నిజామాబాద్

చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఏప్రిల్ 8: మోర్తాడ్ మండలంలోని అనేక గ్రామాలను కలుపుతూ ప్రవహించే పెద్దవాగులలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణాల ద్వారా వరద నీటిని సద్వినియోగం చేయడానికి నీటిపారుదల శాఖ సమాయత్తం అయ్యింది. ఇందులో భాగంగానే మోర్తాడ్ మండలంలోని అనేక గ్రామలలోని వాగుల్లో చెక్‌డ్యాంల నిర్మాణాలకు నిధులు కావాలంటు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. భీమ్‌గల్, వేల్పూర్, మోర్తాడ్ మండలాల గుండా ప్రవహించే పెద్దవాగులో ప్రతీ సంవత్సరం వేలాది క్యూసెక్కుల వరద జలాలు తడ్‌పాకల్ గోదావరిలో కలుస్తూ వృథా అవుతున్నాయి. పెద్దవాగుకు ఉప నదులుగా ఉన్న మొండివాగు, ఉడిపివాగుల్లో కూడా పరిస్థితి దాదాపు ఇదే విధంగా ఉంటుంది. ప్రస్తుతం మోర్తాడ్ మండలంలో భూగర్భ జలాలు అడుగంటి జిల్లాలోనే కేటగిరి-1లో ఉంది. ఐదు వందల ఫీట్లలోతులో బోరుబావులు వేసిన దుమ్ముదూళే తప్పా, నీటి చుక్క బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితులలో నీటిపారుదల శాఖ అధికారుల ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆదేశాలతో సర్వేలు నిర్వహించి ప్రభుత్వానికి చెక్‌డ్యాంల నిర్మాణాలకు అవసరమైన నిధుల కోసం ప్రతిపాదించారు. ఇప్పటికే గాండ్లపేట వరదకాల్వ వద్ద చెక్‌డ్యాం నిర్మాణానికి ఎమ్మెల్యే ఇరవై లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించారు. అలాగే మిగతా ప్రాంతల్లోను చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తే మంచి ఫలితాలు వస్తాయంటు చెప్పిన అధికారులు ఆ మేరకు ప్రతిపాదించారు. తొర్తి పెద్దవాగులో చెక్‌డ్యామ్ నిర్మాణంతో పాటు మోర్తాడ్ మొండివాగులో, దోన్‌పాల్ వాగులోనూ చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు గాను ఆరవై లక్షల రూపాయల నిధులు అవసరం అవుతాయని అంచనాలు రూపొందించారు. ఏర్గట్ల, తాళ్లరాంపూర్, గుమ్మిర్యాల గ్రామాల శివార్ల గుండా ప్రవహించే తీగెల వాగులోను చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. తాళ్లరాంపూర్ వద్ద మూడు చెక్‌డ్యాంలు, గుమ్మిర్యాలలో రెండు, ఏర్గట్ల తీగెలవాగులో రెండు చెక్‌డ్యాంలు నిర్మించాలని సంబంధిత శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఏడుకోట్ల ఇరవై లక్షల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు అవి మంజూరు అయిన వెంటనే వర్షాకాలం ముగిసేలోగా పనుల ప్రారంభించేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి పెద్దవాగులో భూగర్భ జలాల పెంపుదలకై గతంలోనే ప్రభుత్వాలు లక్షలాది రూపాయలు వెచ్చించి సబ్‌సర్ఫేజ్ చెక్‌డ్యామ్‌లను ఏర్పాటు చేసింది. వాగులో లోతునుండి ఇసుక నిల్వలు తొలగించి అడుగు నుండి చెరువులోని పూడిక మట్టిని నింపుతు చెక్‌డ్యాంలను ఏర్పాటు చేసింది. మొదట్లో ఇవి సత్ఫాలితాలనే ఇచ్చినప్పటికీ, నిర్మాణ వైఫల్యాల కారణంగా అవి పనికిరాకుండా పోయాయి. పెద్దవాగు ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటిని అందిస్తునే కొన్ని గ్రామాలకు దాహార్తి సమస్యను కూడ తీరుస్తోంది. అంతేకాకుండా పాలెం, తొర్తి గ్రామాలలోని పెద్దవాగులో రెండుకోట్ల రూపాయల వ్యయంలో ఎత్తిపోతల పథకాలు కూడా చేపట్టారు. ఇటు మొండివాగులోను మూడు చెక్‌డ్యామ్‌లను ప్రభుత్వం చేసింది. అయితే పూడిక పెరిగిపోవడంతో అవి వాగులోనే కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అధికారులు ఇదే వాగులో మరో చెక్‌డ్యామ్ నిర్మాణం కోసం ప్రతిపాదించారు. దీనికి మంజూరీ ఇస్తునే పాత చెక్‌డ్యామ్‌లలోను పూడికను తొలగిస్తే ఈ ప్రాంతంలో నీటి ఇక్కట్లే ఉండవని ఆయకట్టు రైతులు అంటున్నారు. పెద్దవాగులోను చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. నాలుగైదు రోజుల పాటు భారీ వర్షం కురిసిందంటే చాలు వాగు నిండుగా ప్రవహిస్తుందని, ఆ ఒక్క ప్రభావం వల్లే వాగులో తాము వేసుకున్న ఫిల్టర్‌బెడ్‌లు పూర్తిగా రీచార్జ్ అవుతాయని రైతులు చెబుతున్నారు. అలాంటిది వాగులో చెక్‌డ్యాంలను నిర్మిస్తే తమకిక సాగునీటి కొరతే ఉండదని చెబుతున్న రైతులు, ప్రభుత్వం వెంటనే నీటిపారుదలశాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయాలని కోరుతున్నారు.