నిజామాబాద్

ప్రపంచ తెలుగు మహాసభల్లో తొలి శతావధానికి ప్రత్యేక గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, డిసెంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో మోర్తాడ్‌కు చెందిన నైజాంరాష్ట్ర తొలి శతావధాని కృష్ణమాచార్యులకు ప్రత్యేక గుర్తింపు లభించింది. 1928లోనే నైజాం రాష్ట్ర ఆధ్య శతావధానిగా బిరుదు పొందిన శిరిశినహళ్ కృష్ణమాచార్యుల స్వస్థలం నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్. సంస్కృత భాషా పండితులుగా జీవనోపాధికై కోరుట్లలోని వేద పాఠశాల ప్రిన్సిపాల్‌గా పదవి బాధ్యతలు చేపట్టి, ఎందరికో సంస్కృతాంధ్ర భాషలను, వేద విద్యను, కర్క వ్యాకరణాన్ని బోధించి విశేష బిరుదాంకితులుగా ప్రసిద్ధి పొందారు. ప్రస్తుతం ప్రపంచ మహాసభల్లో ప్రత్యేకంగా శతావధాని కృష్ణమాచార్యుల పేరిట శతావధాన కళా వేదికను ఏర్పాటు చేయడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు వారి శిష్యగణం హర్షం వ్యక్తం చేస్తోంది. 1905లో జన్మించిన కృష్ణమాచార్యులు, అనేక గ్రంథాలను రచించడంతో పాటు విశేష బిరుదునలు పొందారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. 1923లో కోరుట్లకు వెళ్లి వేదాంతద్వయవర్ధిని పాఠశాలలో సంస్కృతాంధ్ర అధ్యాపకులుగా చేరారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, జగిత్యాల, ధర్మపురి ఆలయాల్లోనూ శతావధానాలు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో పర్వపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అలాంటి శతావధాని కృష్ణమాచార్యులను స్మరిస్తూ ప్రపంచ తెలుగు మహాసభల్లో వేదికను ఏర్పాటు చేయడం, ఈ నెల 16నుండి 19వరకు అవధానాలు నిర్వహిస్తుండటంతో కుటుంబ సభ్యులు, శిష్యగణం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది.

దేవుడి దూతలే పాలకులు
* క్రైస్తవులకు దుస్తుల పంపిణీలో మంత్రి పోచారం
బాన్సువాడ రూరల్, డిసెంబర్ 14: ప్రజలకు సేవ చేయడంతో పాటు మంచి చెడులను చూసేందుకే దేవుడి ప్రతినిధులుగా తమను పాలకుల రూపంలో పంపించారని, ఇదే దేవుడి లీలగా భావించాలని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం నుండి వచ్చిన దుస్తులను వారికి అందించారు. అదే విధంగా మంత్రి క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగలో భాగంగా నియోజక వర్గానికి వెయ్యి వరకు దుస్తులు మంజూరు అయ్యాయని, మండలానికో 300 దుస్తుల చొప్పున పేదలైన క్రైస్తవులకు అందించేందుకు అధికారులు, క్రైస్తవ పెద్దలపై బాధ్యతను అప్పగించడం జరిగిందన్నారు. కులమతాలకు అతీతంగా ప్రభుత్వం అన్ని వర్గాల వారికి దైవ భక్తిలో భాగంగా పండుగ పర్వదినాలను పేద ప్రజలు సంతోషంగా జరుపుకునేందుకు గాను దుస్తులతో పాటు విందు బోజనాలను గత మూడేళ్ల నుండి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. క్రిస్మస్‌కు క్రైస్తవులకు, రంజాన్‌కు మైనార్టీలకు, దసరాకు హిందువులకు పండుగ సంబరాలను జరుపుకునేందుకు కావల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పేదల కోసం పక్కా గృహాలు, గూడు, గుడ్డ, నీటిని అందించే లక్ష్యంతో ఉన్నామన్నారు. సీఎం కేసీఆర్ డబుల్‌బెడ్ రూంలతో నీడను కల్పిస్తున్నారని, పండుగలో దుస్తులను అందించి గుడ్డను ఇచ్చామని, కిలో రూపాయి బియ్యం అందించి భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. దేవుడిపై విశ్వాసం ఉన్న వారికి ఎప్పటికీ మంచే జరుగుతుందని, వారిపై దేవుడి ఆశీస్సులు ఎళ్లవేళలా ఉంటాయని ఆయన అన్నారు. యేసు ప్రభువుపై తనకు కూడా పూర్తి విశ్వాసం ఉందన్నారు. పలు సందర్బాల్లో ఏసు ప్రభు లీలలను తాను అనుభూతి పొందానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. పేదవారిని గౌరవిస్తే వారి నుండి అభిమానాన్ని చూరగొనవచ్చునన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పండుగ కానుకలను మనస్ఫూర్తిగా క్రైస్తవులు స్వీకరించాలని చెప్పారు. అలాగే బాన్సువాడలో చర్చి అభివృద్ధికి గాను క్రైస్తవ పెద్దలు కోరిన విధంగా చర్చీ అభివృద్ధి కోసం కావాల్సిన నిధులను మంజూరు చేస్తామన్నారు. సీఎం. కేసీఆర్ కూడా నిజామాబాద్ చర్చీ ప్రగతి అడిగిందే తడువుగా నూతన భవన నిర్మాణం కోసం నాలుగు కోట్లు నిధులను మంజూరు చేశారని, బాన్సువాడ చర్చీల బాగు కోసం తాను సీఎం. దృష్టికి తీసుకుపోయి పెద్ద ఎత్తున నిధులను సమకూర్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీఓ రాజేశ్వర్, డీఎస్పీ నరిసింహారావ్, ఎ ఎంసీ చైర్మెన్ నార్ల సురేష్, ఎజాజ్, బాబా, జంగం గంగాధర్, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, బోర్లం శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్ రెడ్డి, క్రైస్తవ చర్చి పాధర్లు ఉన్నారు.