నిజామాబాద్

అరవై సంవత్సరాల్లో జరగని అభివృద్ధి మూడేళ్లలో జరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీపేట, అక్టోబర్ 12: తెలంగాణ ప్రాంత అభివృద్ధిని సీమాంధ్ర పాలకులు అడుగడుగునా అడ్డుకున్నారని, సమైక్య రాష్ట్రంలో 60ఏళ్లలో జరగని అభివృద్ధిని, తెలంగాణ ఏర్పడిన మూడేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేసి చూపించారని ఎంపి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. గురువారం నవీపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బోధన్ శాసన సభ్యుడు షకీల్ ఆమేర్‌లతో కలిసి ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపి కవిత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సమైక్య పాలనలో అప్పటి పాలకులు తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్నారని, తద్వారా తెలంగాణ ప్రాంతం దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 60ఏళ్లు గడిచినా, అభివృద్ధిలో మాత్రం ఆమడదూరంలోనే ఉండిపోయిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల నిధులు, అవకాశాలు ఉన్నప్పటికీ, అమలు చేయడంలో మాత్రం సమైక్య పాలకులు వివక్ష చూపించారని దుయ్యబట్టారు. ముఖ్యంగా సాగునీటి రంగంతో పాటు ఈ ప్రాంతం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో అవసరమైన సౌకర్యాలు కల్పనలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని విమర్శించారు. ఫలితంగా తెలంగాణ ప్రాంతం తలబున సముద్రం ఉన్నా, తాగేందుకు గుక్కెడు నీళ్లు కరవన్న చందంగా తయారైందని, సాగునీటి వసతి లేక భూములన్నీ బీడువారిపోయాయని అన్నారు. ఇక విద్యారంగంలోనూ సమైక్య పాలకులు అవలంభించిన పక్షపాత ధోరణి అంతాఇంతా కాదన్నారు. అందుకే తెలంగాణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు సిఎం కెసిఆర్ సంకల్పించి, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థులకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అంతర్ పాఠశాలలు, మండలం, జోనల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించి, ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకవస్తోందని ఎంపి కవిత పేర్కొన్నారు. అంతకు ముందు బోధన్ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా సిఎం కెసిఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి, ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి 1.25లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ, భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ఇప్పటి నుండే పటీష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంచార్జ్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, స్థానిక సర్పంచ్ మోస్రా కపిల భూంరెడ్డి, జడ్పీటిసి శ్రీనివాస్‌గౌడ్, ఎంపిపి రాజేంద్రకుమార్‌గౌడ్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సింగ్‌రావు, అల్లం రమేష్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.