నిజామాబాద్

అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగంపేట్, అక్టోబర్ 22: అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికందే సమయంలో అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. ఆదివారం కురిసిన అకాల వర్షం కారణంగా వరి పైరు నేల కొరిగింది. మరికొంత మంది రైతులు వరి కోత కోసిన తరువాత మెదలు అరబెట్టగా భారీ వర్షానికి మొత్తం వర్షం నీటిలో మునిగిపోయాయి. ఇంకొంత మంది రైతులు నూర్పిడి చేసి ఆరబోసిన వరి పంట పూర్తిగా నీట మునిగి తడిసిపోయింది. గత కొన్ని రోజుల నుండి రైతులను వర్షం వెంటాడుతోంది. కొన్నిసార్లు వరదలో పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతు గురించి అడిగే వారు లేకుండా పోయారు. తడిసి ధాన్యం రంగు మారడంతో వాటిని ఎవరు కొనుగోలు చేస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే ఎండ ఆకాశంలో ఆదివారం ఒక్కసారిగా కమ్ముకున్న మేఘాలు ఉరుములతో కూడిన భారీ వర్షం రైతుల పాలిట శాపంగా మారింది. దీంతో రైతులు పండించుకున్న మక్కలు, వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది. రైతుల కంట అప్పుడే నీరు మొదలైంది, చేసిన అప్పులు కంట ముందు కన్పిస్తుంటే పండించుకున్న పంట అంతా కూడా అకాల వర్షానికి తడిసిపోవడంతో రైతన్నలు దిగాలుగా కన్పిస్తున్నారు. పండించిన పంట వర్షం కారణంగా తడిసి ముద్ద కావడం గత కొన్ని రోజుల నుండి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్న రైతులు వారి పంటలు రంగు మారడంతో ఎవ్వరు తమ పంటకొంటారని దిగాలుతో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి రైతుల రంగు మారిన పంటలను వెంటనే కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు లింగంపేట్ మండలంలోని అన్ని గ్రామాల్లో రైతుల పరిస్థితి దైన్యంగా ఉంది. అప్పు చేసి పంటలు వేసుకుని పంటలు పండించుకున్నాక తమకు వచ్చిన కష్టానికి రైతులు వెక్కి వెక్కి రోదించే దుస్థితి నెలకుంది. ఇప్పటికే లక్షల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కుక్కల దాడిలో సబ్సిడీ గొర్రెలు మృతి
బాల్కొండ, అక్టోబర్ 22: మెండోరా మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున ప్రభుత్వం పంపిణీ చేసిన సబ్సిడీ గొర్రెలపై కుక్కల మంద దాడి చేయడంతో, మూడు గొర్రెలు, ఒక పొట్టేలు, నెల వయస్సు గల 14గొర్రె పిల్లలు మృతి చెందాయని బాధితులు వెంకయ్య, లక్ష్మి, మల్లేష్ తెలిపారు. ఇంటి పక్కన ఉన్న కొట్టంలో గొర్రెలను ఉంచగా, కుక్కలు దాడి చేసి బలిగొన్నాయని, మిగతా వాటికి కూడా తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని పశువైద్యాధికారి డాక్టర్ గోపాల్‌రాజ్ సందర్శించి, చనిపోయిన మూగజీవాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని, చనిపోయిన గొర్రెల విలువ సుమారు 60వేల వరకు ఉంటుందని ఆయన తెలిపారు.