నిజామాబాద్

నష్టాన్ని పూడ్చేనా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఏప్రిల్ 15: పెరుగుతున్న టమాటాల ధర తమకు వస్తున్న నష్టాలను పూడిస్తే బాగుండునని రైతులు అభిప్రాయపడుతున్నారు. పక్షం రోజుల క్రితం వరకు కిలో 5రూపాయలు పలికిన టమాట ధర, గడిచిన నాలుగు రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమాట ధర 25రూపాయలకు చేరింది. వ్యాపారులు సైతం టమాట పండించిన భూముల్లోకి వెళ్లి నేరుగా రైతుల వద్ద ఖరీదు చేసిన టమాటలను మార్కెట్‌కు తెస్తున్నారు. వాస్తవానికి టమాట, కొత్తిమీర పంటలపై రైతులు భారీగా ఆశలు పెంచుకున్నారు. కొత్తిమీర పంట వారి ఆశలను వమ్ము చేయకపోయినా, టమాట మాత్రం దారుణంగా దెబ్బతీసింది. ఒకవైపు సాగునీటి కొరతను అధిగమిస్తూ బిందుసేద్యం ద్వారా టమాట పంటను సాగు చేశారు. అయితే రోజురోజుకీ పెరుగుతున్న ఎండల తీవ్రతతో ఎంత నీరందించినా టమాట మొక్కలు వాడిపోతూ ఎదుగుదల లోపించింది. దిగుబడులపై ప్రభావం చూపుతున్న తరుణంలో ఎలాగైనా పెట్టుబడులు తిరిగి పొందాలనే లక్ష్యంతో రైతులు విరివిగా మందులను పిచికారి చేస్తున్నారు. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. సంవృద్ధిగా జలాలు ఉన్న పంట భూముల్లో మాత్రం నిర్వీరామంగా సాగునీరు అందిస్తున్న నేపథ్యంలో టమాట కాయలు కూడా ఎక్కువగా కాశాయి. మిగతా భూముల్లో మాత్రం టమాటల్లో ఎదుగుదల లోపించడంతో వ్యాపారులు సైతం వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. నిన్నమొన్నటి వరకు టబ్బు టమాట ధర 50రూపాయలు పలుకగా, ప్రస్తుతం అది పంట నాణ్యతను బట్టి 250నుండి 300రూపాయల వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో ఏర్పడుతున్న నష్టాన్ని పూడ్చుకోవాలనే లక్ష్యంతో రైతులు టమాట పంటపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. దిగుబడులు తగ్గినప్పటికీ, పెరిగిన ధర పూర్తిస్థాయిలో లభిస్తే పెట్టుబడులు చేతికి అందినట్లేనని రైతులు అంటున్నారు. ఇదిలా ఉండగా, కొత్తిమీర పంట మాత్రం రైతులకు లాభాలు సమకూర్చుతోంది. 20రోజుల వ్యవధిలో ఎకరం కొత్తిమీర ధర లక్ష రూపాయలకు చేరింది. ప్రస్తుతం ఏపుగా పెరిగిన కొత్తిమీరకు వ్యాపారులు లక్షా 20వేల రూపాయల వరకు కూడా ధర చెల్లిస్తుండటంతో పంట సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ, రబీ సీజన్‌లో సాగు చేసిన పంటలు ఖరీఫ్ పంటలకు ఊతమిస్తే సరిపోతుందన్న అభిప్రాయంతో రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.