నిజామాబాద్

ఓపెన్ హౌస్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, అక్టోబర్ 17: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని రేంజ్ డిఐజి ఎన్.శివశంకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేంజ్ డిఐజి, విద్యార్థులకు, క్రీడాకారులకు ఆయుధాల వాడకం, వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం రేంజ్ డిఐజి శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను అక్టోబర్ 15నుండి 21వరకు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు పోలీసు కమిషనరేట్ పరిధిలోని అన్ని డివిజన్లలో పరిధిలో విద్యార్థులు, సిబ్బందికి వ్యాస రచన పోటీలు, ర్యాలీలు, రక్తదాన శిబిరాలు, అమరవీరుల కుటుంబాలను పిలిపించి వారి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఇంచార్జ్ కమిషనర్ ఎన్.శే్వత, నిజామాబాద్ ఎసిపి ఆనంద్‌కుమార్, ఎన్‌ఐబి ఎసిపి జి.రవీందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ సిహెచ్.వెంకన్న, టౌన్ సిఐ సుభాష్‌చంద్రబోస్, రూరల్ సి వెంకటేశ్వర్లుతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని రేంజ్ డిఐజి ప్రారంభించగా, 91మంది పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు.
ఎడపల్లి గురుకుల పాఠశాలలో ఓపెన్ హౌస్
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో మంగళవారం ఎడపల్లి పోలీసులు, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సిహెచ్.టాటాబాబు మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో అసువులుబాసిన పోలీసు అమరవీరుల త్యాగాలను కొనియాడారు. అనంతరం వివిధ రకాల ఆయుధాలను వాడకం, వాటి వినియోగంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, లయన్స్ క్లబ్ సభ్యులు సూర్యనారాయణ, గంగారెడ్డి, మెర్సీ, పోలీసు సిబ్బంది హన్మాండ్లుతో పాటు పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు.

ఎస్‌బిఐ ఎదుట విద్యార్థుల ధర్నా
మద్నూర్, అక్టోబర్ 17: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కోసం బ్యాంకు అధికారులు అకౌంట్‌లు ఇవ్వడంలేదంటూ ఆరోపిస్తూ మంగళవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ఎస్‌బిఐ శాఖ బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్తులు మాట్లాడుతూ, బ్యాంకు అకౌంట్‌లు ఇవ్వడంలో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంచేస్తున్నారంటూ బ్యాంకు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము ప్రతి రోజు బ్యాంకు అకౌంట్‌ల కోసం బ్యాంకుల చుట్టు తిరుగుతున్న పట్టించుకునే దిక్కులేకుండా పోయిందని, ఇక చేసేది లేక ఈ ధర్నా చేపట్టాల్సిన అవసరం వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న విద్యార్థుల వద్దకు బ్యాంకుమేనెజర్ శ్రీ్ధర్ వచ్చి విద్యార్థులతో చర్చించారు. సాంకేతిక లోపాల కారణంగా బ్యాంకు అకౌంట్‌లు తెరవడంలో జాప్యం అవుతోందని మేనెజర్ విద్యార్థులకు వివరించారు. ఈ లోపాలు సవరించిన వెంటనే అందరికి అకౌంట్‌లు ఇస్తామని చెప్పడంతో విద్యార్థులు శాంతించి ఆందోళన విరమించారు.