నిజామాబాద్

ఆదర్శంగా ఆర్మూర్ నియోజకవర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, అక్టోబర్ 17: ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆర్మూర్ మండలం చేపూర్, గోవింద్‌పేట్, పెర్కిట్, గగ్గుపల్లి, పిప్రి, ఆలూర్ తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. చేపూర్ గ్రామంలోని మత్స్యకార సంఘంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న పార్టీలు అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నత పదవులు పొందిన నాయకులు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మూడు సంవత్సరాల కాలంలో కనీవిని ఎరగని విధంగా అభివృద్ధి పనులు చేస్తోందని అన్నారు. నియోజకవర్గంలో మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి కల్పించడానికి గాను 50 లక్షల చేప పిల్లలను చెరువులలో వదులుతున్నట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గంలో 21 బెస్త సంఘాలకు నిధులు మంజూరు చేశానని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 2700 మందికి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ కింద 75 వేల చొప్పున చెక్కులను అందజేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా రైతులను ఆదుకోవడానికి గాను వ్యవసాయానికి 24 గంటల పాటు కరెంట్‌ను సరఫరా చేస్తున్నామని అన్నారు. చేపూర్, ఫత్తేపూర్ గ్రామాలకు కలిపి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో షాది ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. చేపూర్‌లోని చెరువులో చేప పిల్లను వదిలారు. చేపూర్‌లో 10 లక్షలతో మత్స్యకార సంఘ భవనానికి శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యుడు సాందన్న, ఎంపిపి పోతు నర్సయ్య, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు ప్రభాకర్, సత్యనారాయణ, విజయలక్ష్మీ, రాస జగదీష్, కళాశ్రీ, మున్సిపల్ వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగారెడ్డి, కౌన్సిలర్లు పండిత్ ప్రేమ్, పూల నర్సయ్య, రాజబాబు, మత్స్య శాఖ డైరెక్టర్లు బట్టు నరేందర్, సాయిరాం, మత్స్య శాఖ జిల్లా అధ్యక్షుడు సాయిబాబా, ఎఫ్‌డిఓ పూర్ణిమ, ఆర్‌ఐ గోపాల్, గ్రామ కార్యదర్శులు గంగామోహన్, విఆర్‌ఓలు, టిఆర్‌ఎస్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్, అర్గుల్ సురేష్, నయ్యూం పాల్గొన్నారు.