నిజామాబాద్

హామీల అమలుపై ప్రజాప్రతినిధుల్లో పెరిగిన శ్రద్ధాసక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 18: గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయమై ఇటీవలి కాలంలో ప్రజాప్రతినిధులు ఎనలేని శ్రద్ధాసక్తులు కనబరుస్తున్నారు. ఎన్నికల వేడి అంతకంతకూ రాజుకుంటుండడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. 2019లో జరగాల్సిన ఎన్నికలు ముందస్తుగానే నిర్వహించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సైతం తెరపైకి వస్తుండడంతో, ప్రస్తుత చివరి సమయంలో సాధ్యమైనంత మేరకు తమ వాగ్దానాలను నిలుపుకుని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ముందుకు వెళ్లాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. ఈ దిశగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఒకింత ముందంజలో నిలుస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్ధాంతరంగా నిలిచిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేయించేందుకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయించారు. దశాబ్దాల తరబడి అరకొర నిధుల కేటాయింపులతో నత్తనడకన కొనసాగుతూ వచ్చిన పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్ పనులకు కేంద్రం పెద్దఎత్తున 143కోట్ల రూపాయల నిధులు కేటాయించడం కూడా ఎంపి కవిత హయాంలోనే జరగడం ఆమెకు కలిసొచ్చే అంశంగా మారింది. ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామనే హామీని నిలుపుకునేందుకు నిజామాబాద్ నగరానికి ఇటీవలే ఐ.టి హబ్‌ను మంజూరు చేయించడం నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. నిజామాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేకంగా విన్నవించి 100కోట్ల రూపాయలను మంజూరు చేయించడంతో పలు అభివృద్ధి పనులు జరిపిస్తున్నారు. అన్నింటికి మించి ఎన్నికల్లో ప్రధాన హామీగా నిలిచిన పసుపు బోర్డు సాధన కోసం గత రెండేళ్ల నుండి ఎంపీ కవిత వాస్తవంగానే అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోనే అత్యధిక విస్తీర్ణంలో పసుపు పంట సాగుతున్న దరిమిలా, ఎలాగైనా పసుపు బోర్డును సాధించాలనే పట్టుదలతో ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతును కూడగట్టి కేంద్రానికి లేఖలు రాయించారు. పార్లమెంటులో అనేక పర్యాయాలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, స్థానికంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. కేంద్ర మంత్రులతో పాటు స్వయంగా ప్రధాని మోడీని కలిసి విజ్ఞాపనలు సమర్పించారు. ఓ వైపు పసుపు బోర్డు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే, పసుపు(స్పైసెస్) పార్కును మంజూరు చేయించుకోగలిగారు. అయితే పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో మాత్రం ఇప్పటికీ కేంద్రం నుండి స్పష్టమైన హామీ వెలువడలేకపోయింది. ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న పతంజలి సంస్థ ద్వారా స్థానికంగా పసుపు, ఇతర వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయించే దిశగా ఎంపీ కవిత ప్రయత్నాలు సాగించారు. యోగా గురువు రాందేవ్‌బాబాను కలిసి ఇక్కడి సానుకూలతలు వివరించడంతో, గత ఏడాది క్రితమే పతంజలి సీఈఓ బాలకృష్ణ నిజామాబాద్‌కు పర్యటనకు హాజరై పసుపు పంట సాగు, నాణ్యతను పరిశీలించి వెళ్లారు. ఈ క్రమంలోనే నిజామాబాద్‌లోని లక్కంపల్లిలో ఉన్న సెజ్ స్థలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు పతంజలి సంస్థ ముందుకు వచ్చింది. గత నాలుగు రోజుల క్రితమే ఎంపీ కవిత అధికారుల బృందంతో హరిద్వార్‌లోని పతంజలి కేంద్ర కార్యాలయంలో రాందేవ్‌బాబా, బాలకృష్ణలను కలుసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పంద పత్రాల మార్పిడి ప్రక్రియలో పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల ఇటు రైతులు నేరుగా గిట్టుబాటు ధరకు తమ పంటను విక్రయించుకునే వెసులుబాటు పొందడంతో పాటు, స్థానిక యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఇలా ఒక్కో హామీని నెరవేర్చే దిశగా ఎంపీ కవిత కృషి చేస్తుండడంతో వచ్చే ఎన్నికల్లోనూ ఆమె నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండే బరిలోకి దిగడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గత కొంతకాలం క్రితం వరకు కూడా ఎంపీ కవిత వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారనే ప్రచారం విస్తృత స్థాయిలో కొనసాగింది. ఈ విషయమై పలు సందర్భాల్లో ఎంపీ కవిత కూడా అసెంబ్లీకి పోటీ చేసే అంశాన్ని తోసిపుచ్చకుండా, అధిష్ఠానం ఆదేశాల మేరకు నడుచుకుంటానంటూ నర్మగర్భంగా సమాధానామిచ్చారు. అయితే మారిన రాజకీయ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లోనూ నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఆమె అనుయాయులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సాధ్యమైనంత వరకు నెరవేర్చే దిశగా ఎంపీ కవిత తనవంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

అశ్రునయనాల మధ్య ఇంజనీరింగ్ విద్యార్థి అంత్యక్రియలు
వేల్పూర్, నవంబర్ 18: వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన బిటెక్ ఫైనలియర్ చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి తలారి అమన్‌రాజ్(22) అంత్యక్రియలు శనివారం అశ్రునయనాల మధ్య జరిగాయి. హైదరాబాద్‌లోని సుచిత్ర సర్కిల్ వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించగా అందులో అమన్‌రాజ్ కూడా ఉన్నాడు. మృతుడు అమన్‌రాజ్ తండ్రి తలారి అనంతరావు ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. తండ్రి శనివారం ఉదయం గల్ఫ్ దేశం నుంచి రాగా కుమారిని మృతదేహాన్ని చూసి గుండేలవిసేలా రోధించాడు. చేతికి వచ్చిన కుమారుడు ప్రయోజకుడు అవుతాడనుకుంటే మరణించాడంటూ రోధించిన అందరిని కంటతడి పెట్టించింది.