నిజామాబాద్

ఆయిల్ దుకాణాల్లో తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, నవంబర్ 23: ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథిగృహం ఎదురుగా ఉన్న ఆయిల్ దుకాణాల్లో గురువారం ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. న్యూ సంతోష్ ఆయిల్ మర్చంట్, సాయికృప, నవనాథ ఆయిల్ మర్చంట్‌లలో తనిఖీలు చేసి లూజ్(విడి)గా ఆయిల్‌ను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్యాకెట్లలోనే నూనెను విక్రయించాలనే ఆదేశాలు ఉన్నప్పటికి నిబంధనలు ఉల్లంఘించి ఆయిల్‌ను ఎందుకు విక్రయిస్తున్నారని ప్రశ్నించారు. లూజ్ ఆయిల్‌ను డబ్బాలలో సేకరించి సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అనంతరం సాయికృప ఆయిల్ మర్చంట్‌ను, నవనాథ్ ఆయిల్ మర్చంట్‌లను తనిఖీ చేసి సాంపీళ్లను సేకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయిల్ మర్చంట్‌లను తనిఖీ చేసి కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. సేకరించిన శాంపిళ్లను హైదరాబాద్‌లోని ల్యాబ్‌లకు పంపించి పరీక్షలు చేయిస్తామని అన్నారు. పరీక్షలలో ఆయిల్ కల్తీ జరిగినట్లు రుజువైతే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని టాస్క్ఫోర్స్ అధికారులు నాగరాజ్, వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయిల్ మర్చంట్‌లలో మంచినూనెను లూజ్‌గా విక్రయిస్తే ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్‌కు సమాచారం ఇవ్వాలని వారు చెప్పారు.

అయ్యప్పనగర్ కాలనీలో చోరీ
భీమ్‌గల్, నవంబర్ 23: భీమ్‌గల్ మండల కేంద్రంలోని కొత్తబస్టాండ్ ప్రాంతంలో గల అయ్యప్పనగర్ కాలనీకి చెందిన చక్ర సుదర్శన్(రిటైర్డ్ లైన్‌మెన్) ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి చోరీకీ పాల్పడ్డారు. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తాను అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స నిమిత్తం ఇంటికి తాళం వేసి నిజామాబాద్ ఆసుపత్రికి బుధవారం ఉదయం వెళ్లడం జరిగిందన్నారు. చికిత్స చేయించుకుని గురువారం ఉదయం వచ్చి చూసే సరికి ఇంటి తాళం పగుగొట్టి ఉందన్నారు. ఈ చోరీ సంఘటనలో బీరువాలో దాచి ఉంచిన 24వేల రూపాయల నగదును దొంగలు దోచుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. అలాగే ఈ నెలలోనే బస్టాండ్‌లో గల ఓ ఫైనాన్స్‌లో, మండల కేంద్రంలోని దక్కన్ గ్రామీణ బ్యాంకు ముందు గల శంకర ఆలయ ఎదుట గల ఆయిల్‌మిల్‌లో షెటర్ తాళం పగులుగొట్టి చోరీకి పాల్పడ్డారు. మండల కేంద్రంలో నిత్యం చోరీలు చోటు చేసుకుంటుండటంతో వ్యాపారులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుస చోరీలు జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మండల కేంద్రానికి చెందిన ప్రజలు కోరుతున్నారు.