్యయం మాత్రమే అవుతుందనే అంచనాతో రూపొందించిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని మాత్రం శంకుస్థాపన దశకే పరిమితం చేశారు. నిజానికి అంధుల కోసం ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలనే తపనతో కలెక్టర్ యోగితారాణా ఈ ఆలోచన చేశారు. ఆమె ఆదేశాల మేరకు అధికారులు నార్వే దేశానికి వెళ్లి అక్కడి టచ్ అండ్ పార్క్‌ను పరిశీలించి సైతం వచ్చారు. అదే తరహాలో అంధుల కోసం ప్రత్యేకంగా నిజామాబాద్‌లోనూ ఉద్యానవనం నెలకొల్పాలని ప్రణాళికలు తయారు చేయించి, అనుకున్నదే తడవుగా ఎంతో ఆదరాబాదరగా ఎంపి, ఎమ్మెల్యేలచే అట్టహాసంగా శంకుస్థాపన చేయించారు. చూపు లేకపోయినప్పటికీ అంధులు ఈ ఉద్యానవనంలో ప్రత్యేక సదుపాయాలతో ఏర్పాటు చేసే కళాకృతులను తాకడం ద్వారా వాటి గురించి పూర్తిగా తెలుసుకుని చక్కటి అనుభూతిని పొందేలా టచ్ అండ్ స్మెల్ పార్కును అందుబాటులోకి తేవాల్సి ఉండింది. ఈ పార్కులో తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ప్రపంచంలోని ఏడు వింతలైన తాజ్‌మహల్, చైనా గ్రేట్ వాల్, ఈఫిల్ టవర్, రోమ్ నగరంలోని కొలీజియం, ఇటలీలోని పిసా టవర్లు, ఈజిప్టులోని పిరమిడ్‌లు, బ్రెజిల్‌లోని క్రీస్తు శిల్పం, భారతదేశ చారిత్రక సంపదగా పరిగణించే ఇండియా గేట్, పార్లమెంటు, జంతర్‌మంతర్, ఎర్రకోట, కుతుబ్‌మినార్, తెలంగాణలోని చార్‌మినార్, అసెంబ్లీ, క్లాక్‌టవర్, తంగెడు పువ్వు, కృష్ణజింక, పాలపిట్ట, జమ్మిచెట్టుతో పాటు రైనోసారస్, డైనోసార్, జిరాఫీ, ఏనుగు, పులి, చిలుక, సింహం, కుక్క, ఒంటె, ఎద్దు, పాము, రవాణా సాధనాలైన విమానం, బస్సు, రైలు, ఆటోరిక్షా, కారు, మోటార్ సైకిల్, సైకిలు వంటి 38రకాల వస్తువులను ప్రత్యేకంగా రూపొందించి టచ్ అండ్ స్మెల్ పార్కులో అందుబాటులో ఉంచుతామని జిల్లా యంత్రాంగం ప్రణాళికల్లో పొందుపర్చింది. వీటిని ఫైబర్‌తో నిర్మింపజేసి నాలుగు అడుగుల విస్తీర్ణం చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంధులు వీటిని చేతితో తాకి స్పర్శ ద్వారా వివిధ ఆకృతుల నమూనాలు, జంతువులు, పక్షులను గుర్తించి, వాటి తాలూకు అనుభూతి పొందేలా ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ తెలిపారు. దీని నిర్మాణానికి గాను తిలక్ గార్డెన్‌లో స్థలాన్ని గుర్తించడంతో పాటు ప్లాన్‌ను సిద్ధం చేయించామని కలెక్టర్ యోగితారాణా పది మాసాల క్రితమే ప్రకటించారు. ఈ పార్కులో అంధులు, అంధ విద్యార్థులకు ఎలాంటి రుసుము లేకుండానే ఉచిత ప్రవేశం కల్పిస్తామని, సాధారణ విద్యార్థులు, పిల్లలకు నామమాత్రపు రుసుము వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. కానీ ఇంతవరకు టచ్ అండ్ స్మెల్ పార్కు పనులకు మాత్రం శ్రీకారం చుట్టలేకపోయారు.

సమ్మెకు సమాయత్తం కావాలి
మున్సిపల్ కార్మికులకు కార్మిక సంఘం నేత భాస్కర్ పిలుపు

కంఠేశ్వర్, జూన్ 15: వేతనాల పెంపు, శాశ్వత నియామకాలు తదితర సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడలో గల సిఐటియు కార్యాలయంలో గురువారం మున్సిపల్ కార్మికుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ, సమస్యల పట్ల ప్రభుత్వాలు స్పందించాలంటే ఉద్యమించడం ఒక్కటే మార్గమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సామాజిక వర్గాలు మున్సిపల్ కార్మికులుగా పని చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల వివక్షతను కనబరుస్తోందని, అందుకే మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచడం లేదని ఆయన ఆరోపించారు. చాలీచాలని వేతనాలతో అవస్థలు పడుతున్న కార్మికులు వేతనాల పెంపు కోసం ఆందోళనలు కొనసాగిస్తున్నా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిస్తేజ వైఖరిని నిరసిస్తూ జూలై 18వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఈ నెల 17న అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు, 19వ తేదీన మానవహారం, 24న నిరాహార దీక్షలు, 30న చలో కలెక్టరేట్ కార్యక్రమాలు చేపట్టాలని, ఆలోపు ప్రభుత్వం స్పందించకపోతే జూలై 18 నుండి సమ్మెకు పూనుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మల్యాల గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి సంతోష్‌సింగ్, నాయకులు యాదయ్య, శ్రీశైలం, అంజయ్య, వెంకట్, సత్యం తదితరులు పాల్గొన్నారు.