నిజామాబాద్

బంగారు తెలంగాణే లక్ష్యంగా పయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 15: అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవడమే ప్రధాన ధ్యేయంగా నిర్దిష్ట ప్రణాళికలతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి బలమైన పునాది వేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ మూస విధానాలను సమూలంగా మార్చివేస్తూ, ప్రజలకు పారదర్శకంగా, న్యాయబద్ధమైన విధానాలతో సుపరిపాలన అందించేలా సముచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పోచారం ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం ప్రసంగిస్తూ, తెలంగాణలో సమకూరే సంపద, ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఉపయోగపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అందుకే దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో 40వేల కోట్ల రూపాయలతో 35సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందని, 38లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున రూపాయికి కిలో బియ్యం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాలు, దళితులకు మూడెకరాల సాగు భూమి వంటి పథకాలతో సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. తక్కువ వేతనాలతో పని చేస్తున్న ఉద్యోగులను గుర్తించి, వారి జీతభత్యాలను గణనీయంగా పెంచడం జరిగిందని, కనీస వేతన చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను సమతుల్యంగా చేసుకుని ముందడుగు వేస్తున్నామని, ఈ దిశగా ఇప్పటికే అతిపెద్ద సవాల్‌గా నిలిచిన విద్యుత్ కొరత సమస్యను అధిగమించగలిగామని అన్నారు. ఇప్పటికే రైతాంగానికి ఉదయం వేళలో తొమ్మిది గంటల విద్యుత్‌ను అందిస్తున్నామని, వచ్చే ఏడాది నుండి సాగు రంగానికి 24గంటల పాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా వచ్చే ఖరీఫ్ నుండి రైతులకు ముందస్తు పెట్టుబడుల రూపంలో ఎకరానికి 4వేల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తామని, ఈ పథకం ద్వారా సుమారు 56లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు రైతు సంఘాలు, రైతు సమాఖ్యలను ఏర్పాటు చేసి 500కోట్ల రూపాయల మూలనిధిని ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించనుందని, రైతాంగానికి ఎల్లవేళలా వెన్నంటి ఉంటూ సహకారం అందించేలా పెద్ద సంఖ్యలో ఎఇఓలను నియమించామని తెలిపారు. రైతులంతా ఒకే రకమైన పంటను వేసి నష్టపోయే పరిస్థితి ఉత్పన్నం కాకుండా రాష్ట్రం మొత్తాన్ని క్రాప్ కాలనీలుగా ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా పండించిన పంటకు మార్కెటింగ్ సమస్య కూడా తలెత్తదని ఆశాభావం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం సుస్థిర నిర్ణయాలతో అమలు చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ఫలితాలు అందిస్తున్నాయని, తద్వారా తెరాస ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో నమ్మకం మరింతగా పెరుగుతోందన్నారు. గడపగడపకు శుద్ధి జలాలు అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. మిషన్ కాకతీయ కింద 18వేల చెరువులను పునరుద్ధరించుకోవడం జరిగిందని, వ్యవసాయానికి ఇతోధికంగా తోడ్పాటును అందిస్తూనే, చేతివృత్తులు, కుల వృత్తుల వారిని ఆదుకునేందుకు పెద్దఎత్తున సబ్సిడీతో పలు పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. రైతులకు లక్ష రూపాయల్లోపు పంట రుణాల మాఫీ ద్వారా 17వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చామని, కోటి ఎకరాలకు సాగునీటిని అందించాలనే మహత్తర యజ్ఞం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామా తదితర పథకాలకు ప్రభుత్వం లక్షా 50వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తోందన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి వరద ప్రవాహం ఆశించిన స్థాయిలో రాని విషయాన్ని గమనించిన ప్రభుత్వం, కాళేశ్వరం నీటి ద్వారా ఈ రిజర్వాయర్‌ను నింపేందుకు 1060కోట్ల రూపాయలతో పునరుజ్జీవ పథకం చేపడుతోందని, ఏడాది లోగా ఈ పనులు పూర్తి కానున్నాయని, ఫలితంగా 18లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని అన్నారు. రవాణా వసతిని మెరుగుపర్చేందుకు రహదారుల అభివృద్ధి కోసం ఇప్పటికే పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి శాఖల ద్వారా 17వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వివరించారు. ఆసరా పథకం కింద జిల్లాలో 2.56లక్షల మందికి ప్రతీ నెల 27కోట్ల రూపాయల పెన్షన్లు అందిస్తున్నామని, 13వేల మంది ఒంటరి మహిళలకు మరో కోటీ 30లక్షల రూపాయల జీవన భృతి అందిస్తున్నామని తెలిపారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులకు 8లక్షల చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5020 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని వివరించారు. హరితహారం మూడో విడత కింద జిల్లాలో కోటీ 85లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు కోటీ 46లక్షల మొక్కలు నాటడం ద్వారా ఈసారి కూడా నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందన్నారు. ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలను అంకితభావంతో కొనసాగిస్తున్న ప్రభుత్వానికి అన్ని వర్గాల వారు సహకరించి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రి పోచారం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, ఎమ్మెల్సీలు విజి.గౌడ్, ఆకుల లలిత, నగర మేయర్ ఆకుల సుజాత, కలెక్టర్ యోగితారాణా, జె.సి రవీందర్‌రెడ్డి, డిఐజి శివశంకర్‌రెడ్డి, సి.పి కార్తికేయతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు
ఇందూర్, ఆగస్టు 15: అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ, ఉత్తమ సేవలందించిన ఆయా శాఖల ఉద్యోగులను పంద్రాగస్టు వేడుకల సందర్భంగా జిల్లా యంత్రాంగం ఘనంగా సత్కరించింది. మంగళవారం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పోచారం చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు బహూకరించారు. జిల్లా స్థాయి అధికారుల జాబితాలో నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ సిక్తాపట్నాయక్, డిఎఫ్‌ఓ ప్రసాద్, పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎన్‌వి.సాంబయ్య, డిఆర్‌డిఓ పి.డి కె.వెంకటేశ్వర్లు, నిజామాబాద్ ఆర్డీఓ టి.వినోద్‌కుమార్, జడ్పీ సిఇఓ గోవింద్, గ్రౌండ్ వాటర్ డి.డి కె.జగన్నాథరావు, ఉద్యాన శాఖ డి.డి సునందారాణి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ చతుర్వేది, జెడిఎ వాజిద్‌హుస్సేన్, వాటర్‌గ్రిడ్ ఇ.ఇ రమేష్, పశు సంవర్ధక శాఖ ఇంచార్జ్ జె.డి బలీగ్‌అహ్మద్, మైనింగ్ శాఖ ఎ.డి సత్యనారాయణ, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ డి.హరికృష్ణ, రాజీవ్ విద్యామిషన్ ఇ.ఇ శంకరయ్య, పంచాయతీరాజ్ డిప్యూటీ ఇ.ఇ జలేందర్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కిషన్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ టి.సోమయ్య, జిల్లా ఆడిట్ అధికారి రాము, బాల్‌భవన్ సూపరింటెండెంట్ వి.ప్రభాకర్, జిల్లా ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్‌లు ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు పొందారు. అదేవిధంగా కలెక్టరేట్ ఎ.ఓ డి.శ్రీ్ధర్, సూపరింటెండెంట్ ఎస్‌ఎ.రషీద్, ఇ-సేవా ఎ.ఓ ఎల్.రమణ్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ కార్తిక్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ సాయిస్నేహిత్‌గౌడ్, డ్రైవర్ సంజీవ్, సిబ్బంది వై.సునీత, అమ్జద్, రాజు, తహశీల్దార్‌లు బావయ్య, జి.రాజేందర్, ప్రభాకర్‌రెడ్డి, పి.విఠల్, గంగాధర్, డిప్యూటీ తహశీల్దార్లు ముజీబ్, కె.శే్వత, బి.వేణుగోపాల్‌గౌడ్, విఆర్‌ఓ ఎం.శంకర్, జూనియర్ అసిస్టెంట్లు ఎం.రమేష్‌బాబు, స్రవంతి, విఆర్‌ఓ ప్రదీప్, ఆర్డీఓ కార్యాలయ ఉద్యోగి ఎన్.ఒడ్డెన్న, విఆర్‌ఎలు జి.పోశెట్టి, రాజుకుమార్, టెక్నికల్ మేనేజర్ జమీర్‌అహ్మద్, కంప్యూటర్ ఆపరేటర్ హన్మాండ్లు, పోలీస్ శాఖ ఉద్యోగులైన ఆర్మూర్ ఎసిపి శివకుమార్, ఆర్‌ఎస్‌ఐ ఎన్.విష్ణు, ఎఎస్‌ఐలు నర్సింలు, బషీర్, హెడ్‌కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుళ్లు ఎం.స్వామిగౌడ్, సురేందర్, ఎస్.వేణుగోపాల్, శకీల్, రవికిషన్, కనకయ్య, ఎండి.అఫ్సర్, ఎంఎ.హకీమ్, రోమియో అలెగ్జాండర్, జూనియర్ అసిస్టెంట్‌లు కె.నర్సింలు, ఎండి.సిద్దీఖీ, పోలీస్ బెటాలియన్ కానిస్టబుల్ మహేందర్ యాదవ్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహశీల్దార్ డి.వసంత్‌రావు, డ్రైవర్ గంగాధర్, ఎంపిడిఓలు సంజీవ్, సురేందర్, సీతామహాలక్ష్మి, శ్రీనివాస్, వేణుగోపాల్, మల్లారెడ్డి, ఎన్‌జీవో ప్రతినిధులైన డాక్టర్ శ్రీనునాయక్, డాక్టర్ కవితారెడ్డి, కిషన్, సఫియా, సంతోష్, ప్రవీణ్‌కుమార్, ఎస్.కృష్ణమోహన్, ఉషా, లక్ష్మి, చంద్రకళ, వి.జయశ్రీ, జె.నారాయణ, ఎంఎ.షుకూర్, దర్శన్‌సింగ్, మంజూర్‌అహ్మద్, భూగర్భ శాఖ ఉద్యోగి నిఖత్‌పర్వీన్, సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లు ఐ.సుభాషిణి, శివకుమార్, ఎక్సైజ్ శాఖ అధికారులు ఎన్.మోహన్, బానోత్‌పటేల్, ఎం.ప్రభాకర్, పశు సంవర్ధక శాఖ వైద్యులు డి.బాసరెడ్డి, ఎల్.ప్రభాకర్, ఎ.ప్రమోద్, డి.సంతోష్, కె.సంతోష్, డి.హన్మంత్‌రెడ్డి, ఎస్.గంగాప్రసాద్, సిబ్బంది గంగరాజు, జి.పద్మావతి, ఎం.మంజుల, ఎస్.్భస్కర్, ఎం.శివప్రసాద్, ఎండి.షఫియుద్దీన్, సయ్యద్ ఇస్మాయిల్, బి.మారుతి, ఇరిగేషన్ ఎ.ఇ జి.హరిస్వరూప్, సీనియర్ అసిస్టెంట్ ఎస్.గంగాధర్, బి.ప్రసాద్, మతస్యశాఖ ఫీల్డ్‌మెన్ పి.యెల్లేష్, జిల్లా ఆసుపత్రి వైద్యులు సునీతాదేవి, యూసుఫ్‌ఖాన్, గోపాల్‌శింగ్, తిమ్మారెడ్డి, కిరణ్, స్ట్ఫానర్సు జ్యోతి, ల్యాబ్ టెక్నిషియన్ హిమాయత్, డిఆర్‌డిఎ ఉద్యోగులు శ్రీనివాస్, టి.ప్రవీణ్‌కుమార్, పి.అనిల్‌కుమార్, ఎస్.వెంకటేశ్, ఎ.శ్యామల, కె.సురేష్, డ్వామా సిబ్బంది రాజేశ్వర్, సాయిబాబా, పి.శంకర్, కళ్యాణి, ఎస్.రవీందర్, కృష్ణ, రజిత, మహిపాల్, ముఖేష్, నారాయణ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎ.ఇ ఎ.విజయ్‌కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులు పి.్భమన్న, నాందేవ్, కె.రాజందర్‌ప్రసాద్, సంతోష్, జిల్లా వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు డాక్టర్ విద్య, డాక్టర్ రాకేష్, సిబ్బంది ఎస్.సృజన, రామవ్వ, ఎ.యాదమ్మ, పి.విజయలక్ష్మి, వెంకట్, విద్యాశాఖ ఉద్యోగులు పద్మనాభం, బి.రాజేశ్వర్, జి.ఇందిర, ఎం.శ్రీనివాస్, శంకర్, వెంకటేశ్వర్‌రెడ్డి, పి.సుధాకర్‌రావు, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల ఉద్యోగులు బి.సంగీత, డి.తారలత, డి.స్వప్న, ఐసిడిఎస్ ఉద్యగులు బి.సవిత, లలిత, బి.శాంత, టి.సుజాత, పి.రాధిక, ఆర్.సరస్వతి, కిరణ్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రసూనలత, చిన్నయ్య, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజర్ దస్రునాయక్, వ్యవసాయ శాఖ ఉద్యోగులు సిహెచ్.వెంకటేశ్వర్లు, జి.రాంబాబు, ఎం.విక్రమ్, వి.స్నేహ, ఎం.వసంతలక్ష్మి, ఎం.రాకేష్, కె.సాయిలు, అటవీ శాఖ ఎఫ్‌ఆర్ రవిమోహన్‌భట్, సెక్షన్ ఆఫీసర్ ఎంఎ.అజీజ్, బాల్‌భవన్ ఆర్ట్ ఇన్‌స్ట్రిక్టర్ సి.పుష్పలత, ఆయా కె.విజయ, బిసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డి.యాదగిరి, కుక్ చంద్రమ్మ, జూనియర్ అసిస్టెంట్ రజిత, ట్రాన్స్‌కో ఉద్యోగులు సి.యశ్వంత్‌రావు, జి.గంగాధర్, బల్దియాల ఉద్యోగులు సునీల్, యాదమ్మ, గంగాధర్, సాయమ్మ, వెంకన్న, శంకర్, డిపిఓ ఉద్యోగులు కె.సుభాష్‌చంద్రబోస్, భరత్‌చంద్ర, జకీర్‌హుస్సేన్, జకీర్, ప్రవీణ్, మారుతి, సాయిరాం, ముత్తెన్న, సమాచార శాఖ ఫొటోగ్రాఫర్ యేడుకొండలు, డిఎఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కబీర్‌పాషా, 108 ఉద్యోగి మహేష్, డిచ్‌పల్లి మానవతా సదన్ సిబ్బంది కిషన్, మంజుల, శేషాద్రి, సయ్యద్ సాబిర్‌అలీ, గంగామణి, ఫైర్‌మెన్ బి.గోవింద, రైల్వే ఎస్‌ఐ సాయినాథ్, కానిస్టేబుల్ గురుదాస్‌లు ఉత్తమ సేవలకు గాను ప్రశంసాపత్రాలు పొందారు.

రైతుల ఖాతాల్లోకి ఇక నేరుగా ఎకరాకు రూ. 4 వేలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో
ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్

కామారెడ్డి, ఆగస్డు 15:రైతులకు న్యాయం చేయాలన్న ఉద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరానికి 4వేల చొప్పున ఖరీఫ్, రబీ పంటలకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు 4వేల చొప్పున ఏడాది రెండు పంటలకు 8వేల రూపాయలు రైతుల బ్యాంకు అకౌంట్‌ల్లో వేయనుందని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరగాంధీ స్టేడియంలో 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ విప్ ఇందిరగాంధీస్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సభలో విప్ మాట్లాడుతూ, ఉద్యానవన శాఖ ద్వారా బిందు సేద్యం కోసం 6లక్షల రూపాయల విలువ గల పరికరాలను 90శాతం సబ్సిడిపై అందిస్తుందని అన్నారు. పశుసంవర్థక శాఖ ద్వారా 75శాతం సబ్సిడిపై ఇప్పటి వరకు 2,167గొర్రెల యూనిట్లకు దాదాపు 27కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 565చరువుల్లో పనులు పూర్తి అయ్యాయని, 3వ విడతలో 185చెరువులను పునరుద్దరణ పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. సిఎం ప్రారంభించిన ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవ పథకం ద్వారా జిల్లాకు 22వ ప్యాకేజీ ద్వారా గోదావరి జలాలు ప్రవేశించి కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్‌వాడ పరిధిలో 1లక్షల 87వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతోందన్నారు. ఆహార భద్రత పథకం ద్వారా 2లక్షల 46వేల రేషన్‌కార్డుల ద్వారా నెలకు 5,436 మెట్రిక్ టన్నుల బియ్యం కిలోరూపాయికే అందించడం జరుగుతోందని అన్నారు. డబుల్ బెడ్‌రూం పథకం ద్వారా బాన్స్‌వాడ, బీర్కూర్ మండలాల్లో 255 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. భూమి కొనుగోలు పథకం ద్వారా 29 మంది లబ్ధిదారులకు 75 ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈవిద్యా సంవత్సరం జిల్లాలో2బిసి బాలికల గురుకుల పాఠశాలను పిట్లం, బీర్కూర్ మండలాల్లో. బిసి బాలుర గురుకుల పాఠశాలను తాడ్వాయి, బీర్కూర్‌లలో ప్రారంభించామని అన్నారు. బ్యాంకు లింకేజీద్వారా 630 ఎస్‌హెచ్‌జిలకు 14 కోట్లు, స్ర్తినిధి ద్వారా 9కోట్ల రూపాయల వరకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా 112గ్రామ పంచాయతీల్లో 100 శాతం మరుగుదొడ్లు కట్టుకున్న జిపిలు పూర్తి అయినట్లు తెలిపారు. తెలంగాణ హరితహారంలో 98 గ్రామ పంచాయతీల్లో 100 శాతం మొక్కలు నాటడం జరిగిందని, మిషన్ భగీరథ అంతర్గత గ్రామాల ద్వారా 834 అవాసా ప్రాంతాల్లో ప్రతి పౌరుని కి రజుకు 100 లీటర్ల చొప్పున శుద్దిచేయబడిన తాగునీరు అందించేందుకు 216 కోట్ల నిధులతో నీటి ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్లనిర్మాణం, నల్లాకనెక్షన్‌లు ఇవ్వడం జరిగిందన్నారు. ఆరోగ్య సంక్షేమం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 1116 కెసిఆర్ కిట్లు పంపిణీ చేశామన్నారు. సాధాబైనామాలో 93శాతం ప్రగతి సాధించడం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ ద్వారా గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా 612 సిసిరోడ్లుకు 29కోట్ల రూపాయలు మంజూరు చేయగా, 481సిసిరోడ్ల పనులు పూర్తి అయినట్లు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాను 100ళశాతం నాటు సార రహిత జిల్లాగా ప్రకటించడం జరిగిందన్నారు. 18సంవత్సరాలు నిండినవారు, 3లక్షల తెల్లరేషన్ కార్డులు కల్గిన లబ్దిదారులకు 3లక్షల మంది లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తామని అన్నారు. అనంతరము స్టేడియంలో వ్యవసాయ శాఖ వ్యవసాయ యాంత్రీకరణ, పశుసంవర్థక శాఖ గొర్రెల యూనిట్ పంపిణీ, డిఆర్‌డిఎ ద్వారా ఒడిఎఫ్, వైద్యాశాఖ ద్వారా తట్టు, రుబెల్లావ్యాక్సినేషన్, డిఇఓ, సంక్షేమ శాఖలు సర్వశిక్ష అభియాన్, అటవిశాఖ హరితహారంపై, ఇరిగేషన్ మిషన్‌కాకతీయ మన ఊరు - మన చెరువు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారాడబుల్‌బెడ్‌రూం, ఐసిడిఎస్‌య ద్వారా మహిళలు, పిల్లలు, వికలాంగులపై, ఆర్‌డబ్ల్యుఎస్ ద్వారా ఐహెచ్‌ఎచ్‌ఎల్ శకటాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అనంతరము శకటాలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కూడళ్లలో తిరగాలని కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ ఆదేశంతో ఈ శకటాలను జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన కూడళ్ల వరకు వెళ్లి ప్రదర్శన నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరగాంధీ స్టేడియంలో జడ్పీహెచ్‌ఎస్ హనుమాన్ మందిరం, లయోలా, కెజీబివి దొమకొండ, మాచారెడ్డి అంగన్‌వాడి, రోబెల్స్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయ. ఈ సందర్భంగా స్టేడియంలో వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రభుత్వ విప్‌తో పాటు పార్లమెంట్ సభ్యులు బీబీపాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, కలెక్టర్. డాక్టర్. ఎన్. సత్యనారాయణ, ఎస్పీ శే్వత, జిల్లా జాయింట్ కలెక్టర్ సత్తయ్య, డిఆర్‌ఓ మణిమాల, డిఆర్‌డిఓ చంద్రమోహన్‌రెడ్డిలు పరిశీలించారు. ఇంతే కాకుండా డైరీ శాఖ ఏర్పాటు చేసిన పాలను తాగి, స్వీట్ల రుచి చూశారు. అనంతరము లబ్దిదారులకు ట్రైసైకిళ్లను, ట్రాక్టర్‌లతో పాటు ఇతర వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డిఎస్పీ ప్రసన్నలక్ష్మీ, సిఐ. శ్రీ్ధర్‌కుమార్‌తో పాటు పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోలీసు నిఘా నీడలో స్వాతంత్య్ర వేడుకలు
వినాయక్‌నగర్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో అడుగడుగునా పోలీసు నిఘా కొనసాగింది. పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ వేడుకలు ముగిసేంత వరకు కూడా గట్టి నిఘా ఉంచారు. పరేడ్ గ్రౌండ్ లోపలికి ప్రవేశించే ప్రధాన ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్‌లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా సోదాలు చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. ఎస్‌ఐ ఆ పైస్థాయి అధికారులందరికి వాకీటాకీలు సమకూర్చి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు భద్రతా పరిస్థితులను సమీక్షించారు. వేడుకలకు ఆతిథ్యమిచ్చిన పరేడ్ గ్రౌండ్ చుట్టూ బందోబస్తును ఏర్పాటు చేసి, బాంబ్ స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. ఇంటలిజెన్స్ వర్గాలు ప్రత్యేకించి ఎలాంటి హెచ్చరికలు చేయనప్పటికీ, ముందస్తు అప్రమత్తతలో భాగంగా భద్రతాపరమైన చర్యలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఉగ్రవాద కార్యకలాపాలతో జిల్లాకు విడదీయరాని బంధం ఉన్నట్టు ఇదివరకు అనేక సంఘటనలు స్పష్టం చేసిన దరిమిలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ఒకరోజు ముందు నుండే విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతూ, పరేడ్ గ్రౌండ్ వద్ద మంగళవారం తెల్లవారుజాము నుండే సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. జిల్లాకు చెందిన మంత్రి పోచారంతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ప్రజలు, విద్యార్థులు తరలివచ్చినందున వారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీసు సిబ్బందితో పరేడ్ గ్రౌండ్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం మీద పోలీసు శాఖ వేడుకలను సవ్యంగా నిర్వహించడంలో సఫలీకృతమైంది. ప్రశాంతంగా వేడుకలు ముగియడంతో పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

స్ఫూర్తి యాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికం
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పద్మ

కామారెడ్డి, ఆగస్టు 15: అమరవీరుల స్ఫూర్తియాత్రను నిర్వహిస్తున్న టిజెఎసి చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరామ్‌ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.పద్మ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా సిపిఐ కౌన్సిల్ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడం, తెలంగాణ అమరుల గురించి ప్రజలకు తెలియచెప్పేందుకు కోదండరామ్ చేపట్టిన స్ఫూర్తియాత్ర సభపై టిఆర్‌ఎస్ గుండాలు దాడి చేసి కమ్యూనిస్టు కార్యకర్తలను, ఎఐఎస్‌ఎఫ్ విద్యార్థి నాయకులను, జెఎసి నాయకులను తీవ్రంగా గాయపర్చడం బట్టి చూస్తే సిఎం కెసిఆర్ పిరికి తనానికి ఇదో నిదర్శనంగా చెప్పవచ్చని అన్నారు. ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు, మంచి రోజులు ఇస్తానన్న మోది ఇప్పుడు ఉద్యోగాల హామీ మరిచి మంచి రోజులు కాదు, మోడికి విదేశాల్లో తిరిగేందుకు మంచి రోజులు వచ్చాయని ఆమె ఎద్దేవా చేశారు.

రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న డాక్టర్ రమేష్
ఆర్మూర్, ఆగస్టు 15: ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేయించడంలో రికార్డు సృష్టించిన జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ రమేష్ మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. ఒకే నెలలో 311 ప్రసవాలు చేయించడంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ రమేష్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు. ఇటీవల పోచంపాడ్‌కు వచ్చిన సందర్భంగా సిఎం కెసిఆర్‌ను జిల్లా కలెక్టర్ యోగితారాణా ఆధ్వర్యంలో డాక్టర్ రమేష్, ఇతర వైద్యులు కలిసి ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల గురించి వివరించారు. దీనికి స్పందించిన సిఎం కెసిఆర్ ప్రసవాలను చేయిస్తున్న డాక్టర్ రమేష్‌ను ప్రశంసించడంతో పాటు రాష్ట్ర స్థాయి అవార్డుకు సిఫార్సు చేయాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం డాక్టర్ రమేష్ రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. సిఎం కెసిఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని డాక్టర్ రమేష్ చెప్పారు. అలాగే ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాములు జిల్లా స్థాయిలో ఉత్తమ కానిస్టేబుల్‌గా జిల్లా కలెక్టర్ యోగితారాణా, కమీషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. అలాగే ఆర్మూర్ మున్సిపాలిటీలో రెవిన్యూ ఆఫీసర్‌గా పని చేస్తున్న వెంకన్న కూడా జిల్లా స్థాయిలో ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

విద్యార్థులకు పతంజలి యోగా కేంద్రం పండ్ల రసాల పంపిణీ
ఇందూర్, ఆగస్టు 15: పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని మంగళవారం భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, పతంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో ఎడపల్లి మండలం జానకంపేట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వివిధ రకాల పండ్ల రసాలను అందజేశారు. ఈ సందర్భంగా భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు గంజుల సాయన్న, పతంజలి యోగా కేంద్రం జానకంపేట్ గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు చిక్కెల సుదర్శన్, నీల బాలకిషన్‌గుప్తాలు మాట్లాడుతూ, ప్రాకృతిక సంపదను బలోపేతం చేసి, పర్యావరణ సంరక్షణ కోసం జూలై 15నుండి ఆగస్టు 15వరకు చేపట్టిన వృక్షారోపణ మాసంలో భాగంగా పతంజలి సంస్థ వివిధ రకాల పండ్లతో తయారు చేసిన జ్యూస్ డబ్బాలను అందజేయడం జరిగిందన్నారు.

యోగితారాణా ఫ్యాన్స్ అసోసియేషన్ రక్తదానం
ఇందూర్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమాజ సేవ, యోగితారాణా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సల్మాన్ మాట్లాడుతూ, జిల్లా జనరల్ ఆసుపత్రిలో సకాలంలో రక్తం అందక ఎంతోమంది నిండు గర్భిణు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీంతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజ సేవ, యోగితారాణా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మంగళవారం జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 20మంది యువకులు రక్తం దానం చేయడం జరిగిందని సల్మాన్ తెలిపారు. ఆరోగ్యవంతులైన యువకులు ప్రతి ఒక్కరు రక్తదానం చేసి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడాలని ఆయన కోరారు.

అధికారులు, ఉద్యోగులకు అవార్డులు

కామారెడ్డి, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో పనిచేస్తున్న 44శాఖలకు చెంది ఉత్తమ అధికారులు, ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేశారు. ఎంపికైన వీరికి మంగళవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన అవార్డు ప్రధాన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, ఎంపి బీబీపాటిల్, ఎమ్మెల్యే హన్మంత్‌షిండె, కలెక్టర్. డాక్టర్. సత్యనారాయణ, జెసి సత్తయ్య, ఎస్పీ శే్వతల చేతుల మీదుగా ఉత్తమ అవార్డులను పంపిణీ చేశారు. పశుసంవర్థక శాఖ నుండి వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పశువైద్యులు మారుతి, రమేష్, వెటర్నరీ లీవెస్టిక్ ఆఫీసర్ పి.సుజాత, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ రాజేశ్వర్, లీవిస్టిక్ అసిస్టెంట్ అబ్ధుల్ మజీద్, టైపిస్టు జి.అంబరీష్, ఆఫీస్ సబర్డినేట్ సాయిరెడ్డి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నుండి ఎఇ యశ్వంత్, జూనియర్ అసిస్టెంట్ నర్సారెడ్డి, డిఇఇ నాగరాజు, ఎఇఇ నాగేశ్వర్, విద్యత్ శాఖలో లైన్ ఇన్స్‌పెక్టర్ ఎస్.గంగాధర్, లైన్‌మెన్ ఎ.జగదీశ్వర్, ఎఎల్‌ఎమ్.ఎస్.మాణిక్యం, జెఎల్‌ఎమ్ ఎస్.రాజేశ్వర్, ఆర్‌అండ్‌బి శాఖలో డిఇ.కిషన్, జూనియర్ అసిస్టెంట్ సిహెచ్.శ్రీలత, డిపిఆర్‌ఓ విభాగంలో టైపిస్టు దేవ్‌జా, డిఇఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ కె.నర్సింహారావు, ప్రధానోపాద్యాయుడు సంజీరెడ్డి, సినియర్ అసిస్టెంట్ సజ్జంత్, అలాగే జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జె.పూర్ణచందర్‌నాయక్, డిసిఓ కార్యాలయంలో ఆఫీస్ సబర్డినేటర్ ఇ.సత్యనారాయణ, సినియర్ ఇన్స్‌పెక్టర్ జె.నాగేష్, రవాణశాఖలో ఆఫీస్ సబార్డినేటర్ మహ్మద్‌గౌస్, ట్రెజరీ శాఖలో ఎస్‌టిఓ.హెచ్.సత్యనారాయణ, సినియర్ అసిస్టెంట్ జి.శశికిరణ్, నీటిపారుదల శాఖలో డిఇఇ ఎస్. వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖలో ఎంఎఓ.జి.వెంకటేశ్వర్‌రెడ్డి, జి.సంతోష్‌కుమార్, సూపరెంటెండెంట్ కృష్ణరావు, ఎఇఓ శ్రీనివాస్‌రెడ్డి, యు.రవీందర్, జివై.ప్రభాకర్, కె.ప్రజాపతి, యు.రజిత, లక్ష్మీకాంత్‌రెడ్డి, రాజాగౌడ్, ఎన్.దయానంద్, సినియర్ అసిస్టెంట్ అంజమ్మ, ఆఫీస్ సబర్డినేట్ రఫీక్, పంచాయతీరాజ్ శాఖలో ఇఓ వి.సాయిబాబా, జి.రవీందర్‌రావు, ఆఫీస్ సబర్డినేటర్ జె.చంద్రయ్య, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ విభాగంలో ఎపిపి. కొమలత సుబ్బయ్య, రూరల్‌వాటర్ సరఫరాలో డిఇఇ బి.రామకృష్ణ, ఎఇఇ వెంకటేశ్, జూనియర్ అసిస్టెంట్ శివకుమార్, సివిల్‌సప్లయిస్‌లో అకౌంటెంట్ కె.శివకుమార్, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో డిఎస్‌ఓ మహిజాదేవి, సర్వే అండ్స్ ల్యాండ్ రికార్డు విభాగంలో సర్వేయర్ సిహెచ్.గంగాధర్, చైన్‌మెన్ ఎస్‌కె.సలీమ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లక్ష్మీనర్సింహారాజు, జిల్లా బిసి వెల్ఫేర్‌లో అటెంటర్ బి.సాయులు, డబ్ల్యుహెచ్‌ఓ బోజరాం, కుక్ రసియాబేగంలకు అవార్డు అందచేశారు. అలాగే జిల్లా వైద్యశాఖలో సివిల్ సర్జన్ డాక్టర్. పి,.సుధా, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జి.సుజాత, హెడ్‌నర్స్ మెరీ సునంద, స్ట్ఫానర్స్ కమలబాయి, డిఆర్‌డిఓలో ఏరియా కో-ఆర్డినేటర్ సుధాకర్, ఎక్సైజ్ శాఖలో ఎస్‌ఐలు డి.సాయన్న, ఆర్. సృజన, పి.గంగాధర్, కానిస్టేబుల్ మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ కామారెడ్డిలో ఎంఎన్‌సి శ్రీ్ధర్‌రెడ్డ, చీఫ్ ఇన్స్‌పెక్టర్ శివరామ్, డిసిడి రాజగోపాల్, సూపర్‌వైజర్ అరుణకుమారి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలాజీ శాఖలో జూనియర్ అసిస్టెంట్ డి.శివప్రసాద్, బి.వెంకటాద్రి, జి.నరహారిలకు ఉత్తమ అవార్డులు అందచేశారు. అలాగే జిల్లా స్థాయి అధికారుల్లో మత్స్యశాఖలో ఎడి ఫిషరీస్ శ్రీమతి. పూర్ణిమ, డిఎం అండ్‌హెచ్‌ఓ డాక్టర్. మధుశ్రీ, ఎపిఎమ్ కె,.రాజు, బి.రాజిరెడ్డి, కమ్యూనిటి కో-ఆర్డినేటర్ సంగీత, ఎంఎస్‌సిసి భూమగౌడ్, ఎంపిడివోలు శ్రీనివాస్‌గౌడ్, సాయిబాబా, రాములునాయక్, ఎపిఓ మంజుల, ఇసి రాధిక, జెసి హలీమ్‌అక్మల్, డిబిటి కల్పన, డిఆర్‌పి హరికృష్ణ, సిఓ స్వరూప, టిఎ గంగాధర్, సిఓ సంబాజీ, ఎఫ్‌ఎ. సాయిరెడ్డి, ఇంద్రాజీత్, వ్యవసాయ శాఖలో డిఎఓ నాగేంద్రయ్య, మైనార్టీ వెల్ఫేర్‌లో మైనార్టీ వేల్పేర్ ఆఫీసర్ సోమేశ్వర్, కామారెడ్డి రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో తహశీల్దార్‌లు రవీందర్, సుధాకర్‌రెడ్డి, విఆర్‌ఓ చెన్నరాజు, ఎంఆర్‌ఐ సంతోష్, జెఎ అర్పన, అటెండర్ రాజేందర్, విఆర్‌ఎదేవేందర్, బాన్స్‌వాడ రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో తహశీల్‌దార్ కె.కిష్టనాయక్, డిప్యూటి తహశీల్దార్ సి.నారాయణ, గిర్దావర్ వాసీమ్, సినియర్ అసిస్టెంట్ మాధవి, విఆర్‌ఓ రజిని, విఆర్‌ఓ టి.వెంకటేశ్వర్లు, ఎల్లారెడ్డి రెవిన్యూ శాఖలో నాయబ్ తహశీల్దార్ గంగాధర్, జూనియర్ అసిస్టెంట్ వాణికుమారలకు అవార్డులు అందచేశారు. అలాగే కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న తహశీల్దార్ ఎఓ పివి.పద్మరావు, నాయబ్ తహశీల్దార్‌లు పవన్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, వరప్రసాద్, సినియర్ అసిస్టెంట్‌లు నవీన్‌కుమార్, అనిల్ బెన్సన్, నారాయణ, లింగం, కిషన్‌లాల్, షాదుల్లాలకు అవార్డులు అందచేశారు. ఇకపోతే పోలీస్‌శాఖలో ఎస్‌ఐలు సంతోష్, శ్రీకాంత్‌రెడ్డి, బి.శోభన్‌బాబు, ఎఆర్‌ఎస్‌ఐ. రఘురామ్, ఆర్‌ఎస్‌ఐ నర్సింహారావు, ఎఎస్‌ఐ కాంతయ్య, మహిళపిసి నాగలక్ష్మీ, రాజేశ్వరీ, కానిస్టేబుల్స్ లక్ష్మణ్‌రావు, జి.మురళిమోహన్, వినయ్‌సాగర్, సంపత్, నంద, శ్యామ్, సర్దార్, బైరవప్రసాద్, బాబయ్య, రాంచందర్, వాహబ్, రాజునాయక్, రాఘవేంద్రచారీ, సిద్దిఖి, దత్తురావు, పండరీ, జూనియర్ అసిస్టెంట్ రజిని, త్రీశూల్, హెడ్‌కానిస్టేబుల్స్ రామ్‌సింగ్, మురళికృష్ణ, చందులాల్, ఆంజనేయులు, రాంచందర్, సునీర్‌కుమార్‌లకు అవార్డులు అందచేశారు. ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్స్‌లో ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మధుకర్, అలాగే సాంఘీక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలల నుండి ప్రిన్సిపాల్ లక్ష్మీబాయి, ఉపాద్యాయులు ఎం.సురేందర్‌రెడ్డి, సిఆర్‌టి జి.మానసవీణ, పిడి.నాగేశ్వర్‌రావు, జెఎ పి.రాజులకు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.