నిజామాబాద్

నేరస్థులపై ప్రత్యేక నిఘా పెట్టేందుకే పోలీసు సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జనవరి 18: భవిష్యత్తులో నేరస్థులపై ప్రత్యేక నిఘా పెట్టేందుకు సకాల నేరస్థుల సమగ్ర పోలీస్ సర్వేను ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ శే్వతరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంతో పాటు లింగంపేట్, బాన్స్‌వాడ, పిట్లం, సదాశివనగర్ మండలాల్లో జరుగుతున్న సమగ్ర సర్వేను ఆకస్మీకంగా ఎస్పీ తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఈ సర్వేలో నేరస్థుల యొక్క వివరాలు సేకరించి ఆ వివరాలకు సాంకేతిక పరిజ్ఞానం జోడించి పోలీసుస్టేషన్‌లో ప్రతి ఒక్కరు తమ తమ పరిధిలో నేరాలపై నేరస్తులపై పూర్తి అవగాహనను తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఇదివరకే సీటీపోలీసులు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో విజయవంతంగా చేపట్టడం జరిగిందని, ఇలా నిర్వహించడంతో సీటీలో 20శాతం నేరాలు తగ్గినట్లు వెల్లడించారు. ఇలాంటి ఫలితాలనే రాష్ట్ర వ్యాప్తంగా సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సర్వతోముఖాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా చేసేందుకు ఈకార్యక్రమం ఎంతగానో దోహదపడ్తుందని అన్నారు. ఈసర్వేకు ఈనెల 7వ తేదిన అధికారులకు, సిబ్బందికి శిక్షణ అందించామని అన్నారు. జిల్లాలో ముగ్గురు డిఎస్పీలు, 11మంది సిఐలు, 32మంది ఎస్‌ఐలు, కలిసి మొత్తం 427మంది, 165బృంధాలుగా ఏర్పడి జిల్లాలో ఉన్న 23పోలీసుస్టేషన్‌ల పరిధిలో ఈసర్వే చేస్తున్నట్లు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలో ఉన్న 2,848మంది నేరస్థులకు గాను 1170మంది నేరస్థుల వివరాలను సేకరించామని అన్నారు.