నిజామాబాద్

సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జనవరి 21: సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికి యోగా ఎంతో అవసరం అని జిల్లా ఎస్పీ శే్వతారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో భారత స్వాభీమాన్ జిల్లా యోగా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రెండవ రోజు యోగా శిక్షణ శిబిరానికి ఉదయం హాజరైన ఎస్పీ యోగాకు హాజరు అవుతున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, యోగాసనాలు కేవలం యోగా ఉప ఉత్పన్నాలే అని, అష్టాంగ యోగసనాలు అనుసరించినప్పుడు సంపూర్ణ శరీరక, మానిసిక ఆరోగ్యం ప్రాప్తిస్తుందన్నారు. ప్రతి వ్యక్తి ఆలోచన విధానంలో మార్పు రావాలని, అప్పుడే సమాజంలో మార్పు తీసుకురావచ్చన్నారు. యోగా ప్రతి వ్యక్తి జీవితలో మార్పు తీసుకువచ్చే బలమైన శక్తి అన్నారు. ప్రతి రోజు ఉదయం యోగా చేసిన వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, అనారోగ్యాల భారీన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చని అన్నారు. తెల్లవాజరు జామునే లేవడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఉదయం లేవగానే శరీరానికి పని కల్పించాలని, వాకింగ్, యోగా, ఎక్సైర్ సైజు లు లాంటివి తప్పనిసరి చేయాలనిన్నారు. ముఖ్యంగా యోగా నేర్చుకోవడంవల్ల దీర్ఘకాలిక రోగాలకు యోగా మందులా పనిచేస్తుందన్నారు. శిబిరంలో 150 మంది రోజు యోగా శిక్షణ పొందుతున్నారు. గురుజీ బాణుదాస్ రెండవరోజు ప్రాణయామంపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో యోగా నిర్వహకులు భారత స్వాబీమాన్ జిల్లా ప్రతినిధి గడ్డం రాంరెడ్డి, చైర్మన్ గరిపల్లి అంజయ్యలు పాల్గొన్నారు.

నిరుపేదల కోసమే డబుల్ బెడ్‌రూం ఇళ్లు
* ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్
కామారెడ్డి రూరల్, జనవరి 21: రాష్ట్రంలోని నిరుపేదల కోసమే ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పధకాన్ని సీఎం కేసిఆర్ ప్రారంభించారని ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ అన్నారు. ఆదివారం మండలంలోని పాత రాజంపేట్ గ్రామంలోనిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి కాగానే దరఖాస్తులు చేసుకున్న లబ్దిదారులకు అధికారులచే సర్వే చేయించి ఇళ్లు లేని ప్రతీ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందన్నారు. కాలనీలో తాగునీరు, పారిశుద్ద్యంపై కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే తన నిధుల నుండి తాగు నీటి కోసం రెండు బోరుమోటార్లను మంజూరు చేయిస్తానని తెలిపారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు అంజనేయులు, ఆత్మ కమిటీ చైర్మెన్ బల్వంత్‌రావు, గ్రామ సర్పంచ్ హైమద్, ఉప సర్పంచ్ నరేష్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు లక్కాకుల రాజ్‌కుమార్ పాల్గొన్నారు.