నిజామాబాద్

చట్టాలపై అవగాహన ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, నవంబర్ 18: మహిళలు న్యాయపరమైన హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిసింగ్ బబ్లూ అన్నారు. శనివారం ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ మహిళా కమీషన్ ఆదేశాల మేరకు మహిళలు, న్యాయపరమైన హక్కులు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ విద్యార్థినిలు ఉన్నత స్థానాలను చేరడానికి ప్రణాళిక బద్ధంగా కష్టపడి చదవాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సఫ్దర్ అస్కరి మాట్లాడుతూ విద్యార్థినిలు ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకొని ముందుకు సాగాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమం విద్యార్థిని, విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. అనంతరం నిర్వహించిన పరీక్షలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, నగదును ప్రధానం చేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన భరత్‌గౌడ్‌కు 2 వేల రూపాయల నగదు, ద్వితీయ స్థానంలో నిలిచిన అంజలి సోనికి 1500 రూపాయల నగదు, తృతీయ స్థానంలో ఐదుగురు విద్యార్థులు నిలవగా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున నగదుతో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్.రాజ, డబ్ల్యుఇసి కో ఆర్డినేటర్ పి.లత, ఐక్యూఎసి కో ఆర్డినేటర్ కె.అభిజిత్, ఐసిసి కో ఆర్డినేటర్ డాక్టర్ ఎన్.జ్యోతి, అధ్యాపకులు పాల్గొన్నారు.