నిజామాబాద్

నిబంధనలు పాటించకపోతే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, ఏప్రిల్ 7: సిమ్‌కార్డుల విక్రయాల్లో నియమ, నిబంధనలు పాటించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో అనేక మంది ఎలాంటి నిబంధనలు పాటించకుండానే సిమ్‌కార్డులను విక్రయిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇది సమంజసం కాదన్నారు. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన అభయ్ మోదాని అనే బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటనలో ముగ్గురు నిందితులకు ఎలాంటి ధ్రువపత్రాలు తీసుకోకుండా సిమ్‌కార్డులు విక్రయించినందుకు సదరు డిస్ట్రిబ్యూటర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఎస్పీ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సిమ్‌కార్డుల విక్రేతలు తప్పనిసరిగా టెలికాం శాఖ సూచించే నిబంధనలను అనుసరిస్తూ సరైన ధ్రువపత్రాలు తీసుకున్న మీదటే సిమ్‌కార్డులు విక్రయించాలని ఎస్పీ హితవు పలికారు. బిఎస్‌ఎన్‌ఎల్, ఐడియా, ఎయిర్‌టెల్, డొకోమో, ఎయిర్‌సెల్, టాటా ఇండికామ్, యునినార్ తదితర అన్ని కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు తప్పనిసరిగా ఈ నిబంధనను పాటించాలన్నారు. సిమ్‌కార్డుల కోసం వచ్చే వారి నుండి పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు, ఓటరు ఐ.డి కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిలో ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా సేకరించాలని సూచించారు.