నిజామాబాద్

ఆదాయాభివృద్ధితోనే ఆర్థిక పరిపుష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, జూన్ 27: మహిళలు ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేపడితేనే మరింత ఆర్థిక పరిపుష్టిని సాధించవచ్చని నందిపేట మండల ఇంటి దీపం మ్యాక్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు ఎస్.్భలక్ష్మి పేర్కొన్నారు. నందిపేట మండలం బాద్గుణ గ్రామంలో ఇంటి దీపం మ్యాక్స్ మొదటి మహాజన సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న భూలక్ష్మి మాట్లాడుతూ, మ్యాక్స్ సంఘాల మహిళలు ఇదివరకు పొదుపు చేసుకుని, ఆర్థికంగా మెరుగుపడ్డారని అన్నారు. మరింత ఆర్థిక పరిపుష్టిని సాధించేందుకు సంఘాల ఆధ్వర్యంలో వ్యాపారాలు, పంట ఉత్పత్తుల కొనుగోలు, కిరాణ సరుకుల అమ్మకం వంటివి చేపట్టాలని సూచించారు. ఫెడరేషన్ సిఇఓ జేబన్న మాట్లాడుతూ, మహిళా సంఘాల వారు ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు వస్తే ఫెడరేషన్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. గ్రామ మ్యాక్స్ మేనేజర్ నాగం కవిత సభలో సంఘం నివేదికను చదివి వినిపించారు. గ్రామంలో 150 కుటుంబాల వారు మ్యాక్స్‌లో ఉన్నారని, కొత్త గ్రూపుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. గ్రామ సంఘంలో సభ్యుల వాటాధనం 6.17లక్షల రూపాయలు ఉందని, 2.04లక్షలు పొదుపు చేశారని వివరించారు. మండల ఫెడరేషన్ నుండి రెండు లక్షలు రుణంగా తీసుకోవడం జరిగిందన్నారు. 2017-18 సంవత్సరానికి సభ్యుల వినిమయ, వ్యవసాయ అవసరాలకు 13 లక్షల రూపాయలు రుణంగా అందించడం జరుగుతుందని, కిరాణ వ్యాపారం, సేవల రంగానికై రుణాన్ని లక్ష రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. గ్రామంలో ప్రతి కుటుంబానికి కిరాణ, పంటలు కొనడం, అమ్మడం, పాల ఉత్పత్తి గురించి ప్రచారం చేస్తారని చెప్పారు. గ్రామ్ డైరెక్టర్ శ్యాంసన్ మాట్లాడుతూ, ఇందూర్ ఇంటి దీపం ఫెడరేషన్ కింద కొనసాగుతున్న మ్యాక్స్ సంఘాలను గ్రామాల వారీగా రిజిస్ట్రేషన్ చేయించి స్వయం ప్రతిపత్తిని కల్పించామని, గ్రామ సంఘాలు స్వీయనిర్ణయం ప్రకారమే కొనసాగుతాయని తెలిపారు. ఈ మహాజన సభలో సర్పంచ్ కవిత, ఉప సర్పంచ్ జనార్ధన్‌రెడ్డి, మండల మ్యాక్స్ మేనేజర్ జయనిర్మల, సంఘ డైరెక్టర్లు ఎ.నర్సు, గొల్ల గంగు, శారద, పెద్ద గంగామణి, విడిసి ప్రతినిధులు బోజన్న, గంగన్నతో పాటు వివిధ గ్రామాల మ్యాక్స్ మహిళా బాధ్యులు పాల్గొన్నారు. ముందుగా తొలి మహాజన సభను పురస్కరించుకుని మహిళలు సాంప్రదాయ రీతిలో ఆకట్టుకునే విధంగా బతుకమ్మ ఆడారు.

ప్రజలను జాగృతం చేయడమే బిజెపి లక్ష్యం
వినాయక్‌నగర్, జూన్ 27: దేశ ప్రజలను జాగృతం చేయడమే బిజెపి లక్ష్యమని, కులమతాలకు అతీతంగా ప్రజాసేవే పరమావధిగా పనిచేసేది ఒక్క బిజెపి పార్టీయేనని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసుకుంటూ, మంగళవారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లడారు. స్వతంత్ర భారత చరిత్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినదిగా ఎమర్జెన్సీ రోజులుగా చరిత్రకెక్కాయని అన్నారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి, అనేక అరాచకాలకు కారణమయ్యారని ఆక్షేపించారు. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు చేసే తప్పిదాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల గురించి రాబోయే తరాలకు తెలియాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిర నిర్ణయానికి వ్యతిరేకంగా జనతా సంఘ్ పోరాటం కొనసాగించి ప్రజల పక్షాన నిలిచిందన్నారు. అనేక మతాల సమాహారంగా ఉన్న భారతదేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, నరనరాన దేశభక్తిని నింపుకోవాలని కోరారు. నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాత దేశంలో అవినీతికి ఆస్కారం లేకుండా, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పెద్దఎత్తున పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా నాల్గవ జోన్, 2వ డివిజన్ పరిధికి చెందిన సుమారు వంద మంది యువకులు బిజెపి నేతలు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, లక్ష్మినారాయణల నేతృత్వంలో బిజెపిలో చేరారు. ఈ సమావేశంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, న్యాలం రాజు, రోషన్‌లాల్ బొహ్రా తదితరులు పాల్గొన్నారు.