నిజామాబాద్

ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్‌పై ఉత్తర్వులు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, సెప్టెంబర్ 21: దీర్ఘకాలికంగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో అవసరమైన ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని మోర్తాడ్ పిఆర్‌టియు అధ్యక్ష, కార్యదర్శులు మగ్గిడి శంకర్, ప్రవీణ్‌లు కోరారు. గురువారం వారు మాట్లాడుతూ, 18సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్‌కు రాష్టప్రతి ఆమోద ముద్ర వేసినా, దాని విషయంలో రాష్ట్రంలో ప్రతిష్ఠంభన ఏర్పడిందని, ప్రభుత్వం చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దానిని రద్దు చేసి ఉద్యోగులందరికి జిపిఎఫ్, పెన్షన్, గ్రాట్యువిటి తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పిఆర్‌సికి అనుగుణంగా రాష్ట్రంలో కరవు భత్యం రేటును పెంచాలని, బకాయిపడిన డిఎలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. 398స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల విషయంలో ప్రభుత్వ నిర్లిప్త ధోరణిపై ఉపాధ్యాయలోకం అసంతృప్తిగా ఉందని, అందువల్ల వెంటనే సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వారు కోరారు. విలేఖరుల సమావేశంలో సంఘ కార్యదర్శి రాములు కూడా పాల్గొన్నారు.