నిజామాబాద్

22న మద్యం ‘లాటరీ’కి ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

22న మద్యం ‘లాటరీ’కి ఏర్పాట్లు

ఆంధ్రభూమి బ్యూరో

నిజామాబాద్, సెప్టెంబర్ 20: జిల్లాలోని వైన్‌షాపుల లైసెన్సులను దక్కించుకునేందుకు పాతకాపులే కాకుండా కొత్తగా అనేక మంది మద్యం వ్యాపారంపై ఆసక్తి చూ పుతూ టెండర్లు దాఖలు చేసేందుకు పోటీ పడ్డారు. 95 మ ద్యం దుకాణాలకు గాను ఏకంగా 1332 దరఖాస్తులు అందాయి. ఈ లెక్కన వాపసు చేయబడని సొమ్ము రూపంలోనే ప్రభుత్వానికి 13.32కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. రెండు దుకాణాలకు మాత్రమే పోటీ లేకుండా ఒక్కోటి చొప్పున టెండరు ఫారాలు దాఖలవగా, మిగతా అన్ని షాపులకు పోటీ నెలకొంది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణ ప్రాంతాల్లోనైతే ఒక్కో మద్యం దుకాణానికి సగటున పది కంటే ఎక్కువ టెండర్లు వచ్చాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు కూడా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. దరఖాస్తుదారుల్లో అత్యధిక మంది ఇదివరకటి నుండి మద్యం వ్యాపారంలో ఆరితేరిన పాతకాపులే ఉండడం విశేషం. గతంలో సిండికేట్‌గా మారి దోపిడీ పర్వాన్ని కొనసాగించడంతో ఎసిబి కేసులు నమోదై జైలుకు వెళ్లి వచ్చిన వారు కూడా ప్రస్తుతం మద్యం టెండర్లలో పాల్గొన్నారంటే లిక్కర్ వ్యాపారంపై వారికి ఎంతటి ఆసక్తి ఉందో తేటతెల్లమవుతోంది. సదరు వ్యక్తులు స్వయంగా టెండర్లు వేయడమే కాకుండా, తమ వద్ద పని చేసే వారి పేర్ల పైనా దరఖాస్తులు దాఖలు చేయించినట్టు తెలుస్తోంది. సెంటిమెంట్‌ను నమ్ముకుని ఇదివరకటి తరహాలోనే మరికొందరు తమ కుటుంబ సభ్యులైన మహిళలతో టెండరు ఫారాలు వేయించారు. ఇదిలాఉండగా, రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ నెల 22న లక్కీ డ్రా నిర్వహించేందుకు అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30గంటలకు ఇంచార్జ్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్‌ల సమక్షంలో లక్కీ డ్రా ప్రక్రియ ప్రా రంభం కానుంది. ఒక్కోటి చొప్పున దరఖాస్తులు వ చ్చిన దుకాణాలను మినహాయిస్తూ, అంతకంటే ఎక్కువ టెండర్లు దాఖలైన షాపులకు సంబంధించి లాటరీ తీసి మద్యం లైసెన్సులను ఖరారు చేయనున్నారు. దరఖాస్తులు చేసుకున్న వారిని మాత్రమే లోనికి అనుమతించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే దరఖాస్తుదారులకు టోకెన్లు అందజేయగా, వాటిని పరిశీలించి లోనికి పంపనున్నారు. లక్కీ డ్రాలో దుకాణం కేటాయించబడిన వారు ప్రభుత్వ నిర్దేశిత రుసుమును వెంటనే చెల్లించేందుకు వీలుగా ఆడిటోరియం వద్దే తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, పలు ప్రజా సంఘాలు మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ తీవ్ర అ భ్యంతరాలు వ్యక్తం చేస్తున్న దరిమిలా, లాటరీ ప్రక్రియకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందనే అనుమానాలతో పెద్దఎత్తున పోలీసు బందోబస్తును నియమించాలని నిర్ణయించారు. అంతేకాకుండా మద్యం లాటరీలో పాల్గొనే వా రంతా భారీగా నగదు నిల్వలతో హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తం మీద శుక్రవారం నాటి మద్యం లాటరీ ప్రక్రియ సందర్భంగా రాజీవ్‌గాంధీ ఆడిటోరియం పరిసర ప్రా ంతాల్లో ఎనలేని సందడి వాతావరణం నెలకోనుంది. లక్కీ డ్రాలో వైన్‌షాపుల లైసెన్సులు దక్కించుకున్న వారు ఆనందోత్సాహాల నడుమ సంబరాలు జరుపుకోనుండగా, లైసెన్సులు దక్కని వారు ఒకింత నిరాశకు గురి కానున్నారు. టెండరు ఫారాలతో పాటు ఇఎండి రూపంలో వాపసు చేయబడని సొమ్ము లక్ష రూపాయల చొప్పున దరఖాస్తు ఫారాలతో పాటు జమ చేసినందున డ్రాలో అదృష్టం కలిసిరాకపోతే ఆ మొత్తాన్ని దరఖాస్తుదారులు కోల్పోనున్నారు.

వివాదాలు లేకుండా పారదర్శకంగా భూ సర్వే

ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, సెప్టెంబర్ 20: భవిష్యత్తులో నూ భూ వివాదాలకు ఆస్కారం లేకుండా భూ ముల సమగ్ర సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఇంచార్జ్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన రెంజల్, ఎడపల్లి, నవీపేట మండలాల్లో ఆకస్మికంగా పర్యటించి బతుకమ్మ చీరల పంపిణీ, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కోసం ని ర్వహిస్తున్న సదస్సులను తనిఖీ చేశారు. మొదటగా ఎడపల్లి మండల కేంద్రంలోని మహిళా మండలి భవనంలో చేపడుతున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పలువురు మహిళలకు స్వయంగా చీరలు అందజేశారు. వృద్ధులు, బాలింతలు వచ్చినట్లయితే అలాంటి వారిని క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూసే అవకాశం లేకుండా వెంటదివెంట చీరలు అందించి పంపించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, హరితహారం మొక్కలకు జియో ట్యాగింగ్ పురోగతి తీరుతెన్నులపై మండల అధికారులతో సమీక్షించారు. మండలానికి కేటాయించిన లక్ష్యంలో ఇంకనూ 193మరుగుదొడ్లు మాత్రమే నిర్మించాల్సి ఉందని అధికారులు తెలుపగా, వారం రోజుల్లోగా వాటి నిర్మాణాలను పూర్తి చేయించాలని సూచించారు. అక్టోబర్ 2వ తేదీన బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా నిజామాబాద్‌ను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నందున, వారం వ్యవధిలో నూటికి నూరు శాతం ఐహెచ్‌హెచ్‌ఎల్‌ల నిర్మాణాలు పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. ఇప్పటికే 103మరుగుదొడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నందున, ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా అధికారులను నియమించి నిరంతరం పనులను పర్యవేక్షించేలా చూడాలని మండల అధికారులను ఆదేశించా రు. హరితహారం మొక్కలకు జియో ట్యాగింగ్ ప్రక్రియను కూడా సత్వరమే పూర్తి చేయించాలన్నారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు తమకు అందించడం లేదని, గత ఆరు నెలలుగా తాము కార్యాల యం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని పలువురు లబ్ధిదారులు ఇంచార్జ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వెంటనే పంచాయతీరాజ్ ఎ.ఇతో కలిసి ఉమ్మడి సర్వే జరిపి నివేదిక సమర్పించాలని తహశీల్దార్‌ను ఇంచార్జ్ కలెక్టర్ ఆదేశించారు. ఎడపల్లి నుండి జైతాపూర్‌కు వెళ్తుండగా, మార్గమధ్యలో ప్రభుత్వపరంగా పంపిణీ చేసిన గొర్రెల యూనిట్‌ను మేతకు తీసుకెళ్తుండడాన్ని గమనించిన ఇంచార్జ్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి తన వాహనం నుండి దిగి గొర్రెలను పరిశీలించారు. జీవాలు ఆరోగ్యంగానే ఉన్నాయా? అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. గొర్రెలకు ఏర్పాటు చేసిన జియో ట్యాగింగ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జైతాపూర్‌లో రెవెన్యూ సదస్సును ఆకస్మికంగా తనిఖీ చేసి, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ ప్రొఫైల్‌ను తయారు చేయాలని, భూ వివాదాలు లేని భూములను మాత్రమే సర్వే చేయాలన్నారు. సాదాబైనామా ద్వారా జిల్లాలో 63వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో కోర్టు కేసులు, అన్నదమ్ముల మధ్య వివాదాలు ఉన్న భూముల విషయంలో తలదూర్చకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సాదాబైనామాలో ఐదెకరాలకు పైబడిన భూముల వివరాలను సేకరించాలని, రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆన్‌లైన్ పహాణిలో నమోదు కాని వాటిని కూడా గుర్తించాలన్నారు. భూములు (మిగతా 3వ పేజీలో)

అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పోచారం

ఆంధ్రభూమి బ్యూరో
కామారెడ్డి, సెప్టెంబర్ 20: రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కెటిఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉండగా, మంత్రి కెటిఆర్ ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు బయలుదేరడంతో అనివార్య కారణాల వల్ల మంత్రి కెటిఆర్ పర్యటన ఆకస్మికంగా రద్దు అయ్యింది. దీంతో శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మంత్రి పోచారం జిల్లా కేంద్రంలో ఒక కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మంచిన కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరము ఇదే భవనంలో ఉన్న మున్సిపల్ చైర్‌పర్సన్ గదిని మంత్రి ప్రారంభించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సీట్‌లో కూర్చున్న మంత్రిని తనను ఆశీర్వాదించాల్సిందిగా మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మ కోరడంతో మంత్రి మున్సిపల్ చైర్‌పర్సన్‌ను ఆశీర్వదిస్తూ కామారెడ్డి అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా కోరారు. అంతకు ముందు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీకళాశాలలోని రాశీవనాన్ని మం త్రి ప్రారంభించారు. రాశీవనంలో మొదటి మొక్కను మంత్రి నాటారు. అనంతరము 11కోట్ల 30లక్షల రూపాయలతో నిర్మిస్తున్న మిషన్ భగీరథ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. బ్ర హ్మణోత్తములు పూజ కార్యక్రమం నిర్వహించగా, సాంప్రదాయ పద్దతిలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడి నుండి మంత్రి జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్స్‌లో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరు అ య్యారు. ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్, జహీరాబాద్ ఎంపి బీబీపాటిల్, జడ్పీచైర్మెన్ ధపేదార్‌రాజు, ఐడిసిఎంఎస్ చైర్మెన్ ముజిబొద్దిన్, కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మతో పాటు జిల్లాలోని పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

బతుకమ్మ ఆడపడుచుల పండుగ

ఆంధ్రభూమి బ్యూరో
కామారెడ్డి, సెప్టెంబర్ 20: మన సంస్కృతిలో ఓ భాగం బతుకమ్మ పం డుగ అని, ఇది ఆడపడుచుల పండగ అని అందుకే తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం నిరుపేదలైన మహిళలకు బతుకమ్మ చీరలను కానుకగా పంపిణీ చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరము సభలో మాట్లాడుతూ, 18ఏళ్లు నిండిన నిరుపేదలైన ఆడ బిడ్డలకు బతుకమ్మ చీరలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పంపిణీ చేస్తున్నామని అ న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నా ల్గు లక్షల మందికి చీరలను పంపిణీ చేయడం జరిగిందని, మిగిలిన 98,071మంది మహిళలకు రేపటి వరకు చీరల పంపిణీ పూర్తి చేస్తామని అన్నారు. ఆడబిడ్డలను గౌరవించడం మన సంస్కృతిలో భాగం అని అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. బతుకమ్మ పండగను అధికారికంగా నిర్వహించడం జరుగుతోందని, ఏ లాంటి లోటు పాట్లు లేకుండా బతుకమ్మ పండగను అధికారుల పర్యవేక్షణలో అత్యంవైభవంగా నిర్వహించేందుకు సన్నాహాల జరుగుతున్నాయని అన్నారు. ఇది పేదల ప్రభుత్వం అని పేద ప్రజలకు అన్ని రకాలుగా తమ ప్రభుత్వ అండగా ఉంటుందని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. అన్ని వర్గాల నిరుపేద మహిళలకు బతుకమ్మ రోజు కొత్త చీరలు అందించాలన్న మంచి ఉద్దెశ్యంతో సిఎం కెసిఆర్ ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకుని బతుకమ్మ చీరలను పెద్ద ఎత్తున పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరము జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ రోజు పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు మంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందని, ఇందులో భాగంగా 8 ఎకరాల్లో రాశివనం (మిగతా 3వ పేజీలో)