నిజామాబాద్

అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీపేట, అక్టోబర్ 17: నవీపేట మండలం నాడాపూర్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వసం చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహాన్ని సోమవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయగా, మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఉదయం సమయంలో అంబేద్కర్ విగ్రహం యొక్క ముక్కు, కణత, మణికట్టు భాగాలు ధ్వంసమై ఉండటం గమనించిన దళిత సంఘాల నాయకులు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న నవీపేట ఎస్‌ఐ నరేష్, సంఘటన స్థలానికి చేరుకుని, ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం విషయమై ఎస్‌ఐ నరేష్‌ను వివరణ కోరగా, దళిత సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలో దళితులతో పాటు అంబేద్కర్ విగ్రహాలపై దాడులు పెరిగిపోతున్నాయని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, నాడాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడ్తామని వారు స్పష్టం చేశారు.

శ్రీరాంసాగర్‌లోకి కొనసాగుతున్న వరద ఉద్ధృతి
బాల్కొండ, అక్టోబర్ 17: మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి వరదనీటి రాక కొనసాగుతోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర ప్రాజెక్టు మిగులు జలాలు గోదావరి ద్వారా 16100 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో మంగళవారం సాయంత్రానికి రిజర్వాయర్ నీటిమట్టం 1080.20అడుగులు 52.96టిఎంసిలకు చేరుకుందని ప్రాజెక్టు ఎఇ మహేందర్ తెలిపారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00అడుగులు 90టిఎంసిలు కాగా, గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం పూర్తిస్థాయిలో నిండి ఉందన్నారు. ప్రాజెక్టుకు చెందిన ప్రధాన కాల్వలైన కాకతీయ కాల్వకు 50క్యూసెక్కులు, లక్ష్మి కాల్వకు 100, గుత్ప, అలీసాగర్ పథకాలకు 130, వరదకాల్వ ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు. జూన్ మొదటి నుండి నేటి వరకు రిజర్వాయర్‌లోకి 64.42టిఎంసిల వరదనీరు వచ్చి చేరిందని ఎఇ తెలిపారు.