నిజామాబాద్

హామీల అమల్లో టిఆర్‌ఎస్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, అక్టోబర్ 22: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టిఆర్‌ఎస్ సర్కార్ పూర్తిగా విఫలం చెందిందని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. ఆర్మూర్‌లోని రోడ్లు, భవనాల శాఖ అతిథిగృహంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టడానికి చూపుతున్న శ్రద్ధ అభివృద్ధి చేయడంలో చూపించడం లేదన్నారు. టిఆర్‌టి నోటిఫికేషన్ నామమాత్రంగా వేసినట్లుగా కనబడుతోందని ఆరోపించారు. జిల్లాల వారీగా అధిక సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికి తక్కువ సంఖ్యలో నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. స్థానికత విషయంలో స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఏ జోన్‌కు ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో న్యాయపరంగా ఎలాంటి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బదిలీలు, ప్రమోషన్ల విషయంలో కూడా స్పష్టత ఇవ్వాలని అన్నారు. తెలంగాణ నిరుద్యోగ యువతను మోసం చేయడం, దగా చేయడమే అవుతుందని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు చేసినప్పుడు ఆర్డర్ టు వర్క్ పేరిటనే ఉద్యోగులు పని చేయాల్సి వస్తోందని అన్నారు. కొత్త జిల్లాలకు వెళ్లి పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్, నాయకులు ద్యాగ ఉదయ్, నూతుల శ్రీనివాస్‌రెడ్డి, నచ్చు రాజన్న, ఆకుల రాజు, డమాంకర్ శ్రీనివాస్, కోలు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మద్దతు ధర కల్పించడమే లక్ష్యం
*జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

నిజాంసాగర్, అక్టోబర్ 22: రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించడమే సిఎం కెసిఆర్ ప్రభుత్వం ఏకైక లక్ష్యం పెట్టుకుందని, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఆదివారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలోఅచ్చంపేట్ సింగల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే, వరి ధాన్యం తూకం చేసి కొనుగోలు ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే విలేఖరులతోమాట్లాడారు. జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్‌గల్, బిచ్‌కుందా, మద్నూర్,జుక్కల్ మండలాలలోని 32 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరైయ్యాయన్నారు. ఖరీఫ్‌లో రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించి ఆదుకోవడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోరైతులకు అన్నివిధాలుగా ఆదుకుంటుందన్నారు. రైతులు పండిస్తున్న ప్రతి పంటకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్టర్రైతు సమన్వయ కమిటిలను ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సమన్వయ, రైతుకమిటిలే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. ఈకమిటీలను సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసి రైతు పండించిన ధాన్యానికి మధ్దతు ధర కల్పించేందుకే రైతు సమన్వయ కమిటిల ముఖ్య ఉద్దేశం అన్నారు. పంటల సాగు విషయంలోగుంట బీడు భూమి లేకుండా, సాగునీటిని అందించేందుకు, ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తుందన్నారు. గతంలో ఏప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. ఈసమావేశంలోడిసిసిబి డైరెక్టర్, అచ్చంపేట్ సింగల్ విండోచైర్మైన్ మోహన్‌రెడ్డి, సిడిసి చైర్మైన్ పట్లో ళ్ల దుర్గారెడ్డి, వైస్‌ఎంపిపి గోగుల పండరి, సర్పంచ్‌లు బేగరి రాజు, సాదుల సత్యనారాయణ, మాజీ జడ్పీటిసి వినయ్‌కుమార్, నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు గంగారెడ్డి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు గైని విఠల్ , నాయకులు రమేష్‌గౌడ్, నర్సింలు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.