నిజామాబాద్

క్రైస్తవ నిరుపేదల కోసమే దుస్తుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, డిసెంబర్ 14: గ్రామాలలోని నిరుపేద క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేసేందుకు, రాష్ట్ర సీఏం కేసీఆర్ సర్కార్ కృషి చేస్తుందని, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. గురువారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని బేరకాప్రార్థనా మందిరంలో, జుక్కల్ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబందించిన క్రైస్తవులకు మంజూరై దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జుక్కల్ నియోజకవర్గంలోని, నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్‌గల్, బిచ్‌కుందా, జుక్కల్, మద్నూర్ మండలాలకు 1000జతల దుస్తులు మంజూరైయ్యాయన్నారు. క్రైస్తవులను గౌరవించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలోని అభివృద్ది సంక్షేమ పథకాలలో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలోని మూడున్నర సంవత్సరాల పాలన కాలంలోనే భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ 1గా నిలిచిందన్నారు.ఈనెల 18వ తేదిన జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలోప్రభుత్వ పరంగాక్రైస్తవ సోదరులకు అధికారిక విందును ఏర్పాటు చేస్తున్నామని ఈకార్యక్రమానికి నియోజక వర్గంలోని ఆరుమండలాల క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. అనంతరం 6 మండాల నుంచి వచ్చిన క్రైస్తవ సోదరులకు, పాస్టర్‌లకు ఎమ్మెల్యే దుస్తులను పంపిణీ చేశారు. అంతకంటే ముందే క్రిస్మస్ కేక్‌ను కట్‌చేసి, పాస్టర్‌లకు ఎమ్మెల్యే తినిపించారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్‌లు బన్వాల్, కోదండ రాంరెడ్డి, గోవర్థన్, గిర్దావర్ సయ్యద్ హుసెన్, వైస్‌ఎంపిపి గోగుల పండరి, మాగి జిఎస్‌ఆర్ ఫ్యాక్టరీ సిడిసి చైర్మైన్ పట్లోళ్ల దుర్గరెడ్డి, సర్పంచ్ రాజు, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు గైని విఠల్, టిఆర్‌ఎస్ నాయకులు వినయ్‌కుమార్, గంగారెడ్డి, బిక్యా, మండల కో-ఆఫ్షన్ సభ్యులు అహ్మద్ హుసెన్ తదితరులు పాల్గొన్నారు.

రెండు ఆర్టీసి బస్సులు ఢీ: పది మందికి గాయాలు
ఎల్లారెడ్డి, కామారెడ్డిరూరల్, డిసెంబర్ 14: రెండు ఆర్టీసి బస్సులు వెనుక భాగంలోఢీకొన్న సంఘటనలోపది మంది ప్రయాణికులకు గాయాలైన సంఘటన, గురువారం రాత్రి కామారెడ్డి జిల్లాకేంద్రం సమీపంలోగల ఈఎస్‌ఆర్ గార్డెన్ వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి, ఆర్మూర్ డిపోకు చెందిన సూపర్ లక్సరీ బస్సును, ఎక్స్‌ప్రెస్ బస్సు వెనుక వైపునుంచి ఢీకొన్న సంఘటలోబస్సులోప్రయాణిస్తున్న పది మందికి గాయాలైయ్యాయి. గాయాలైన వారిలో రాజవ్వ, రాధలు వెల్లుట్ల గ్రామానికి చెందిన వారని, ఉమ తిమ్మాపూర్ గ్రామస్తురాలు, ఆనెమ్మ సికిందర్‌పూర్ గ్రామానికి చెందనదని వీరికి స్వల్పంగా గాయాలైయ్యాయి. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా, సంఘటన స్థలానికి చేరుకున్న 108 వాహనం సిబ్బంది ఈఎంటి రాములు, పైలట్ రామశంకర్‌లు మిగితాక్షతగాత్రులను , కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి చికిత్సల నిమిత్తం తరలించినట్లు తెలిపారు.

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
కంఠేశ్వర్, డిసెంబర్ 14: జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్ ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న రుచిత(16) విద్యార్థిని గురువారం ఆత్మహత్యకు యత్నించింది. కళాశాలలోని నాల్గవ అంతస్తు భవనం పై నుండి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌కు చెందిన రుచితను ఆమె తల్లిదండ్రులు నాణ్యమైన విద్య అందుతుందనే ఉద్దేశ్యంతో జిల్లా కేంద్రంలోని శ్రీమేధా కళాశాలలో చేర్పించారు. అప్పటి నుండి ఆమె కళాశాలకు చెందిన హాస్టల్‌లోనే ఉంటూ ఇంటర్ ఫస్టియర్ బై.పీసీ కోర్సు చేస్తోంది. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను గమనించిన కళాశాల వర్గాలు, సహచర విద్యార్థినులు హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సదరు విద్యార్థిని ఎందుకు ఆత్మహత్యకు యత్నించిందనే విషయమై కారణాలు వెల్లడి కాలేదు. రాత్రి వరకు కూడా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని నాల్గవటౌన్ పోలీసులు తెలిపారు.