నిజామాబాద్

భూపతిరెడ్డిపై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 13: అధికార టీఆర్‌ఎస్ పార్టీ శాసన మండలి సభ్యుడు డాక్టర్ ఆర్.్భపతిరెడ్డిపై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమైంది. ఆయనను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు తెరాస అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అధికారికంగా ప్రకటన వెలువరించడమే తరువాయిగా మారిందని టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామాలు టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కలకలం రేకెత్తించాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు, ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి మధ్య మొదటి నుండి తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొని ఉన్నాయి. ఇరువురు నేతలు, వారి అనుచరులు బాహాటంగానే పరస్పర ఆరోపణలకు దిగడం, సా మాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని దూషణల పర్వానికి పాల్పడడం ఇటీవలి కాలంలో నిత్యకృత్యంగా మా రింది. ఒకదశలోనైతే బాజిరెడ్డి, భూపతిరెడ్డిలు అందరి సమక్షంలోనే ఘర్షణ వైఖరిని ప్రదర్శిస్తూ, పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి సైతం వెళ్లడంతో, ఇటీవలే టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో భూపతిరెడ్డి తీరును కేసీఆర్ తప్పుబడుతూ మందలించారు. బాజిరెడ్డి కుమారుడిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఆదేశించడంతో భూపతిరెడ్డి పోలీస్ కేసు వాపస్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులంతా బుధవారం సాయంత్రం రాష్ట్ర రాజధానిలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో సమావేశమై భూపతిరెడ్డి వ్యవహార శైలిపై కూలంకషంగా చర్చ జరిపారు. ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ.పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్‌సింధే, షకీల్‌ఆమీర్, బిగాల గణేష్‌గుప్తా, ఎమ్మెల్సీ వీజీ.గౌడ్‌తో పాటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న తుల ఉమ ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భూపతిరెడ్డి అవలంభిస్తున్న తీరును, ఆయన వ్యవహార శైలిని ఆక్షేపిస్తూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మూకుమ్మడిగా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి చర్యలు పార్టీ ప్రతిష్ఠకు భంగం చేకూర్చే రీతిలో ఉన్నాయని ముక్తకంఠంతో అభిప్రాయపడుతూ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున అతనిపై సస్పెన్షన్ వేటు వేయాలని ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులంతా సిఫార్సు చేశారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న జిల్లా పార్టీ ఇన్‌చార్జి తుల ఉమ ఈ మేరకు భూపతిరెడ్డిని పార్టీ నుండి బహిష్కరించాలని కోరుతూ టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాయాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడడం ఖాయమని భావిస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డితో విభేదాలు కొనసాగిస్తుండడం వల్లే సస్పెన్షన్ వేటు వేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపు యత్నాల్లో ఉన్నాడనే సంకేతాల మేరకు ముందస్తుగానే అతనిపై బహిష్కరణ వేటుకు సిద్ధమై ఉంటారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.