నిజామాబాద్

విశాఖ ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీపేట, డిసెంబర్ 11: నవీపేట మండల కేంద్రంలోని రైల్వే గేట్‌ను దాటుతున్న వ్యక్తిని విశాఖ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ప్రమాదంలో నవీపేటకు చెందిన కే.గణపతి(55) అనే వ్యక్తి మృతి చెందాడు. సోమవారం రాత్రి 7గంటల ప్రాంతంలో విశాఖ ఎక్స్‌ప్రెస్ వెళ్తుడటంతో రైల్వే గేట్ మూసి వేయడం జరిగింది. అదే సమయంలో తాగిన మైకంలో ఉన్న కే.గణపతి అనే వ్యక్తి వేసిన ఉన్న గేటు దాటుకుని ముందుకు వెళ్తుండగా, విశాఖ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రుక్మ, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

బాన్సువాడలో గిరిజనుల ర్యాలీ
బాన్సువాడ రూరల్, డిసెంబర్ 11: బాన్సువాడ పట్టణంలోసోమవారం అన్ని పార్టీలకు చెందిన గిరిజన నాయకులు ఆత్మగౌరవ సన్నాహక ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీలో గిరిజన, విద్యార్థి, కుల సంఘాల నాయకులు, ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని భారీ ర్యాలీని అన్నీ వీధుల్లో నిర్వహించారు. ర్యాలీకి ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి జాగో బంజారా...మరోనగారాఅంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు. పట్టణంలోని అన్నీ వీధుల్లో ర్యాలీని చేపట్టారు. తదుపరి బాన్సువాడ ఇంచార్జీ ఆర్‌డీ ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా జీవీఎస్ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు నరేష్ రాథోడ్ మాట్లాడుతూ, ప్రభుత్వ గిరిజనుల మధ్య అంతర్యుద్ధాన్ని సృష్టించాలని చూస్తుందని ఆరోపించారు. ఆది వాసీలను రెచ్చగొట్టి గిరిజనుల ఐక్యతను దెబ్బతీయాలని ప్రయత్నిస్తోందని చెప్పారు. గిరిజనుల మధ్య చిచ్చు పెట్టడం సరైంది కాదని,గిరిజనుల మధ్య చిచ్చు పెడితే ఊపేక్షించేది లేదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీ ఆర్ ఎస్ నాయకుడు మోహన్ నాయక్, కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ రాథోడ్, బలరాం సింగ్, సునీల్ రాథోడ్, దేవీ సింగ్, ధన్ సింగ్, రాజు, గోపాల్ తదితరులు ఉన్నారు.

ఉర్దూ కళాశాలను సందర్శించిన మంత్రి పోచారం
బాన్సువాడ రూరల్, డిసెంబర్ 11: బాన్సువాడ పట్టణంలోని ఉర్దూ కళాశాలను సోమవారం రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. అందులో బాగంగా కళాశాలలో విధ్యార్థుల కోసం కావాల్సిన వౌళిక సదుపాయాల కల్పనలో ఏర్పడ్డ సమస్యలపై వివరాలడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా లెక్టరర్ల నియామకం కాకపోవడంతో పాఠ్యాంశాల బోధన అంతంత మాత్రంగానే సాగుతోందని కళాశాల ప్రిన్సిపాల్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అందుకు స్పందించిన మంత్రి ఉర్దూ కళాశాలకు ఆరు లెక్చరర్ల పోస్టుల నియామకం జరిగిందని, త్వరలోనే అట్టి పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే జూనియర్ కళాశాలకు కూడా మరో 12 పోస్టులు మంజూరైనట్టు మంత్రి తెలిపారు. కళాశాలలకు లెక్చరర్ల పోస్టుల మంజూరు కృషి చేసిన మంత్రిని అధ్యాపక బృంధం కలిసి ఘనంగా సన్మానించారు.