నిజామాబాద్

కల్యాణివాగు ప్రాజెక్ట్ దుస్థితి పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, డిసెంబర్ 11: సర్కార్ సొమ్ము సడక్ పాలు అన్నచందంగా జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు పరిరక్షణ కోసం, ఎల్లారెడ్డి మండలంలో కల్యాణివాగుపై నిర్మించిన కల్యాణివాగు ప్రాజెక్ట్ దుస్థితి రోజురోజుకు దుర్భరవౌతున్న పట్టించుకునే దిక్కులేకుండా పోతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కల్యాణివాగు ప్రాజెక్ట్ పరిస్థితిపై సర్కార్ పట్టించుకుని ఈ ప్రాజెక్ట్‌ను సద్వినియోగంలోకి తెస్తుందనుకున్న రైతన్నకు నిరాశే మిగులుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 7కోట్ల నిధుల మంజూరుతో నిర్మాణం ప్రారంభం అయి, ప్రాజెక్ట్ జాప్యంతో నిర్మాణం జరిగి పూర్తి అయ్యే నాటికి దాదాపు 15కోట్ల వ్యయం జరిగింది. 1998సంవత్సరంలో ఆనాటి సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌ను అట్టహాసంగా ప్రారంభించి జాతీకి అంకితం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం లోప భూయిష్టంగా ఉందంటూ ఆనాడే పత్రికలు ఎంత మొత్తుకున్న ఎవ్వరు పట్టించుకున్న పాపన పోకపోవడంతో ఈరోజు ప్రాజెక్ట్ ప్రధాన కాల్వద్వారా వరదనీటిని మళ్లీంచే బదులు ఇప్పుడు నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుండి సాగునీరు కల్యాణివాగు ప్రాజెక్ట్ ప్రధాన కాల్వ ద్వారా రివర్స్‌లో కల్యాణివాగు ప్రాజెక్ట్ జలాశయంలోకి వచ్చి చేరుతున్న పట్టించుకునే దిక్కుమొక్కులేదు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్తాయి నీటి మట్టంతో నిండుకుండాల ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు సంబందించి హెడ్‌స్లూయిస్ పవర్ స్టేషన్ వద్ద వరదనీరు మళ్లింపునీరు కలిసి చోట ఇసుక బస్తాలు వేసి, కొనే్నళ్ల పాటు రివర్స్ నీరు రాకుండా అడ్డుకట్టవేయడం గమనార్హం. రివర్స్‌లో వస్తున్న నీటి కోసం కొందరు రైతులు ఆనాడు అక్రమంగా ఏకంగా ప్రధాన కాల్వకు గండికొట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇలా ప్రధాన కాల్వకు కొట్టిన గండిని పూడ్చేందుకు దాదాపు ఆరోజు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కల్యాణివాగు ప్రాజెక్ట్ జలాశయం నుండి తీసిన ప్రధాన కాల్వను హెచ్‌ఎమ్‌బి రహదారిలో వంతెన నిర్మించి రెండు గేట్లను ఏర్పాటు చేశారు. కల్యాణివాగు ప్రాజెక్ట్ జలాశయం నిండిన తరువాత అదనంగా వస్తున్న నీటిని ఈరెండు గేట్లను ఎత్తివేసి, నీటిని నిజాంసాగర్ ప్రధాన కాల్వకు మళ్లిస్తుంటారు. ఈ తంతు కేవలం ఖరీఫ్‌కే పరిమితం అయ్యింది. రబీలో ఈ ప్రాజెక్ట్ దేనికి పనికిరాదు. ఖరీఫ్‌లో సైతం ప్రాజెక్ట్ రిజర్వాయర్‌లో నీటి వత్తిడి ఎక్కువగా ఉంటే ప్రాజెక్ట్ నీటిని ఏడు రేడియల్ గేట్లు ఎత్తివేసి నీటిని వాగులోకి విడుదల చేయడం కూడా కష్టమే. రేడియల్ గేట్లను కరెంట్ మోటర్స్‌తో ఎత్తాల్సి ఉండగా, కేవలం హైండిల్స్ ఉపయోగించి గేట్లను ఎత్తుతుంటారు. దీంతో ఒకసారి నీటి ఉద్ధృతి ఎక్కువగా రావడంతో రెండు రేడియల్ గేట్‌లు విరిగిపోయిన సంఘటనలు ఉన్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి వీటిని మరమ్మతులు చేయడం జరిగింది. నేటికి ప్రాజెక్ట్ ఏడు రేడియల్ గేట్లను ఎత్తేందుకు ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో ఏర్పాటు చేసిన కరెంట్ మోటర్లు తుప్పుపట్టిపోయాయి. కనీసం ఈ ప్రాజెక్ట్ వద్ద ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, అది కూడా ఏర్పాటు చేయలేదు. ఈ ప్రాజెక్ట్‌కు కుడి ఎడమ కాల్వలను మంజూరు చేసి అర్థంతరంగా గాలికి వదిలేశారు. తరువాత రెండు కాల్వల నిర్మాణం కూడా రద్దు చేయడం గమనార్హం. వర్షాకాలంలో మాత్రం ఈ ప్రాజెక్ట్‌కు స్థాయిని మించి కల్యాణివాగు నుండి నీటి ఉధ్దృతి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వద్ద సిబ్బంది కోసం నిర్మించిన ఒక భవనం భూత్‌బంగ్లాగా మారింది. ప్రాజెక్ట్ రిజర్వాయర్ నుండి రోడ్డు వరకు గల ప్రధాన కాల్వకు కనీసం సిమెంట్ లైనింగ్ కూడా లేదు. ఆధునీకి సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్న దశలో 1998లో 15కోట్లతో నిర్మాణం అయిన కల్యావాణి వాగు ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కల్యాణివాగుపై ఒక ఇంజనీరింగ్ అధికారుల కమిటీ వేసి, ఈ ప్రాజెక్ట్‌ను రైతులకు ఉపయోగపడే విధంగా తయారు చేసి, నీటి వృధా లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయకట్టు రైతులు అంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సరైన రీడిజైన్ చేస్తే ప్రాజెక్ట్ ఆయకట్టుకింద మండలంలో కనీసం ఒక పదివేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అనుకున్నంత సాగునీరు అందించే అవకాశం లేకపోలేదు. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి జిపి పరిధిలో ఉన్న ఈ కల్యాణివాగు ప్రాజెక్ట్ ద్వారా మండలంలోని రైతులకు సంబందించిన కనీసం ఒక ఎకరానికి నీరు అందించని దుస్థితిలో ఈ ప్రాజెక్ట్ ఉండటం గమనార్హం.

అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారుడికి సీపీ అభినందనలు
ఇందూర్, డిసెంబర్ 11: అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో విశేష ప్రతిభను చాటుతూ బంగారు పతకాన్ని సాధించిన క్రీడాకారుడు ఆకుల రోహిత్‌ను సోమవారం తన చాంబర్‌లో పోలీస్ కమిషనర్ కార్తికేయ అభినందించారు. నిజామాబాద్ అదనపు డీసీపీ(అడ్మిన్) ఆకుల రాంరెడ్డి కుమారుడైన రోహిత్‌కు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ క్రీడాకారుడిగా గుర్తించింది. ఈ నెల 3వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్టప్రతి రాంనాథ్‌కోవింద్ చేతుల మీదుగా రోహిత్ ఉత్తమ క్రీడాకారుడి అవార్డును అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పురస్కారాన్ని అందుకున్న ఏకైక క్రీడాకారుడు రోహిత్ కావడం విశేషం. దివ్యాంగుల క్రీడలకు సంబంధించి ఆస్ట్రేలియాలో 2013లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఆకుల రోహిత్ భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించి గోల్డ్‌మెడల్, సిల్వర్ మెడల్‌లను కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతనిని ఉత్తమ క్రీడాకారుడిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఢిల్లీలో రాష్టప్రతి చేతుల మీదుగా పురస్కారం అందించి గౌరవించింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని సోమవారం సీపీ కార్తికేయ రోహిత్‌ను పుష్పగుచ్ఛం, శాలువాతో సన్మానించి అభినందించారు. దివాంగుల క్రీడల్లో ప్రపంచ దేశాల స్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభను చాటడం ఎంతో గొప్ప విషయమని, ఇది తమ శాఖకు కూడా గర్వకారణమని సీ.పీ పేర్కొన్నారు. ఆకుల రోహిత్‌ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ దేశ ప్రతిష్ఠను ఇనుమడించేలా తీర్చిదిద్దిన తల్లిదండ్రులతో పాటు కోచ్‌ను కూడా ఈ సందర్భంగా అభినందించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఆకుల రాంరెడ్డి పాల్గొన్నారు.