నిజామాబాద్

టీఆర్టీసీ టీఎంయూ రిలే నిరాహార దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, డిసెంబర్ 14: ఏప్రిల్ నెల నుండి జరగాల్సిన వేతన సవరణలో జాప్యం జరుగుతున్నందుకు నిరసనగా గురువారం నుండి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి టీఆర్టీసీ డిపో ఎదుట టీఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఎంయూ చైర్మన్ సీతారాములు మాట్లాడుతూ, వేతన సవరణ జాప్యంతో పాటు పెంచి షెడ్యూల్స్ కిలోమీటర్లను తగ్గించేందుకు గుర్చి అప్పిళ్లకు వ్యతిరేకంగా జారీ చేసిన 1/2017సర్య్కూలర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల రద్దీ పెరిగిన దృశ్య కొత్త బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అద్ధెబస్సుల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కల్గుతున్న దృశ్య వెంటనే అద్దెబస్సులను రద్దు చేసి, తెలంగాణ ఆర్టీసి బస్సులను కొనుగోలు చేసి నడపాలని సూచించారు. ప్రతి డిపోలో మహిళ కండక్టర్లకు వసతి గదులను నిర్మించాలని, ఆర్టీసీలో ఖాళీ ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సకుల జనుల సమ్మె కాలనాన్ని స్పెషల్ లీవ్‌గా పరిగణించాలని అన్నారు. మొదటి రోజు రిలేనిరాహారదీక్షలో టిఎంయు ప్రతినిధులు ఎల్‌పి.రావు, కె.రమేష్, అంజయ్య, సాయులు, ఎస్. వెంకటేశ్, మోహన్, మురళి, రాజు, కుసుమ, సబిత, విమల, స్వాతి ఉన్నారు. ఈ దీక్షకు డిపో కార్యదర్శి జిఎస్. నారాయణ, డివిజన్ కార్యదర్శి కృష్ణమూర్తి, ప్రేమ్‌కుమార్, కృష్ణ, దేవేందర్, సంగారెడ్డి, గోపాల్, అంజయ్య, ఐఎస్.రెడ్డి, తదితరులు దీక్ష కార్యక్రమానికి సంబందించి గైడ్‌లైన్స్ అందించి రోజు వారి దీక్ష కార్యక్రమాల్లో కూర్చోనే వారిని నిర్ణయిస్తారని తెలిపారు.
డిపో-1 ఎదుట టీఎంయూ రిలే దీక్షలు
కంఠేశ్వర్: జీత భత్యాల సవరణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ డిపో-1 ఎదుట తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ టీఎంయు రాష్ట్ర కార్యదర్శులు మురళీధర్, వి.శ్రీనివాస్‌లు మాట్లాడుతూ, కార్మికులకు 2017 ఏప్రిల్ 1నుండి రావాల్సిన జీతభత్యాల సవరణను వెంటనే చేపట్టాలన్నారు. గ్యారేజీతో పాటు అన్ని కేటగిరిల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ, ప్రమోషన్లు కల్పించాలన్నారు. జాయింట్ సర్వే చేసి, గత 35/45షెడ్యూల్ సవరించాలని, అప్పులకు వ్యతిరేకంగా జారీ చేసిన 1/2017 సర్క్యూలర్‌ను రద్దు చేయాలని, కొత్త బస్సులను కొని, అద్దె బస్సులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. సకల జనుల సమ్మె కాలాన్ని స్పెషల్ లీవ్‌గా పరిగణించాలని, అన్ని డిపోల్లో మహిళా కండక్టర్లకు విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలన్నారు. గురువారం నాటి దీక్షా శిబిరంలో కొండల్‌వార్, సంజీవ్, ఆర్‌వి.రెడ్డి, రమణ, దేవరాం, మారుతి, వీవీ.రావ్, సాయులు, మాణిక్యం, శేఖర్‌లు కూర్చోగా, రీజినల్ కార్యదర్శి మాక్లూర్ శేఖర్, నర్సయ్య, డిపో కార్యదర్శి జి.నర్సయ్య,, జిజి.రాం, యాదగిరి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

నిజాంసాగర్ ప్రధాన కాలువలో ఆటోడ్రైవర్ గల్లంతు
నిజాంసాగర్, డిసెంబర్ 14: నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ డిస్ట్రీబ్యూటర్ 7 సమీపంలో, గురువారం మిషన్ భగీరథలోఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న అల్మాస్ నీటిలోగల్లంతైయ్యాడు. స్థానికులు తెలిపిన కథనం ప్రకరాల వివరాలు ఇలా ఉన్నాయి. రాజు,రాకేష్, అల్మాస్‌లు కలిసి ప్రధాన కాలువ వద్దకు వెళ్లారు. అల్మాస్ బహిర్భూమికి వెళ్లి నీటిలోకడుక్కునేందుకు వెళ్లగా,ప్రమాద వశాత్తుగా కాలు జారీ నీటిప్రవాహంలోకోట్టుకు పోయి గల్లంతైయ్యాడు, నీటిలోమునిగిన అల్మాస్‌ను రక్షించేందుకు తోటి స్నేహితులు రాజు, రాకేష్‌లు విశ్వప్రయత్నం చేశారు. అప్పటికే అల్మాస్ నోటిలోనికి నీరు పోవడంతోనీటిలోమునిగి ప్రవాహంలోగల్లంతైయ్యాడు. సమాచారం తెలుసుకున్న నిజాంసాగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. యువకుని ఆచూకి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడ్తున్నామని ఎఎస్‌ఐ గాంధీగౌడ్, హెడ్‌కానిస్టేబుల్ సత్తయ్యలు తెలిపారు.