నిజామాబాద్

ఎర్రజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, డిసెంబర్ 14: ఎర్రజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార చంద్రమోహన్ డిమాండ్ చేశారు. గురువారం ఆర్మూర్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ రైతు సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక అప్పుల పాలవుతున్నారని చెప్పారు. ఆర్మూర్ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో పండించే ఎర్రజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలని అన్నారు. అలా కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు సీడ్ కంపెనీల యాజమాన్యాలతో కుమ్మక్కై ఎర్రజొన్న పంటకు ధర రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. సీడ్ కంపెనీలు రైతుల వద్ద నుంచి 20 రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేసి ప్రభుత్వానికి 33 రూపాయలకు అమ్ముతున్నారని అన్నారు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తామని అన్నారు. మరో 45 రోజుల్లో ఎర్రజొన్న పంట చేతికి వస్తుందని, ప్రభుత్వం స్పందించి క్వింటాల్‌కు 4 వేల రూపాయల మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

స్వచ్ఛ భారత్‌కు చేయూతనివ్వండి
* కేంద్ర ప్రతినిధుల బృందం
మోర్తాడ్, డిసెంబర్ 14: సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛ భారత్ ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర ప్రతినిధుల బృందం సూచించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను సక్రమంగా వినియోగించుకోవాలని, బహిర్భూమికి వెళ్లే పద్ధతులను మానుకోవాలని హితవు పలికారు. మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో గురువారం కేంద్ర ప్రతినిధులు బృందం గంగప్ప ఆధ్వర్యంలో పరిశీలన జరిపారు. మోర్తాడ్ మండల కార్యాలయలో అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించిన అనంతరం, ప్రతినిధులు, అధికారులతో కలిసి ధర్మోరా గ్రామానికి వెళ్లారు. ధర్మోరా గ్రామ పంచాయతీలో గ్రామానికి చెందిన మహిళలతో అవగాహన సదస్సు నిర్వహించారు. స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని ప్రతినిధులు సమగ్రంగా వివరించారు. గ్రామంలో ఎన్‌బీఏ కింద నిర్మించిన 127, ఎస్‌బీఎం కింద నిర్మించిన 112మరుగుదొడ్లను ర్యాండమ్‌గా తనిఖీ చేశారు. నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వెళ్లి, వాటిని వినియోగిస్తున్నారా లేదా అంటూ అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి పారిశుద్ధ్య వ్యవస్థను పరిశీలించారు. ఎప్పటికప్పుడు మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తూ, పరిశుభ్ర వాతావరణాన్ని కల్పింపజేయాలని ఆదేశించారు.