నిజామాబాద్

పాత కేసుల సత్వర పరిష్కారానికి శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, నవంబర్ 23: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్లలో 2012కంటే ముందున్న పెండింగ్ కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం పోలీస్ స్టేషన్ అధికారులకు, కోర్టు కానిస్టేబుళ్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2012కంటే ముందు నమోదైన కేసులను 2018 మార్చి 31లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినందున, సీ.పీ కార్తికేయ వీటిని స్టాండడ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ పద్దతిలో పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగిందని అదనపు డీసీపీ(అడ్మిన్) ఆకుల రాంరెడ్డి తెలిపారు. ఇందులో సమాన్లు త్వరితగతిన సర్వ్ చేయడం, వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయడం, సాక్షులను కోర్టులో త్వరగా హజరుపర్చడం, అవసరానికి అనుకూలంగా స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసుకోవడం, ఇతర జిల్లాల్లో, రాష్ట్రాల్లో ఉన్న వారెంట్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, త్వరతగతిన ఎగ్జిక్యూట్ చేయడం తదితర అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో నిజామాబాద్, బోధన్ ఏసీపీలు ఎమ్.సుదర్శన్, ఏ.రఘు, ఏపీపీఓలు ఎస్.హరికృష్ణ, వి.సీనయ్య, ఇన్స్‌పెక్టర్లు, సబ్ ఇన్స్‌పెక్టర్లు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ పద్ధతిన వైద్యుల భర్తీకి చర్యలు
వినాయక్‌నగర్, నవంబర్ 23: జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలోని ఆసుపత్రుల్లో డాక్టర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు కాంట్రాక్ట్ పద్ధతిపై 10మంది వైద్యులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకట్ తెలిపారు. ఎంబీబీఎస్ పట్టా కలిగి ఉండి, 1 నుండి 10వ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యను అభ్యసించిన వారు కాంట్రాక్ట్ పద్ధతిన వైద్యులుగా ఎంపికయ్యేందుకు అర్హులని ఆయన పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 4వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట లోపు జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు తమవెంట ఒరిజినల్ సర్ట్ఫికెట్లతో పాటు ఒక జిరాక్స్ సెట్‌ను వెంట తీసుకురావాలని తెలిపారు. అభ్యర్థుల దరఖాస్తులు, సర్ట్ఫికెట్లను పరిశీలించిన మీదట మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిని అనుసరిస్తూ ఎంపికైన అభ్యర్థుల జాబితాను అదే రోజున సాయంత్రం నాలుగు గంటలకు వెల్లడించడం జరుగుతుందని డిఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకట్ వివరించారు.