నిజామాబాద్

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, నవంబర్ 18: నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి త్వరితగతిన దర్యాప్తు ముగించాలని కమిషనర్ కార్తీయే కిందిస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసు కార్యాలయంలో నేరాల నియంత్రణ కోసం నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలోని ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలతో సీపీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ కార్తికేయ మాట్లాడుతూ, నేరాలు జరుగకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, చోరీల నివారణకు పెట్రోలింగ్ ముమ్మురం చేయాలని ఆశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆటోరిక్షాలు, జీపుల్లో సామర్థ్యానికి మించి ఫ్యాసింజర్లు ఎక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కోర్టుల్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తోడ్పాటు అందించాలన్నారు. అండర్ ఇనే్వస్టిగేషన్, ఎన్‌బిడబ్ల్యుఎస్ ఎగ్జిక్యూటీవ్ త్వరగా పూర్తి చేయాలన్నారు. అదే విధంగా పేకాట, మట్కా జూదాలపై ఉక్కుపాదం మోపాలని, పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళలు, యువతులపై అల్లరి మూకల ఆగడాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్స్, బ్లూకోల్ట్స్ బృందాలు పటీష్టమైన నిఘా పెట్టాలని సీపీ ఆదేశించారు. మోటార్ వాహనాల యాక్ట్ ప్రకారంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలకై పలు సూచనలు చేశారు. పోలీసు శాఖ ప్రజలతో మమేకమయ్యేందుకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సీపీ కార్తికేయ సూచించారు. సీసీటీఎన్‌ఎస్(క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్కింగ్ సిస్టమ్)యందు పోలీస్ స్టేషన్‌లోని ఎఫ్‌ఐఆర్, కేసుల పరిశోధన వివరాలను ఎప్పటికప్పుడు పొందుపర్చాలన్నారు. అలవాటుపడిన నేరస్తులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసేందుకు వెనుకడుగు వేయవద్దని సీపీ సూచించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ(అడ్మిన్) ఆకుల రాంరెడ్డి, అదనపు డీసీపీ (లా అండ్ ఆర్డిర్) ఏం.శ్రీ్ధర్‌రెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ఎం.సుదర్శన్, శివకుమార్, ఏ.రఘు, సీసీఎస్ ఏసీపీ వి.రఘుతో పాటు అన్ని డివిజన్ల సీఐలు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ సిహెచ్.వెంకన్నతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.