నిజామాబాద్

డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 18: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖలకు చెందిన ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశమై డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించకుండా, నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసేలా చూడాలన్నారు. పనులను నిరంతరం పర్యవేక్షణ జరుపుతూ, ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే వాటిని పరిష్కరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణ పనుల్లో ప్రతిష్ఠంభన తలెత్తకుండా చూసుకోవాలని, ప్రభుత్వం ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న దృష్ట్యా సకాలంలో పనులు పూర్తయ్యేందుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుండి ఆమోదం లభించి, స్థల నిర్ధారణ జరిగిన చోట వెంటనే టెండర్లను పిలిచి సత్వరమే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ద్వారా 47 ఆవాసాల్లో, ఆర్ అండ్ బీ శాఖ ద్వారా 37 ఆవాసాల్లో పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినందున వీటిని సత్వరమే ప్రారంభించి, నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఏ.రవీందర్‌రెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ మధుసూదన్‌రెడ్డి, ఈ.ఈ హన్మంత్‌రావు, పంచాయతీరాజ్ ఎస్.ఈ ప్రేమ్‌కుమార్, ఆర్డీఓలు వినోద్‌కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.