నిజామాబాద్

రైతులేనిదే రాజ్యం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, అక్టోబర్ 22: రైతులేనిదే రాజ్యం లేదని, తమ ప్రభుత్వంలో రైతులే రాజులని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లాలోని బాన్స్‌వాడ డివిజన్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ లిమిటెడ్ 3.12కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టిన విత్తన గోడౌన్, కార్యాలయం, దుకాణ సముదాయాల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి వానాకాలం పంటల దిగుబడి, యాసంగి పంటల పై చర్చ కార్యక్రమం నిర్వహించి మంత్రి ప్రసంగిస్తూ, అసంఘటిత రైతు శక్తిని సంఘటితం చేసేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఏడాది రుణం తీసుకునేది రైతులేనని వేసిన పంటలు పండక ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేకే రైతులు అప్పుల పాలు అవుతున్నారని, దీన్ని గమనించిన తమ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మునుపెన్నడు లేని విధంగా రైతులకు విద్యుత్ కోత లేకుండా చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. శాశ్వసత పరిష్కారం కోసం 93వేల 500కోట్లతో విద్యుత్ ఉత్పాదన చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు కోరితే వచ్చే యాసంగి నుండి 24గంటల సరఫరా చేస్తామన్నారు. సిఎం కెసిఆర్ తీసుకున్న అత్యంత సహాసమైన నిర్ణయం ప్రతి ఎకారకు రైతుకు పెట్టుబడి 4వేల రూపాయలేనని అన్నారు. రైతులకు సలహాలు సూచనలు అందించేందుకు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తీర్ణ్ధికారిని రాష్ట్ర వ్యాప్తంగా 2,630 మందిని నియమించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఎఇఓ హెడ్‌క్వార్టర్‌లో 15లక్షల రూపాయలతో రైతు సమావేశం గదులను నిర్మాణం చేస్తున్నట్లు వెల్లడించారు. రైతుల సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం గోదావరి, కృష్ణనదులపై ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోందని అన్నారు. వచ్చే ఏడాది నుండి నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించడం జరుగుతోందన్నారు. వచ్చే ఏడాది వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సేధ్యంలో ఖర్చులు తగ్గించుకుని సేంద్రీయ ఎరువులనే వాడాలని సూచించారు. మంచి దిగుబడులను ఇచ్చే వంగడాలను రైతులకు అందచేస్తామని అన్నారు. భవిష్యత్తులో కూలీల కొరత తీవ్రంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో యాంత్రీకరణకు ప్రధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి నుంచే యాసంగి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. మార్చి నెల తరువాత వడగాళ్ల వర్షాలు కురుస్తాయని, ఆలోపలే పంటలు చేతికి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు కింద ఈ ఏడాది రైతులకు ఏలాంటి డోకాలేదని, యాసంగి పంట కోసం వరి నారుమళ్లు సిద్ధం చేసుకోవాల్సిందిగా ఆయకట్టు రైతులను మంత్రి కోరారు. డిసెంబర్ 15నుండి నాట్లు ప్రారంభిస్తే మార్చి 31వరకు వరి పంట కోతకు వస్తుందన్నారు. శనగ, మొక్కజొన్న అక్టోబర్ 1నుండి నవంబర్ 15లోపు విత్తుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో మంత్రితో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.