నిజామాబాద్

పరుగులు పెడుతున్న రోడ్ల వెడల్పు పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ రూరల్, జనవరి 18: రోడ్ల వెడల్పు పనులపై రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ అధికారులతో పనుల నిర్వహణపై గురువారం ఆరా తీశారు. పనులు నాణ్యతగా వేగవంతం కావాలని ఆదేశించారు. బాన్స్‌వాడ-కామారెడ్డి రహదారి రోడ్డు వెడల్పు పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లకు ఆయన ఆదేశాలు జారీచేశారు. విద్యుత్ లైన్‌ను పనుల్లో ఏలాంటి జాప్యంలేకుండా చూడాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాన్సువాడ ప్రధాన రహదారికిగాను ముందుగా 8కోట్లు మంజూరు చేశారు. పనులను పూర్తి చేసేందుకు రెండవ విడత కింద మరో 30కోట్లు మంజూరు చేశారు. దాంతో పక్షం రోజుల నుండి పనులు స్పీడందుకున్నాయి. ఇవే కాకుండా బాన్సువాడ శివారు ప్రాంతం నుండి హైవే లైన్ ఏర్పాటు కోసం కూడా నిధులు మంజూరు కానున్నాయి. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారుల రోడ్ల విస్తర్ణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 1200కోట్ల రూపాయల నిధుల మంజూరుకు క్లియరెన్స్ తీసుకోనుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల బాన్సువాడలో వెల్లడించిన విషయం గమనార్హం. నర్సాపూర్ నుండి బాసర్ వరకు జాతీయ రహదారి రోడ్డు విస్తరణ కోసం 600కోట్ల నిధుల మంజూరుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. అలాగే మెదక్ నుండి బాన్సువాడ మీదుగా రుద్రూర్ వరకు నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం మరో 600కోట్ల నిధుల మంజూరుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా నిధుల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ చూపింది. మొదటి విడతలో భాగంగా ఆరు వందల కోట్ల నిధులను మంజూరు చేసేందుకు ఓకే చెప్పేసింది. అలాగే రుద్రూర్ నుండి పోతంగల్ మీదుగా మద్నూర్‌కు రోడ్డు విస్తరణ కోసం నిధుల మంజూరుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి విడతగా నర్సాపూర్ నుండి బాసర్ వరకు రోడ్డు విస్తరణ పనులను చేపడుతుండగా, రెండవ విడతగా మెదక్ నుండి రుద్రూర్ వరకు రోడ్డు పనులను జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాన్సువాడ నుండి పొతంగల్ వయా బీర్కూర్ మీదుగా 22కిలోమీటర్ల రోడ్డు పనులకుగాను 28కోట్లతో పనులను పూర్తి చేశారు. బాన్సువాడ నుండి పిట్లం వరకు రోడ్డు పనులకుగాను 20కోట్ల నిధులు మంజూరు కాగా పనులు చురుగ్గా సాగుతున్నాయి. బాన్సువాడ నుండి బిచ్కుంద వరకు 25 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి అయ్యాయి. బాన్సువాడ నుండి కామారెడ్డి హైవే రోడ్డు పనులు కూడా పూర్తి అయ్యాయి. 11 కోట్లతో కృష్ణానగర్ తండా నుండి మొండి సడాక్ వరకు ఫోర్‌లైన్ రోడ్డు పనులు వేగవంతంగా సాగుతున్నాయి. టిఆర్‌ఎస్ సర్కార్ అధికారంలో వచ్చాక ప్రతి మండలానికి డబుల్ రోడ్ల నిర్మాణం చేస్తామని సీఎం. కేసీఆర్ చేసిన హామీ ప్రకారం పనులు మాత్రం ఉపందుకుంటున్నాయి. రాష్ట్ర రహదారులపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా దృష్ట్యా వాటిని నేషనల్ హైవేలుగా రూపాంతరం చేసి ప్రజలకు సురక్షిత రవాణా సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నేషనల్ హైవేల రోడ్ల విస్తరణతో దీర్ఘకాలంగా ఉన్న రోడ్ల సమస్య పూర్తిగా పరిష్కారానికి నోచుకోనుంది. చాలా ఏళ్ల నుండి బైపాస్ రోడ్డు కోసం చేసిన ప్రయత్నాలు ఇనే్నళ్లకు ఫలించాయి. రోడ్డు వెడల్పు పనులు పూర్తయితే బాన్సువాడ డివిజన్ కేంద్రానికి రాకపోకల అంతరాయం దాదాపుగా తగ్గిపోతుంది. అలాగే ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఏర్పడుతోంది. రోడ్డు వెడల్పు పనులు పూర్తి కాగానే రైల్వే లైన్ ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు మొదలవుతున్నాయి.