నిజామాబాద్

దేశంలోనే తెలంగాణ పోలీస్‌లు నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, సెప్టెంబర్ 23: భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ నెంబర్‌గా ఉందని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొనడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర పోలీసు వ్యవస్థ పటిష్టత కోసం చర్యలు చేపట్టారని అన్నారు. తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చి దిద్దేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం వల్లే, నేడు రాష్ట్ర పోలీసు శాఖ ఈ స్థాయికి చేరుకుందన్నారు. బాధితులకు సత్వర సేవలు అందించేందుకు గాను 500కోట్లు వెచ్చించి వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు ఎసిపిలు, సిఐలు, ఎస్‌ఐల నివాసం కోసం భవన సముదాయాలకు ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో పోలీసు కమిషనర్ కార్తికేయ, ఎసిపి ఆనంద్‌కుమార్, పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి
*ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి
ఇందూర్, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక పరిపుష్ఠి సాధించాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శనివారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం చేపట్టగా, కలెక్టర్ హాజరై గొర్రెలకు నట్టల నివారణ మందు వేశారు. ప్రభుత్వం అందించిన గొర్రెల యూనిట్లను పరిశీలించిన కలెక్టర్, గ్రామానికి చెందిన నీలం పెద్ద్భూమయ్యకు మందలో కొత్తగా జన్మించిన గొర్రె శిశువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గొర్రెల పెంపకందారులు, గ్రామస్థులను ఉద్దేశించి ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తూ, వారికి సబ్సిడీపై అనేక పథకాలను అందజేస్తోందన్నారు. ఇందులో భాగంగానే గొల్ల, కుర్మల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం జిల్లాలో 9,631యూనిట్లు మంజూరు చేయగా, ఇందులో 6,246 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయని, ఒక్కో యూనిట్‌లో 20గొర్రెలు, ఒక పొటెలుతో కలిపి మొత్తం 1,31,166 గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మిగతా 3346 యూనిట్లను త్వరలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అయితే ఈ గొర్రెల యూనిట్లు పొందిన లబ్ధిదారులు ఒక సంవత్సరం పాటు కష్టపడితే గొర్రెల సంతానం రెట్టింపై, ఆదాయ మార్గాలు పెంపొందుతాయని అన్నారు. పెంపకం సమయంలో జీవాలు ఎలాంటి అనారోగ్యానికి గురైన వెంటనే స్థానిక పశువైద్యాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. లబ్ధిదారులకు పంపిణీ చేసిన గొర్రెల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతలను కూడా ప్రభుత్వమే చూస్తోందని, ఇందులో భాగంగా సంవత్సరానికి మూడు పర్యాయాలు నట్టల నివారణ మందును ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతోందని, దీనిని గొర్రెలకాపరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక మొబైల్ వెటర్నరీ క్లినికల్ వాహనాన్ని అందజేయడం జరిగిందని, ఈ వాహనంలో పశువైద్యాధికారితో పాటు సిబ్బంది ఉంటారని, ఈ వాహనం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తిరుగుతూ, అనారోగ్యానికి గురయ్యే జీవాలకు వైద్య చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. గొల్ల, కుర్మలతో పాటు గంగపుత్రులకు 100శాతం సబ్సిడీతో చేప పిల్లలు, నారుూబ్రాహ్మణులకు సెలూన్ షాప్‌ల ఏర్పాటుకు రుణాలు అందించడం జరుగుతుందన్నారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలో గేదెల రుణాలను సైతం అందించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. అర్హులైన, ఆసక్తిగల లబ్ధిదారులను గుర్తించి వీటిని అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం గొల్ల, యాదవ సంఘం నాయకులు, ఇంచార్జ్ కలెక్టర్‌కు గొంగడి, గొర్రెపిల్లతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జెడిఎ డాక్టర్ ఎస్.ప్రభాకర్, ఎడి డాక్టర్ బాలిక్ అహ్మద్, వైఎస్ ఎంపిపి వరదగౌడ్, గొర్రెల పెంపకందారుల సంఘం బోధన్ నియోజకవర్గం అధ్యక్షుడు కుర్మ సాయిలు, మండల అధ్యక్షుడు గడ్డం గంగారాం, జానకంపేట్ యాదవ సంఘం అధ్యక్షుడు ఒర్సు యాదగిరి, అగ్గు భూమయ్య, ఒర్సు భూమయ్య, పిఎసిఎస్ చైర్మన్ ఒర్సు పోతన్న, లక్ష్మినర్సింహాస్వామి ఆలయ కమిటీ చైర్మన్ టి.విజయ్‌కుమార్‌గౌడ్, ఎఎంసి డైరెక్టర్ శేఖర్‌రాజ్, పశువైద్య సిబ్బంది భాస్కర్, కల్యాణి, శ్రీనివాస్, శంకర్, ఇందిరమ్మతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.

సాంకేతిక సమాచార చట్టంతో కేసులు సత్వర పరిష్కారం
*అవగాహన సదస్సులో పోలీస్ కమిషనర్
వినాయక్‌నగర్, సెప్టెంబర్ 23: జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల పోలీస్ సిబ్బందికి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సాంకేతక సమాచార చట్టం-2000 నూతన విధి విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ మాట్లాడుతూ, కేసుల సత్వర పరిష్కారానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. దీని గురించి పోలీసు అధికారులు, న్యాయశాఖ సిబ్బంది పూర్తి స్థాయిలో తెలుసుకుని ఆకళింపు చేసుకోవల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. సిసి టివి ఫుటేజీలు, కంప్యూటర్, సిడి, హార్డ్‌డిస్క్, వాటిలో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని కోర్టులకు సమర్పించే సమయంలో నూతన పద్ధతులను అవలంభించాలని వాటి గురించి వివరించారు. ఈ చట్టంలో పొందుపర్చిన సరికొత్త మార్గదర్శకాలు, విధివిధానాలను అనుసరిస్తూ ఫిర్యాదుదారులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా, నేరస్థులకు శిక్ష పడేలా చూడాలని హితవు పలికారు. అవగాహన కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన హుజూరాబాద్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు, వాటి విచారణ పద్ధతులు, నేరాలు అదుపు చేసేందుకు చట్టపరంగా చేపట్టాల్సిన చర్యలు, సుప్రీంకోర్టు, హైకోర్టులు వెలువరించిన తీర్పులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎసిపి డి.ఆనంద్‌కుమార్, ఉమ్మడి జిల్లాల సిఐలు, ఎస్‌ఐలు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.శశికిరణ్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు డి.మధుసూదన్‌రావు, రత్నాకర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శేరి రమేష్, ఆవుల అశోక్, అమృత్‌రావు, మోహన్‌రావు కులకర్ణి, పోశెట్టి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కిరణ్‌కుమార్‌రెడ్డి, జియారామ్ నాయక్, శ్రీనయ్య, హరికృష్ణ, నవీన్‌నాయక్, జి.రమణి, ఎం.రజని, ఎండి.రహీముద్దీన్, డి.వీరయ్య, ఎల్.కిషన్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ బహిష్కరణపై అధికారుల విచారణ
భీమ్‌గల్, సెప్టెంబర్ 23: భీమ్‌గల్ మండలంలోని బెజ్జోరా గ్రామంలో ఆ గ్రామానికి చెందిన ఉన్నతవర్గాలు తమను బహిష్కరించారంటూ దళితులు ఆర్డీఓకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం భీమ్‌గల్ సిఐ రమణారెడ్డి, తహశీల్దార్ బావయ్య, ఎస్‌ఐ సుఖేందర్‌రెడ్డిలు గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. ఈ సందర్భంగా దళితులను బహిష్కరణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను, సర్పంచ్‌ను పిలిపించి విచారించారు. ఈ సందర్భంగా కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా కొంత గొడవ జరిగిందని, ఆ గొడవ కారణంగానే గ్రామానికి చెందిన కొంతమంది కక్షగట్టి తమను బహిష్కరించారని దళితులు అధికారుల దృష్టికి తెచ్చారు. అదే విధంగా గ్రామంలోని రాజరాజేశ్వరస్వామి దేవాలయానికి రావద్దంటూ చాటింపు వేయించారని వారు అధికారులకు వివరించారు. నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని వెళ్లి అడిగితే అవకాశం ఇవ్వలేదని దళితులు పేర్కొన్నారు. ఈ విషయమై సిఐ రమణారెడ్డి, తహశీల్దార్ బావయ్యలు, గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలను, ఇతర నాయకులను పిలిపించి ఇది సరైన చర్య కాదని, అందరు గ్రామంలో కలిసికట్టుగా ఉండాలని హితవు పలికారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ స్పష్టం చేశారు. ఇరువర్గాలను పిలిపించి విషయాన్ని ఓ కొలిక్కి తీసుకువచ్చి పరిష్కరించారు. దీంతో ఇరువర్గాలు ఆనందం వ్యక్తం చేస్తు వెళ్లిపోయినట్లు సిఐ వెల్లడించారు. గ్రామంలో ఇకనుండి ఏమైనా చట్టవ్యతిరేక కార్యక్రమాలు చోటు చేసుకుంటే సహించేది లేదని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సిఐ రమణారెడ్డి హెచ్చరించారు.

సరస్వతి కాల్వకు నీటి విడుదల నిలిపివేత
బాల్కొండ, సెప్టెంబర్ 23: మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌కు చెందిన ప్రధాన కాల్వల్లో ఒకటైన సరస్వతి కాల్వకు శనివారం సాయంత్రం అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. రిజర్వాయర్ ఎగువ ప్రాంతమైన గోదావరి ద్వారా ప్రాజెక్టులోకి 6344 వరదనీరు వచ్చి చేరుతుండటంతో శనివారం సాయంత్రానికి రిజర్వాయర్ నీటిమట్టం 1076.00 అడుగులు 42.20 టిఎంసిలకు చేరుకుందని అధికారులు తెలిపారు. రిజర్వాయర్ ప్రధాన కాల్వలైన కాకతీయకు 400 క్యూసెక్కులు, లక్ష్మికాల్వకు 200 క్యూసెక్కులు, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల ద్వారా 822 క్యూసెక్కులు, వరదకాల్వకు 5500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. జూన్ మొదటి వారం నుండి నేటి వరకు 39.55 టిఎంసిల వరదనీరు వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. కాగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో కాకతీయ కాల్వ ద్వారా నీటి విడుదల జరుగుతుండటంతో రెండు టర్బయిన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న జెన్‌కో అధికారులు తెలిపారు. 1వ టర్బయిన్ నుండి 5.6 మెగావాట్లు, 2వ యూనిట్ ద్వారా 5.6 యూనిట్లతో కలిపి మొత్తం 11.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని జెన్‌కో డిఇ శ్రీనివాస్ తెలిపారు.

30న రావణ దహనం
*తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కంఠేశ్వర్, సెప్టెంబర్ 23: నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఈ నెల 30వ తేదీన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అందువల్ల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగు నవీనాచారి పేర్కొన్నారు. శనివారం నగరంలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో బతుకమ్మ సిడిలను విడుదల చేసి, విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రావణ దహనం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయమని, ఈ నెల 30న నిర్వహించే రావణ దహన కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత పాల్గొంటారని అన్నారు. ఇక బతుకమ్మ పండుగ ఉమ్మడి రాష్ట్రంలో అంతరించేయే స్థితికి చేరుకోవడంతో తెలంగాణ జాగృతిని స్థాపించిన ఎంపి కవితక్క, తెలంగాణతో పాటు ప్రపంచానికి బతుకమ్మ పండుగ ఆవశ్యకతను తెలియజేయడం జరిగిందన్నారు. నేడు ప్రపంచంలోని 7దేశాలతో పాటు భారత్‌లోని మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల్లోనూ బతుకమ్మ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం జరుగుతోందన్నారు. ఈ నెల 26న హైదరాబాద్‌లో మహాబతుకమ్మ నిర్వహిస్తున్నందున, నిజామాబాద్ జిల్లా నుండి 10వేల మంది మహిళలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా మండలాల్లో మహిళలు బతుకమ్మ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారని అన్నారు. అనంతరం సాంస్కృతిక మండలి గాయకులు రాంపూర్ సాయి, అష్ట గంగాధర్ తదితరులు పాడిన బతుకమ్మ పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్, రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, జిల్లా కన్వీనర్ అవంతికుమార్, నగర కన్వీనర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

వివాదాస్పదమైన కాల్వ పూడిక తొలగింపు
మోర్తాడ్, సెప్టెంబర్ 23: మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామానికి వరదకాల్వ తూము ద్వారా నీటిని మళ్లించే కాల్వ పూడిక తొలగింపు వివాదాస్పదమైంది. పహణిలో ఉన్న రీతిగానే కాల్వను పునరుద్ధరిస్తున్నామని పాలెం రైతులు అంటుండగా, తమ పంట భూములు నష్టపోతున్నాయని మోర్తాడ్ రైతులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని తహశీల్దార్ సూర్యప్రకాష్ అధికారులతో కలిసి పరిశీలించారు. వరదకాల్వకు ఏర్పాటు చేసిన తూముల ద్వారా దొన్కల్, పాలెం, ఉప్లూర్ గ్రామాల వద్ద తూములను ఏర్పాటు చేశారు. పాలెం గ్రామానికి ఉన్న తూము ద్వారా నీటి విడుదల జరిగే అవకాశం ఉన్నా, ప్రారంభంలో కాల్వ లేకపోవడంతో నీటి విడుదలకు ఆస్కారం లేకుండాపోయింది. దీంతో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పాలెం రైతులు స్వచ్ఛందంగా శనివారం పొక్లెయినర్ సహాయంతో పూడిక తొలగింపు కార్యక్రమం చేపట్టారు. రైతులు దగ్గరుండి పూడిక తొలగింపు పనులు చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న మోర్తాడ్‌కు చెందిన ఇద్దరు రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. విఆర్‌ఓలతో కలిసి తహశీల్దార్ సూర్యప్రకాష్ శనివారం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గడిచిన రెండు సంవత్సరాలుగా ఈ విషయం వివాదాస్పదంగానే ఉందని, అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన రావడం లేదని పాలెం రైతులు ఆరోపించారు. గత సంవత్సరం భారీ వర్షాలు కురవడంతో పాటు హన్మంత్‌రెడ్డి, పాలెం ఎత్తిపోతల పథకాల ద్వారా పూర్తిస్థాయిలో నీరందడంతో ఈ కాల్వ విషయమై దృష్టి సారించలేదని పాలెం రైతులు అన్నారు. ఈసారి ఎత్తిపోతల పథకాల ద్వారా నీరందకపోవడం, చెరువులు ఎండిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అందువల్ల తాత్కాలికంగా ప్రస్తుతం పహాణి ప్రకారంగా ఉన్న కాల్వ ద్వారనే నీటిని మళ్లించుకుంటున్నామని అధికారులకు సమాధానం ఇచ్చారు. వరదకాల్వ తూము ద్వారా నీటిని విడుదల చేయడంతో ఆ జలాలు పూడిక తీసిన కాల్వ ద్వారా పరుగులు తీస్తున్నాయి. అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షించి, సమస్యను పరిష్కరించాలని, ఎవరికి ఇబ్బంది కలుగకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. తమ పంటలు మునిగిపోతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న అధికారులు కాల్వ తవ్వకాలు ఆపమని కోరినా, పాలెం రైతులు ఏకపక్షంగా వ్యవహరించారని మోర్తాడ్‌కు చెందిన బాధిత రైతులు వాపోతున్నారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.

కష్టపడి చదివితే బంగారు భవిష్యత్
* జిల్లా ఎస్పీ శే్వత
దోమకొండ, సెప్టెంబర్ 23: ప్రతి విద్యార్థి కష్టపడి చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా ఎస్పీ శే్వత అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పెరుక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2016-17 విద్యా సంవత్సరం వార్షిక పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ సత్తయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దీకొండ శారద, జెడ్పీటిసి మదుసూధన్‌రావు, ఎఎంసి వైస్ చైర్మన్ శేఖర్, సొసైటి చైర్మన్ రావులపల్లి నర్సారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి మదన్‌మోహన్, మాజీ జెడ్పీటిసి తిర్మల్‌గౌడ్ పాల్గొన్నారు.

రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం

నందిపేట, సెప్టెంబర్ 23: నందిపేట మండలం కుద్వాన్‌పూర్ రేణుకాఎల్లమ్మ ఆలయం నూతన కమిటీతో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు శనివారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ కమిటీ చైర్మన్‌గా పెర్క నాగన్న, డైరెక్టర్లుగా గోపి, నారాయణ, మేతరి గంగాధర్, ఎం.గంగుబాయి, బి.బాబయ్య, బి.రాజన్న, ఆలయ పూజారి మహేష్ కులకర్ణిని ఎక్స్‌అఫిషీయో మెంబర్‌గా ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన కమిటీచే శనివారం మధ్యాహ్నం ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఇఓ మహేందర్‌గౌడ్‌లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, అధికారులు కమిటీ చైర్మన్‌తో పాటు డైరెక్టర్లను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్మన్న, ఎంపిడిఓ సురేష్‌గౌడ్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

27లోగా లక్ష్యాన్ని పూర్తి చేయండి
* డ్వామా పిడి వెంకటేశ్వర్లు
మోర్తాడ్, సెప్టెంబర్ 23: గ్రామాల్లో చేపడుతున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పథకాన్ని ఈ నెల 27లోగా పూర్తి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. శనివారం మోర్తాడ్ ఇజిఎస్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, అధికారులతో సమీక్ష నిర్వహించారు. మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో కేటాయించిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు ఎన్ని, అందులో ఎన్ని పూర్తి చేశారంటూ అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. అవసరమైతే సిబ్బంది గ్రామాల్లో పర్యటించి, ముందుకు రాని లబ్ధిదారులను చైతన్యపర్చి లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. అన్ని గ్రామాలను కలుపుకుని 3750మరుగుదొడ్లు మంజూరయ్యాయని, ఇంకా 67మాత్రమే పూర్తికావాల్సి ఉందని ఎపిఓ నర్సయ్య తెలుపగా, వాటిని కూడా పూర్తి చేయించి మండలాన్ని బహిరంగ మల విసర్జన రహిత మండలంగా తీర్చి దిద్దాలని పిలుపునిచ్చారు. అదే విధంగా హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమంపై కూడా సమీక్ష నిర్వహించారు. నాటే మొక్కలను సంరక్షించే బాధ్యతలు స్వీకరించిన సిబ్బందిపై దృష్టి కేంద్రీకరించాలని, పనులు చేయని సిబ్బందిని గుర్తించి, వేతనాల్లో కోత విధించాలని ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కకు జీయో ట్యాగింగ్ చేయాలన్నారు. అదే విధంగా ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు సంబంధించిన ఆధార్ నెంబర్లు సేకరించాలని, వాటిని జాబ్ కార్డులలో పేర్కొంటూ ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎపిఓ నర్సయ్య, ఇసి వెంకటేశ్, టిఎలు సాగర్, మంజురాణి, కంప్యూటర్ ఆపరేటర్లు రవీందర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంచార పశు వైద్యశాలలను సద్వినియోగం చేసుకోండి
* అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా
కంఠేశ్వర్, సెప్టెంబర్ 23: పశుపోషకుల జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశువైద్యాశాలలను సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పేర్కొన్నారు. శనివారం నగరంలోని టిఆర్‌ఎస్ అర్బన్ కార్యాలయంలో మొబైల్ వెటర్నరీ క్లినికల్ వ్యాన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం 108, 104లను ప్రవేశపెట్టి ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తుందో, అదే విధంగా సంచార మొబైల్ వెటర్నరీ క్లినిక్ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఈ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అనారోగ్యాలకు గురైన జీవాలకు గ్రామాల్లోకి వచ్చే వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, ముఖ్యంగా సమగ్ర భూసర్వేతో వచ్చే పంట నుండి ఎకరానికి 4వేల రూపాయల చొప్పున పెట్టుబడులు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, కార్పొరేటర్లు పంచరెడ్డి సురేష్, నితిన్‌పాండే, కిశోర్, ఖుద్దూస్, తదితరులు పాల్గొన్నారు.